![డిప్యూటీ సీఎంపై ఏసీబీ దర్యాప్తు షురూ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51423801727_625x300_0.jpg.webp?itok=Au1KFH6w)
డిప్యూటీ సీఎంపై ఏసీబీ దర్యాప్తు షురూ
అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న కాక మొన్న భార్యపై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి సోమనాథ్ భారతి అరెస్టు కాగా, ఇప్పుడు ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులోని ఉప ముఖ్యమంత్రి మీదే అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ప్రారంభించింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మనీష్ సిసోదియా.. ప్రభుత్వ ప్రకటనల కాంట్రాక్టులను తన సమీప బంధువులకే ఇప్పించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై తమకు ఫిర్యాదులు కూడా అందాయని ఢిల్లీ ఏసీబీ చీఫ్ ఎంకే మీనా తెలిపారు. ఈ వ్యహారంపై తాము దర్యాప్తు చేస్తున్నామని, సమాచార ప్రచార శాఖ డైరెక్టరేట్కు కూడా నోటీసులు ఇచ్చామని మీనా తెలిపారు.