ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేయించండి | Why Don't You Arrest All AAP MLAs At Once: Manish Sisodia | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేయించండి

Published Mon, Jun 27 2016 9:11 AM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేయించండి - Sakshi

ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేయించండి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మరోసారి విమర్శలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి అరెస్ట్ చేయించండి అంటూ సవాల్ చేశారు.

కేంద్రంలోని రాజకీయ పెద్దలు.. ఆప్ ఎమ్మెల్యేలను ఎలాగైనా, ఏదో ఒక కారణంతో జైల్లో పెట్టించాలని చూస్తున్నారని సిసోడియా ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను ఆరెస్ట్ చేయించాలని భావిస్తే.. అందరినీ కలసికట్టుగా ఎందుకు అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. కేంద్రం ఢిల్లీ పోలీసులు బలగాలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే దినేష్ను పోలీసులు అరెస్ట్ చేయగా, సిసోడియా తమను దూషించారంటూ వ్యాపారవేత్తలు ఆయనపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం సిసోడియా, ఆప్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తూ రేసుకోర‍్సు రోడ్డులోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement