డిప్యూటీ సీఎం కారు ఆపి రూ. 400 జరిమానా | Manish Sisodia's car found overspeeding, fined by traffic cops | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం కారు ఆపి రూ. 400 జరిమానా

Published Fri, Jun 19 2015 2:59 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

డిప్యూటీ సీఎం కారు ఆపి రూ. 400 జరిమానా - Sakshi

డిప్యూటీ సీఎం కారు ఆపి రూ. 400 జరిమానా

న్యూఢిల్లీ: ఇటీవల లక్నో విమానాశ్రయంలో నిషిధ్ద ప్రవేశం ద్వారం గుండా వెళ్తున్న కేంద్ర మంత్రిని ఆపి ఓ మహిళ కానిస్టేబుల్ ప్రశంసలందుకోగా.. తాజాగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి అతివేగంగా వెళ్తున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కారును ట్రాఫిక్ పోలీసులు గుర్తించి ఆపివేశారు. సిసోడియా కారు డ్రైవర్కు జరిమానా వేశారు. ఢిల్లీలోని ఈశాన్య జిల్లా పరిధిలో ఈ సంఘటన జరిగింది.

జూన్ 12 సాయంత్రం ఖజూరి ఖాస్ చౌక్ వద్ద సిసోడియా ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళ్తోంది.  ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి డిప్యూటీ సీఎం కారును ఆపాల్సిందిగా తర్వాతి జంక్షన్ పోలీసులకు సమాచారం అందించారు. తర్వాతి జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు సిసోడియా కారును ఆపి 400 జరిమానా వేశారు. ఈ విషయాన్ని సీనియర్ ట్రాఫిక్ పోలీస్ అధికారి వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులు వారి డ్యూటీ వారు చేశారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement