‘ఆప్’ నేతలపై గంభీర్ గరం గరం | Gautam Gambhir angry with AAP politicians as Delhi health crisis deepens | Sakshi
Sakshi News home page

‘ఆప్’ నేతలపై గంభీర్ గరం గరం

Published Sun, Sep 18 2016 1:34 PM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

‘ఆప్’  నేతలపై గంభీర్ గరం గరం - Sakshi

‘ఆప్’ నేతలపై గంభీర్ గరం గరం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులపై టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకోకుండా ఆప్ నాయకులు విదేశీ పర్యటనలకు వెళ్లడంపై మండిపడ్డాడు. డెంగీ, చికెన్ గున్యా బారిన పడి బాధితులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి పాలవుతుంటే నాయకులు విదేశీ యాత్రలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. దేశరాజధానిలో ఒక్కోసారి నీట సమస్య తలెత్తుతుందని, ఇప్పుడు దోమలు కారణంగా చికెన్ గన్యా వ్యాపించిందని ట్వీట్ చేశాడు.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పాలకులు విదేశాలకు వెళ్లారని చురక అంటించాడు. జ్వరాలతో ప్రజలు చనిపోతూవుంటే విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు స్టడీ టూర్ కు రాజకీయ నేతలు విదేశాలకు వెళ్లారని వాపోయాడు. ‘పాఠశాలలు వేచివుంటాయి. మరణం వేచివుండదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. రాజకీయాలు కట్టిపెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని గంభీర్ హితవు పలికాడు. డెంగీ, చికెన్ గున్యా కారణంగా ఢిల్లీలో 10 మంది మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement