ఆప్‌కు గట్టి ఝలక్‌.. బీజేపీలోకి జంప్‌! | AAP MLA Ved Prakash joins BJP, to resign from assembly | Sakshi
Sakshi News home page

ఆప్‌కు గట్టి ఝలక్‌.. బీజేపీలోకి జంప్‌!

Published Mon, Mar 27 2017 2:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఆప్‌కు గట్టి ఝలక్‌.. బీజేపీలోకి జంప్‌! - Sakshi

ఆప్‌కు గట్టి ఝలక్‌.. బీజేపీలోకి జంప్‌!

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు అనూహ్యంగా బీజేపీలోకి జంప్‌ అయి షాక్‌ ఇచ్చారు. భావన నియోజకవర్గం ఎమ్మెల్యే వేదప్రకాశ్‌ సతీశ్‌ సోమవారం ఆప్‌కు రాజీనామా చేసి.. కమలం గూటికి చేరారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్‌ విఫలమైందని, ఆ పార్టీలో కొనసాగడం తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని, అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు కటించారు. ఎమ్మెల్యే పదవికి, ఇతర ప్రభుత్వ పదవులకు కూడా రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు.

కీలకమైన ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ ఎమ్మెల్యేను తనవైపు తిప్పుకోవడం బీజేపీ రాజకీయంగా పైచేయి సాధించినట్టు అయింది. సోమవారం ఢిల్లీ బీజేపీ చీప్‌ మనోజ్‌ తీవారి సమక్షంలో వేదప్రకాశ్‌ కమలం కండువా కప్పుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీకి ఝలక్‌ ఇవ్వాలని బీజేపీ ఇప్పటినుంచి పావులు కదుపుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement