cbi rides
-
పార్టీ కార్యకర్తలను కొట్టిన మాజీ సీఎం భార్య.. వీడియో వైరల్
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ సతీమణ రబ్రీ దేవీ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. ఏకంగా కార్యకర్తలపై చేయి చేసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల్లో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తాజాగా ఆరోపణలు చేసింది. ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను లాలూ కుటుంబ సభ్యులు భూములు, ప్రాపర్టీలను ముడుపులుగా తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే శుక్రవారం లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలతో పాటు మరో 15 మంది ఇళ్లలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు సీబీఐ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. లాలూ ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని లాలూ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని, అందులో భాగంగానే ఈ కేసులంటూ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో రబ్రీదేవి పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనల సందర్భంగా లాలూ ఇంటి వద్ద కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. CBI हाय-हाय के नारे लगा रहे थे RJD कार्यकर्ता, गुस्से में आकर Rabri Devi ने जड़ दिया थप्पड़https://t.co/WjldWg4WnR pic.twitter.com/AACFZqGYBj — देवेन्द्र कश्यप (@idevendraji) May 20, 2022 ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీలో కలకలం -
బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు..
సాక్షి, అమరావతి/హైదరాబాద్: జాతీయ బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని.. కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా ఆ నిధుల్ని అక్రమంగా తన వారి ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు గురువారం సోదాలు చేశాయి. ఏపీ, హైదరాబాద్, ముంబై సహా ఇతర ప్రాంతాల్లో ఆయన, ఆయన కంపెనీల డైరెక్టర్లకు చెందిన ఆస్తులపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఉదయం 6 గంటలకే మొదలైన ఈ సోదాల్లో ఏకంగా 11 బృందాలు పాల్గొన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు వడ్డీ కూడా చెల్లించకుండా బ్యాంకును మోసం చేయటం... తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవటం, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేయటం వంటి అంశాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేయటంతో సీబీఐ కేసు నమోదు చేసి సోదాలకు దిగింది. సంస్థకు చైర్మన్‌గా ఉన్న రఘురాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేసింది. దాడుల సందర్భంగా పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల్లో సోదాలు.. సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్,శ్రీనగర్‌కాలనీ, చందానగర్, ముంబైలోని మధువన్, పశ్చిమ గోదావరిలోని కొవ్వూరు కలిపి ఏకకాలంలో 11 ప్రాంతాల్లోని ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కార్యాలయాలు, నివాసాలపై దాడులు జరిపింది. రఘురామకృష్ణరాజు కంపెనీలో అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న కొవ్వూరుకు చెందిన ఓ మహిళ ఇంట్లో కూడా సీబీఐ తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. భీమవరంలోని రఘురాజు నివాసానికి తాళం వేసి ఉండటంతో అధికారులు వెనుతిరిగారు. అప్పు తీసుకుని... తన వారి ఖాతాలకు కర్ణాటకలోని తమ పవర్ ప్రాజెక్టుకు రుణం కావాలని దరఖాస్తు చేసుకున్న ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్... పర్యావరణ అనుమతుల కారణంగా అక్కడ కాకుండా ప్లాంటును తమిళనాడులోని ట్యూటికోరిన్‌కు మార్చింది. బ్యాంకు ఆఫ్ బరోడా, దేనాబ్యాంకు, స్టేబ్‌బ్యాంక్ ఆఫ్ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ఆఫ్ ఇండియా బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.826.17 కోట్ల మేర భారీ రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీనిపై కన్సార్షియం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా వివిధ దశల్లో రూ.826.17 కోట్లు తనకు సంబంధించిన వారికి వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా తరలించినట్లు వెల్లడైంది. విదేశాలకు పారిపోతారేమో..! అప్పులను రాబట్టుకునేందుకు బ్యాంకులన్నీ ఢిల్లీలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్, హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించాయి. నిందితులు