'బెదిరింపులకు మేం భయపడం'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ సోదాలు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు భగ్గుమన్నారు. సీఎం కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆప్నేతలు ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై ఎవరేమన్నారంటే..
- కేంద్రం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ బెదిరింపులకు మేం భయపడం. - ఆప్ నేత సంజయ్ సింగ్
- మోదీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోంది. - ఆప్ నేత కుమార్ విశ్వాస్
- సీఎం కార్యాలయంలో సోదాలు చేయలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ ఆఫీసులోనే దాడులు చేసాం. - సీబీఐ
- నా కార్యాలయంలోనే సోదాలు చేశారు. మోదీ డైరక్షన్లో దాడులు చేశారు. - కేజ్రీవాల్
- పీఎంను విమర్శించడం కేజ్రీవాల్కు ఫ్యాషన్ అయిపోయింది. - వెంకయ్య నాయుడు