న్యూఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాకు సాకేత్ కోర్టు సోమవారం బెయిల్ తిరస్కరించింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆయనని పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో దినేశ్ మోహనియా ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ తోసిపుచ్చింది.
మరోవైపు దినేశ్ మోహనియా జ్యుడిషియల్ కస్టడీని జూలై 11 వరకూ న్యాయస్థానం పొడిగించింది. కాగా నీళ్ల కోసం వెళ్తే తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యే దినేశ్పై ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నీళ్ల గురించి మరోసారి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి, తోసేశారంటూ దినేష్ మోహనియాపై ఫిర్యాదు చేశారు.