మేమొస్తే ఆస్తి పన్ను రద్దు.. పెన్షన్ రూ.2,500 | AAP releases manifesto for Punjab Assembly elections | Sakshi
Sakshi News home page

మేమొస్తే ఆస్తి పన్ను రద్దు.. పెన్షన్ రూ.2,500

Published Fri, Jan 27 2017 3:48 PM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

మేమొస్తే ఆస్తి పన్ను రద్దు.. పెన్షన్ రూ.2,500 - Sakshi

మేమొస్తే ఆస్తి పన్ను రద్దు.. పెన్షన్ రూ.2,500

చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో బరిలోకి దిగిన మరో పార్టీ ఆప్ (ఆమ్ఆద్మీపార్టీ) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. శిరోమణి అకాళీదల్ మాదిరిగా కాకుండా కాస్తంత అమలయ్యే హామీలనే దాదాపు ఇచ్చాంది. అన్నిరంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ దీనిని శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో పలు ఆకర్షణీయ అంశాలు ప్రకటించింది. వాటిని ఒకసారి పరిశీలిస్తే...

యువత కోసం..

  • 25లక్షల ఉద్యోగాల కల్పన
  • ఫారిన్ ఎంప్లాయిమెంట్ యూత్ బోర్డు ద్వారా విదేశాల్లో జాబులు ఆశీంచేవారికి ప్రత్యేక శిక్షణ
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాల సృష్టి
  • సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఫైనాన్స్, ఇండస్ట్రీ మెంటర్స్, మార్కెట్ సెక్టార్ లో అవకాశాలు కల్పించేలా పది నగరాల్లో పంజాబ్ లాంచ్ ప్యాడ్స్

ఆరోగ్యం

  •  ప్రభుత్వేతర ఆస్పత్రుల్లో రూపాయి చెల్లించకుండా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం
  • డ్రగ్ బాధితులకు ఆరు నెలల్లో పునరావాసం
  • ప్రతి గ్రామంలో, చిన్న టౌన్స్ లో ఉచిత రోగ నిర్థారణ పరీక్షలు, ఉచిత మందులు
  • ప్రొబేషన్ సమయంలో డాక్టర్లందరికీ, నర్సులకు, పారామెడికల్ స్టాఫ్కు పూర్తి స్థాయి వేతనాలు

శాంతిభద్రతలు

  • డ్రగ్ వ్యాపారంలో భాగస్వాములై ఉన్న రాజకీయ నాయకులను జైలుకు పంపడం.. ఆస్తులు జప్తు
  • రాష్ట్రాన్ని అవినీతి రహితం చేసేందుకు యాంటీ కరప్షన్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కు స్వతంత్ర ప్రతిపత్తితోకూడిన అధికారాలు
  • మతపరంపేరిట జరిగిన వివక్ష, దాడులకు సంబంధించి ప్రభుత్వం విచారణ చేసి నేరస్తులకు శిక్ష

పౌర సేవలు

  • ఆస్తి పన్ను రద్దు
  • గృహాలకోసం వినియోగించే విద్యుత్ 400 యూనిట్లకు పొడిగించడం
  • అన్ని జిల్లాలు, సబ్ డివిజన్లలో ఆమ్ ఆద్మీ క్యాంటీన్లలో రూ.5కే భోజనం
  • వృద్ధులకు, వికలాంగులకు, వితంతువుల పెన్షన్ రూ.500 నుంచి రూ.2500

విద్య

  • కొత్తగా మూడు మెడికల్ కాలేజీల స్థాపన. ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు
  • ప్రస్తుతం ఉన్న కాలేజీలను అప్ గ్రేడ్ చేయడంతోపాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణ
  • 147 ఎంటర్ప్రెన్యూర్షిప్, నైపుణ్య సెంటర్ల ఏర్పాటు

రైతులకోసం

  • 2018 డిసెంబర్ నాటికి రైతులకు అప్పుల నుంచి విముక్తి

ఇతరాలు..

  • ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెలకే పంజాబ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం
  • ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎర్రబుగ్గ కార్లను ఉపయోగించరాదు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement