డిప్యూటీ సీఎం ఆఫీసులో దొంగలుపడ్డారు | Delhi Deputy Chief Minister Manish Sisodia's Office Burgled, Stolen | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం ఆఫీసులో దొంగలుపడ్డారు

Published Fri, Dec 30 2016 12:49 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

డిప్యూటీ సీఎం ఆఫీసులో దొంగలుపడ్డారు

డిప్యూటీ సీఎం ఆఫీసులో దొంగలుపడ్డారు

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్‌ సిసోడియా కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఆయన కార్యాలయంలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి రెండు కంప్యూటర్లు ఎత్తుకెళ్లడమే కాకుండా విలువైన పత్రాలు కూడా దోచుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఢిల్లీలోని పత్పర్‌గంజ్‌లోని కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

'పత్పర్‌గంజ్‌లోని డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా కార్యాలయంలో దొంగతనం జరిగింది. అది ఏ సమయంలో అనేది కచ్చితంగా తెలియదు. తాళం తీసి లోపలికి ప్రవేశించి దోచుకోవడానికి ముందే దొంగలు సీసీటీవీని తొలుత ఆఫ్‌ చేయడమే కాకుండా వెళ్లే సమయంలో ఆ కెమెరాను, అందులోని నమోదైన రికార్డింగులను, సీపీయూను, విలువైన ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. ఫొరెన్సిక్‌ బృందం ఇప్పటికే ఆధారాలు సేకరించింది. కేసు దర్యాప్తు వేగాన్ని పెంచాం' అని సీనియర్ పోలీసు అధికారి ఓమ్‌విర్‌ సింగ్‌ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement