Ved Prakash
-
ఆప్‌కు గట్టి ఝలక్.. బీజేపీలోకి జంప్!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు అనూహ్యంగా బీజేపీలోకి జంప్ అయి షాక్ ఇచ్చారు. భావన నియోజకవర్గం ఎమ్మెల్యే వేదప్రకాశ్ సతీశ్ సోమవారం ఆప్‌కు రాజీనామా చేసి.. కమలం గూటికి చేరారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ విఫలమైందని, ఆ పార్టీలో కొనసాగడం తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని, అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు కటించారు. ఎమ్మెల్యే పదవికి, ఇతర ప్రభుత్వ పదవులకు కూడా రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. కీలకమైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేను తనవైపు తిప్పుకోవడం బీజేపీ రాజకీయంగా పైచేయి సాధించినట్టు అయింది. సోమవారం ఢిల్లీ బీజేపీ చీప్ మనోజ్ తీవారి సమక్షంలో వేదప్రకాశ్ కమలం కండువా కప్పుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఝలక్ ఇవ్వాలని బీజేపీ ఇప్పటినుంచి పావులు కదుపుతోంది. -
బంగారు నాణేల విక్రయానికి ఎస్బీఐతో ఎంఎంటీసీ జట్టు!
వదోదర: ప్రభుత్వ తయారీ బంగారు కారుున్ల విక్రయానికి ఎస్బీఐతో ఒప్పందం చేసుకోనున్నట్టు ఎంఎంటీసీ చైర్మన్ వేద్‌ప్రకాశ్ తెలిపారు. ఎంఎంటీసీ ఇప్పటికే డజను బ్యాంకులతో ఈ విధంగా టైఅప్ అరుు్య లక్ష కారుున్లను విక్రరుుంచినట్టు ఆయన చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో 5 లక్షల కారుున్ల విక్రయాన్ని లక్ష్యంగా విధించుకున్నట్టు తెలిపారు. ఎంఎంటీసీ 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల పరిమాణంలో కారుున్లను విక్రరుుస్తోంది. -
వర్సిటీల్లో వివేకానంద కార్యక్రమలు: యూజీసీ
సాక్షి, న్యూఢిల్లీ: స్వామి వివేకానంద 153వ జయంతి సందర్భంగా జనవరి 12న ఆయన ఆలోచనలు, ప్రభోధాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) దేశంలోని అన్ని వర్సిటీలకు కోరింది. తన ప్రభోధనల ద్వారా దేశ, విదేశాల్లో వివేకానంద చెరగని ముద్ర వేశారని, ఆయన ప్రభోధనలు దేశ యువతకు స్పూర్తిదాయకమని యూజీసీ చైర్మన్ వేద్ ప్రకాశ్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వారసత్వాన్ని పరిరక్షంచడమే కాకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేపై కాల్పులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈశ్వర్ కాలనీలోని తన కార్యాలయం వెలుపలే వేద ప్రకాశ్ పై దుండగులు కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. బవానా నియోజకవర్గానికి వేద ప్రకాశ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
ఎంఎంటీసీలో 15% ప్రభుత్వ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎంఎంటీసీలో 15 శాతం వాటాలు విక్రయించడం ద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం దాదాపు 15 కోట్ల షేర్లను విక్రయించవచ్చని సంస్థ చైర్మన్ వేద్ ప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం రూ. 52.80గా ఉన్న ఎంఎంటీసీ షేరు ధరను బట్టి చూస్తే డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 800 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎంఎంటీసీలో కేంద్రానికి 80.93 శాతం వాటాలు ఉన్నాయి. మరోవైపు, ఆంక్షలు సడలించిన దరిమిలా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంఎంటీసీ 50 టన్నుల మేర పసిడి దిగుమతి చేసుకోనున్నట్లు వేద్ ప్రకాశ్ తెలిపారు. అలాగే, వెండి దిగుమతులు 200 టన్నులకు పెరుగుతాయన్నారు.