delhi deputy chief minister
-
Supreme Court: సిసోడియాకు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో 17 నెలల క్రితం అరెస్టయి తిహార్ జైలులో విచారణ ఖైదీగా గడుపుతున్న ఆప్ నేత, నాటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో బెయిల్ దొరికింది. సుదీర్ఘకాలంపాటు కేసు దర్యాప్తును సాగదీసి విచారణ ఖైదీకుండే హక్కులను కాలరాయలేమని శుక్రవారం బెయిల్ ఉత్తర్వులిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం సిసోడియాకు బెయిల్‌ను మంజూరుచేస్తూ 38 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ ఆరో తేదీన వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌చేసి ఆగస్ట్ 9వ తేదీన వెలువరించింది.వైకుంఠపాళి ఆడించారు.. ‘‘బెయిల్ అనేది నియమం. బెయిల్‌ను తిరస్కరించి విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయడం అనేది ఒక మినహాయింపు’’ మాత్రమే అనే సూత్రాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన సమయమిది. బెయిల్ విషయంలో విచారణ కోర్టులు, హైకోర్టులు సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. మనీశ్‌పై సీబీఐ, ఈడీలు దర్యాప్తు పూర్తిచేసి జూలై 3 కల్లా చార్జ్షీట్లు సమర్పిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గతంలో హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. సిసోడియాను ట్రయల్ కోర్టుకు, అక్కడి నుంచి హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టుకు, మళ్లీ ట్రయల్ కోర్టుకు తిప్పుతూ ఆయనతో వైకుంఠపాళి ఆట ఆడించారు. బెయిల్ అనివార్యమైన కేసుల్లోనూ బెయిల్ తిరస్కరించడంతో సంబంధిత పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెల్లువలా వస్తున్నాయి. సమాజంతో మమేకమైన సిసోడియా లాంటి వ్యక్తులను శిక్ష ఖరారు కాకుండానే సుదీర్ఘ కాలం నిర్బంధించి ఉంచకూడదు. స్వేచ్ఛగా, వేగవంతమైన విచారణను కోరడం నిందితుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అయితే కేసు విచారణ నత్తనడకన సాగడానికే సిసోడియానే కారణమన్న కిందికోర్టు అభిప్రాయం వాస్తవదూరంగా ఉంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో సిసోడియాకు బెయిల్‌ను తిరస్కరిస్తూ మే 21వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ‘‘రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు అదే మొత్తానికి మరో రెండు షూరిటీలను సమర్పించాలి. పాస్ట్‌పోర్ట్‌ను ప్రత్యేక ట్రయల్ కోర్టులో ఇచ్చేయాలి. సాక్ష్యాధారాలను ధ్వంసంచేయకూడదు. సాక్షులను ప్రభావితం చేయకూడదు. దర్యాప్తు అధికారి ఎదుట ప్రతి సోమ, గురు వారాల్లో ఉదయం 10–11 గంటల మధ్య హాజరు కావాలి’’ అని కోర్టు షరతులు విధించింది. తొలుత సీబీఐ.. ఆ తర్వాత ఈడీడిఫ్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను మద్యం కేసులో 2023 ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ అరెస్ట్‌చేసింది. తర్వాత రెండు రోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 9న మనీలాండరింగ్ కోణంలో కేసు నమోదుచేసి ఈడీ సైతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే ఆయనను అరెస్ట్‌చేసింది.అంబేడ్కర్‌కు రుణపడ్డా: సిసోడియాతీర్పు నేపథ్యంలో శుక్రవారం తీహార్ జైలు నుంచి సిసోడియా విడుదలయ్యారు. పెద్దసంఖ్యలో జైలు వద్దకొ చ్చిన ఆప్ కార్యకర్తలు ఆయనపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ‘‘ నిరంకుశ కేంద్రప్రభుత్వ చెంప చెళ్లు మనిపించేందుకు రాజ్యాంగ అధికారాలను వినియోగించిన కోర్టుకు నా కృతజ్ఞతలు. శక్తివంతమైన రాజ్యాంగం, ప్రజా స్వామ్యం వల్లే బెయిల్ పొందగలిగా. ఈ బెయిల్ ఉత్తర్వు చూశాక జీవితాంతం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు రుణపడిపోయా. ఈ అనైతిక యుద్ధానికి రాజ్యాంగబద్ధంగా తార్కిక ముగింపు పలికాం. ఏదో ఒక రోజు ఈ చెడు సంస్కృతి అంతమవుతుంది. అప్పుడు బెయిల్‌పై కేజ్రీవాల్ కూడా విడుదల అవుతారు’’ అని సిసోడియా అన్నారు.ఆప్ హర్షంసిసోడియాకు బెయిల్‌పై ఆప్ పార్టీ హర్షం వ్యక్తంచేసింది. ‘‘ సత్యమేవ జ యతే. ఢిల్లీలో విద్యా విప్ల వానికి నాంది పలికిన సిసోడియాకు ఇది గొప్ప విజయం. ఇది విద్యా విజయం, విద్యా ర్థుల విజయం’’ అని ఢిల్లీ మహిళా మంత్రి అతిశి వ్యాఖ్యానించారు. -
స్నూపింగ్ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్..
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్ తలిగింది. స్నూపింగ్ కేసులో ఆయనపై న్యాయపమరైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరగా.. ఆయన ఇప్పటికే అంగీకారం తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ అనుమతి కోసం పంపారు. ఈ విజ్ఞప్తికి హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా.. ఇప్పుడు స్నూపింగ్ కేసులో కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2015లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చాక ఫీడ్‌బ్యాక్ యూనిట్(ఎఫ్‌బీయూ)ను ఏర్పాటు చేసింది. 2016లో రూ.కోటి కేటాయించడంతో ఎఫ్‌బీయూ సీక్రెట్ సర్వీస్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలపై రహస్య నిఘా పెట్టేందుకే దీన్ని ఏర్పాటు చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే దీన్ని ఏర్పాటు చేశారంటోంది. ఢిల్లీ విజిలెన్స్ శాఖకు నేతృత్వం వహిస్తున్న సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి కావాలని కోరింది. 2015లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎఫ్‌బీయూ ఏర్పాటును సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారని, కానీ దాని ఎజెండాకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పలేదని సీబీఐ ఆరోపిస్తోంది. ఎఫ్‌బీయూ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కూడా లేదని పేర్కొంది. సీబీఐ అభ్యర్థను ఆమోదిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎటువంటి శాసన, న్యాయ, కార్యనిర్వాహక పర్యవేక్షణ లేకుండా అధికారాన్ని ఉపయోగించి రహస్య ఏజెన్సీని స్థాపించేందుకు ఆప్ ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. చదవండి: దేశంలోని నిరుద్యోగులకు మోదీ రూ.6,000 భృతి.. నిజమెంత? -
కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందన్న సిసోడియా
-
తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో తరహాలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణలో బయటకువచ్చిన మధ్యవర్తుల ఆడియో టేపుల ద్వారా ఈ కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోందన్నారు. కుట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని తేలితే అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్‌చేశారు. శనివారం సిసోడియా ఢిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ దళారిగా చెబుతున్న ఒక వ్యక్తి మాట్లాడిన ఆడియో టేప్‌ను మీడియాకు వినిపించారు. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ముగ్గురిలో ఒకరు నేరుగా బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి’ అని సిసోడియా తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రాజ్నా«థ్, కిషన్ రెడ్డి, ఇతర నేతలతో నిందితుల్లో కొందరు దిగిన ఫొటోలను మీడియాకు సిసోడియా చూపించారు. రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ అనే మధ్యవర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎలా కుట్ర పన్నారో ఆడియో టేప్‌లో స్పష్టంగా వెల్లడైందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆశ చూపిస్తూ ఢిల్లీలోనూ ఎమ్మెల్యేలను కొనే వ్యవహారాన్ని నడిపిస్తున్నామని ఆడియో టేప్‌లో వినిపించిన అంశాన్ని సిసోడియా ప్రస్తావించారు. ‘ఇంకో ఆడియోలో ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేల కొనుగోలు తతంగం కొనసాగుతోందన్నారు. అంటే అంతటి భారీమొత్తంలో బీజేపీ నగదు సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది’ అని అన్నారు. ‘ టేపుల్లో దళారులు అమిత్ షా పేరును పరోక్షంగా ప్రస్తావించడం తీవ్ర ఆందోళనకరం. షా ప్రమేయం ఉంటే ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలి. హోంశాఖ మంత్రి పదవి నుంచి తప్పించాలి. ఈడీ విచారణ చేపట్టాలి’ అని అన్నారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనే అలవాటున్న బీజేపీకి ఉన్న రాజకీయపార్టీ గుర్తింపును ఈసీ రద్దుచేయాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ డిమాండ్‌చేశారు. -
‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ప్రధానిపై మనీశ్ సిసోడియా విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై దర్యాప్తు జరుగుతున్న వేళ విదేశీ ప్రయాణాలు చేపట్టకుండా లుక్ఔట్ నోటీసులు జారీ చేయటాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ‘ మీరు చేయించిన దాడులు పూర్తిగా విఫలమయ్యాయి. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇప్పుడు నాకు మీరు లుక్ఔట్ నోటీసులు ఇచ్చారు. ఈ జిమ్మిక్కులు ఏమిటి మోదీ జీ? నేను ఢిల్లీలోనే ఉన్నాను. నేను ఎక్కడికి రావాలో దయచేసి చెప్పండి.’ అని పేర్కొన్నారు సిసోడియా. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు సిసోడియా. విద్యా, ఆరోగ్య రంగంలో మంచి పనితీరు కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై ఏజెన్సీలను ఉపయోగించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేశారన్నారు. రానున్న 2024 సాదారణ ఎన్నికల్లో భాజపాకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థిగా మారుతున్నారనే కారణంగా ఆయనని అడ్డుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. విదేశాలకు వెళ్లకుండా మనీశ్ సిసోడియాకు లుక్ఔట్ సర్క్యూలర్ జారీ చేసినట్లు వస్తున్న వార్తలను సీబీఐ వర్గాలు ఖండించాయి. ఇదీ చదవండి: లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధారి కేజ్రీవాల్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజం -
డిప్యూటీ సీఎం ఆఫీసులో దొంగలుపడ్డారు
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఆయన కార్యాలయంలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి రెండు కంప్యూటర్లు ఎత్తుకెళ్లడమే కాకుండా విలువైన పత్రాలు కూడా దోచుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఢిల్లీలోని పత్పర్గంజ్లోని కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 'పత్పర్గంజ్లోని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంలో దొంగతనం జరిగింది. అది ఏ సమయంలో అనేది కచ్చితంగా తెలియదు. తాళం తీసి లోపలికి ప్రవేశించి దోచుకోవడానికి ముందే దొంగలు సీసీటీవీని తొలుత ఆఫ్ చేయడమే కాకుండా వెళ్లే సమయంలో ఆ కెమెరాను, అందులోని నమోదైన రికార్డింగులను, సీపీయూను, విలువైన ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. ఫొరెన్సిక్ బృందం ఇప్పటికే ఆధారాలు సేకరించింది. కేసు దర్యాప్తు వేగాన్ని పెంచాం' అని సీనియర్ పోలీసు అధికారి ఓమ్విర్ సింగ్ తెలిపాడు. -
ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేయించండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మరోసారి విమర్శలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి అరెస్ట్ చేయించండి అంటూ సవాల్ చేశారు. కేంద్రంలోని రాజకీయ పెద్దలు.. ఆప్ ఎమ్మెల్యేలను ఎలాగైనా, ఏదో ఒక కారణంతో జైల్లో పెట్టించాలని చూస్తున్నారని సిసోడియా ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను ఆరెస్ట్ చేయించాలని భావిస్తే.. అందరినీ కలసికట్టుగా ఎందుకు అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. కేంద్రం ఢిల్లీ పోలీసులు బలగాలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే దినేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, సిసోడియా తమను దూషించారంటూ వ్యాపారవేత్తలు ఆయనపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం సిసోడియా, ఆప్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తూ రేసుకోర్సు రోడ్డులోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేశారు. -
