స్వామి వివేకానంద 153వ జయంతి సందర్భంగా జనవరి 12న ఆయన ఆలోచనలు, ప్రభోధాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని యూజీసీ దేశంలోని అన్ని వర్సిటీలకు కోరింది.
సాక్షి, న్యూఢిల్లీ: స్వామి వివేకానంద 153వ జయంతి సందర్భంగా జనవరి 12న ఆయన ఆలోచనలు, ప్రభోధాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) దేశంలోని అన్ని వర్సిటీలకు కోరింది.
తన ప్రభోధనల ద్వారా దేశ, విదేశాల్లో వివేకానంద చెరగని ముద్ర వేశారని, ఆయన ప్రభోధనలు దేశ యువతకు స్పూర్తిదాయకమని యూజీసీ చైర్మన్ వేద్ ప్రకాశ్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వారసత్వాన్ని పరిరక్షంచడమే కాకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.