పోలీసుల అదుపులో డిప్యూటీ సీఎం, 65 మంది ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ సర్కార్ ఘర్షణ వైఖరి కొనసాగిస్తోంది. ఎమ్మెల్యే దినేష్ ను అరెస్ట్ చేయడంతో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు పెట్టినందుకు నిరసనగా ఆప్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపట్టారు. ప్రధాని మోదీ ఎదుట సిసోడియా పోలీసులకు లొంగిపోతారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం ఉదయం సిసోడియాతో కలసి ఆప్ ఎమ్మెల్యేలు రేస్‌కోర్సు రోడ్డులోని ప్రధాని మోదీ అధికార నివాసానికి ర్యాలీగా బయల్దేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు రేసుకోర్సు రోడ్డులో 144 సెక్షన్ విధించారు. సిసోడియాతో పాటు 65 మంది ఆప్ ఎమ్మెల్యేలు రేసుకోర్సు రోడ్డుకు వెళ్లకుండా తుగ్లక్ రోడ్డు సమీపంలో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. శనివారం సిసోడియా ఘజియాబాద్ మండిలో పర్యటించనపుడు తమను దూషించారంటూ వ్యాపారవేత్తలు ఆయనపై ఫిర్యాదు చేశారు. కాగా తనపై ఫిర్యాదు చేసినవారు మార్కెట్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఈ చర్యలు మానుకోకుంటే లైసెన్స్ రద్దు చేస్తానని వారిని హెచ్చరించినట్టు సిసోడియా చెప్పారు. ఈ కేసు విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. సురేందర్ గోస్వామి నుంచి తాము ఫిర్యాదు స్వీకరించామని, అయితే సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. -
డిప్యూటీ సీఎంపై ఏసీబీ దర్యాప్తు షురూ
అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న కాక మొన్న భార్యపై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి సోమనాథ్ భారతి అరెస్టు కాగా, ఇప్పుడు ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులోని ఉప ముఖ్యమంత్రి మీదే అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మనీష్ సిసోదియా.. ప్రభుత్వ ప్రకటనల కాంట్రాక్టులను తన సమీప బంధువులకే ఇప్పించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై తమకు ఫిర్యాదులు కూడా అందాయని ఢిల్లీ ఏసీబీ చీఫ్ ఎంకే మీనా తెలిపారు. ఈ వ్యహారంపై తాము దర్యాప్తు చేస్తున్నామని, సమాచార ప్రచార శాఖ డైరెక్టరేట్‌కు కూడా నోటీసులు ఇచ్చామని మీనా తెలిపారు. -
డిప్యూటీ సీఎం కారు ఆపి రూ. 400 జరిమానా
న్యూఢిల్లీ: ఇటీవల లక్నో విమానాశ్రయంలో నిషిధ్ద ప్రవేశం ద్వారం గుండా వెళ్తున్న కేంద్ర మంత్రిని ఆపి ఓ మహిళ కానిస్టేబుల్ ప్రశంసలందుకోగా.. తాజాగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి అతివేగంగా వెళ్తున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కారును ట్రాఫిక్ పోలీసులు గుర్తించి ఆపివేశారు. సిసోడియా కారు డ్రైవర్‌కు జరిమానా వేశారు. ఢిల్లీలోని ఈశాన్య జిల్లా పరిధిలో ఈ సంఘటన జరిగింది. జూన్ 12 సాయంత్రం ఖజూరి ఖాస్ చౌక్ వద్ద సిసోడియా ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళ్తోంది. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి డిప్యూటీ సీఎం కారును ఆపాల్సిందిగా తర్వాతి జంక్షన్ పోలీసులకు సమాచారం అందించారు. తర్వాతి జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు సిసోడియా కారును ఆపి 400 జరిమానా వేశారు. ఈ విషయాన్ని సీనియర్ ట్రాఫిక్ పోలీస్ అధికారి వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులు వారి డ్యూటీ వారు చేశారని చెప్పారు.