అప్పులు ఎగ్గొట్టి న్యాయవిచారణ నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. చీటింగ్ కేసు నమోదు తీసుకున్న రుణాన్ని ఇతర మార్గాల్లో మళ్లించి ఉద్దేశపూర్వకంగా మోసగించారని పంజాబ్ నేషనల్ బ్యాంకు చీఫ్‌మేనేజర్ సౌరభ్ మల్హోత్రా, ఇతర బ్యాంకులు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాయి. నేరపూరిత కుట్ర, మోసం తదితర అభియోగాలతో ఐపీసీ 120బి, 420, పీసీ యాక్ట్ 13(2), రెడ్‌విత్ 13(1),(డి) సెక్షన్ల ప్రకారం రఘురామకృష్ణరాజుతోపాటు 9 మంది డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లతోపాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 22 పేజీల ఎఫ్ఐఆర్లో సీబీఐ పలు సంచలన విషయాలను పొందుపరిచింది. సీబీఐ ఎఫ్ఐఆర్లో నిందితుల జాబితా.. 1. ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్, ఓల్డ్ బోయిన్పల్లి, 2. కనుమూరు రమాదేవి, 3. కనుమూరు రఘురామకృష్ణరాజు (చైర్మన్) 4. కోటగిరి ఇందిరా ప్రియదర్శిని, 5. గోపాలన్ మనోహరన్, 6. కొమరిగిరి సీతారామ్ 7. భాగవతుల నారాయణ ప్రసాద్, 8. నంబూరి కుమారస్వామి 9. బోపన్న సౌజన్య 10. వడ్లమాని వీరవెంకట సత్యనారాయణరావు, 11. విస్ప్రగడ్డ పేర్రాజు 12. గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు మీడియాపై ఎంపీ చిందులు.. ఒకవైపు ఉదయం నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, కార్యాలయాలు, డైరెక్టర్ల కార్యాలయాలపై సీబీఐ దాడులు జరుగుతున్నా అవన్నీ అసత్యాలని ఎంపీ రఘురాజు ఖండిస్తూ వచ్చారు. అదంతా అసత్యమంటూ బుకాయించారు. సాయంత్రం సీబీఐ ఢిల్లీ విభాగం ప్రెస్‌నోట్ విడుదల చేసే వరకూ వాస్తవాలను కప్పిపుచ్చి తనను సంప్రదించేందుకు ప్రయత్నించిన మీడియాపై చిందులు తొక్కారు. “రాజు’ అప్పు రూ.23,608 కోట్లు! ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన పలు కంపెనీలకు దాదాపు రూ.23,608 కోట్ల మేర అప్పులున్నట్లు స్పష్టమవుతోంది. ఆయనకు హైదరాబాద్, చెన్నై ఆర్వోసీ పరిధిలో పలు కంపెనీలున్నాయి. కానీ వీటిల్లో ఏ కంపెనీకీ అప్డేటెడ్ ఫైలింగ్స్ లేవు. పలు కంపెనీలకు 2016 మార్చి నుంచి బ్యాలెన్స్ షీట్లను సమర్పించలేదు. ఇక ఇండ్–భారత్ ఎనర్జీ (ఉత్కల్), ఇండ్–భారత్ పవర్ (మద్రాస్), ఇండ్–భారత్ పవర్ జెన్‌కామ్ కంపెనీలు కార్పొరేట్ దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. ఇదీ... అప్పుల చిట్టా ఇండ్–భారత్ ఎనర్జీస్ లిమిటెడ్: రూ.3.25 కోట్లు ఇండ్–భారత్ ఎనర్జీ (ఉత్కల్): రూ.5,605.61 కోట్లు ఇండ్–భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్: రూ.2,655 కోట్లు ఇండ్–భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్: రూ.1,231.27 కోట్లు ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్: రూ.2,455.65 కోట్లు ఇండ్–భారత్ థర్మోటెక్ ప్రై .లి: రూ.2,968.91 కోట్లు చెన్నై ఆర్వోసీ పరిధిలోని ఇండ్–భారత్ పవర్ ఇన్ప్రా లిమిటెడ్: రూ.8,688.27 కోట్లు -
ఉన్నావ్ కేసు: 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ యాక్సిడెంట్ కేసుపై సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. విచారణలో భాగంగా ఆదివారం రాష్ట్రంలోని 17 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే ఉన్నావ్ అత్యాచార నిందితుడు కుల్దీవ్ సెగార్ ఉంటున్న సితాపూర్ జైలులో కూడా అధికారుల సోదాలు నిర్వహించారు. జైలు రికార్డులను పరిశీలించి.. ఇటీవల కాలంలో ఆయన్ను కలవడానికి ఎవరెవరు వచ్చారని జైలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆయన అనుచరుల ఇళ్లల్లో కూడాసోదాలు చేపట్టారు. ఈ కేసులో 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కేసు విచారణలో సీబీఐ మరింత వేగం పెంచింది. ఘటనతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తోంది. ట్రక్ డ్రైవరు ఆశిష్ కుమార్ పాల్, క్లీనర్ మోహన్‌లకు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీని విధించిన విషయం తెలిసిందే. ట్రక్ యజమానిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే శనివారం ఉదయం ఈ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు వాహనం నెంబర్ కనబడకుండా గ్రీస్ పూసారని తెలిసింది. ప్రమాదం జరిగిన రోజు ఉదయం గం. 05.20లకు ఘటనా స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో ట్రక్కు నంబర్ ప్లేట్‌పై ఎలాంటి మచ్చలు, మరకలు గానీ లేని విషయం బహిర్గతమైంది. దీంతో ఈ ప్రమాదం కావాలనే చేశారనే వాదనకు బలం చేకూరినట్టైంది. ఈ విషయం వాహన యజమానిని ప్రశ్నించగా, ఈఎమ్ఐలు కట్టకుండా తప్పించుకోవడానికి తరచూ అలా చేస్తుంటామని చెప్పడం గమనార్హం. కాగా కారు ప్రమాదంలో గాయపడిన అత్యాచార బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత న్యాయవాది కూడా ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. -
సీబీఐ దాడి..జీఎస్టీ అధికారి అరెస్ట్
సాక్షి, తణుకు(పశ్చిమ గోదావరి): సీబీఐ.. ఈ పదం తణుకు పట్టణంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అధికారులను హడలెత్తిస్తోంది. గతంలో సీబీఐ అధికారులు తణుకు పట్టణంలోని పలువురు అధికారులతోపాటు వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు చేసిన ఘటనలు మరువక ముందే తాజాగా సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కారుమూరి కల్యాణ్‌చక్రవర్తి లంచం తీసుకుంటూ పట్టుబడటం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. జీఎస్టీ రద్దు చేయడానికి ఒక వ్యాపారి నుంచి రూ.2 వేలు డిమాండ్ చేసిన ఘటనలో సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా కల్యాణ్ చక్రవర్తిని పట్టుకుని అరెస్టు చేయడం కలకలం రేపింది. మరోవైపు గతంలో ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (వెస్ట్ మీరట్)గా పని చేసిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాదరావు వ్యవహారంలోనూ సీబీఐ అధికారులు పెద్దఎత్తున సోదాలు నిర్వహించారు. తణుకు పట్టణానికి చెందిన రాంప్రసాదరావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై రెండేళ్ల క్రితం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయన భార్య ఆకుల కనకదుర్గపైనా కేసులు నమోదు చేశారు. తదనంతరం గతేడాది మార్చిలో రాంప్రసాదరావు అక్రమాస్తుల వ్యవహారంలో అస్తులు విక్రయించిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన, బినామీలుగా ఉన్న వ్యక్తులకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అప్పట్లో తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీబీఐ నోటీసులు అదుకున్నారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. కోడిగుడ్ల వ్యాపారిపైనా..? తణుకు పట్టణానికి చెందిన కోడిగుడ్లు ఎగుమతి చేసే ఒక వ్యాపారిపైనా సీబీఐ అధికారులు గతంలోనే కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఒక బ్యాంకులో రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఆయనకు చెందిన కొన్ని ఆస్తులనూ ఎటాచ్ చేసుకున్నారు. తణుకు పట్టణంలోని వేల్పూరు రోడ్డు, సజ్జాపురం ప్రాంతాల్లో ఈయనకు చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల మరోసారి తణుకు వచ్చిన సీబీఐ అధికారులు ఇక్కడే తిష్ట వేసి సంబంధిత కోడిగుడ్ల వ్యాపారికి చెందిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగినట్లు తెలుస్తోంది. గతంలో ఇతనికి సహకరించిన వారితోపాటు బినామీలుగా వ్యవహరించిన వ్యక్తుల కదలికలపై దృష్టి సారించిన అధికారులు మరోసారి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి ఐపీ ప్రకటించిన వ్యాపారికి స్థానికంగా కొందరు ఉద్యోగులు సహకారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం. గతం నుంచి వ్యాపారులకు వేధింపులు తరచూ సీబీఐ అధికారులు తణుకు పట్టణంపై దృష్టి సారిస్తుండటంతో స్థానికంగా కలకలం రేగుతోంది. గత రెండేళ్లుగా సీబీఐ అధికారులు తణుకులో అటు ప్రభుత్వ అదికారులు, ఇటు పలువురు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారులపై దృష్టి సారించారు. తాజాగా తణుకు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ కార్యాలయంలో సూపరింటెండెంటుగా పని చేస్తున్న కల్యాణ్‌చక్రవర్తి సీబీఐ అధికారులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. గతం నుంచి ఆయన పలువురు వ్యాపారులను మామూళ్లు పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రూ. లక్షల్లోనే లంచాలు డిమాండ్ చేసిన సదరు అధికారి కేవలం రూ.2 వేలు లంచం డిమాండ్ చేసి సీబీఐ అధికారులకు దొరికిపోయారు. తాడేపల్లిగూడెం నుంచి వచ్చి వెళ్లే కల్యాణ్‌చక్రవర్తి బాధితులు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు స్థానిక కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలోనూ తనిఖీలు చేయడం కొసమెరుపు. -
అఖిలేష్‌పై సీబీఐ దాడులు సమంజసమా!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సంబంధించిన అక్రమ మైనింగ్ కేసులో శనివారం నాడు యూపీ, ఢిల్లీ, తెలంగాణలోని 14 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెల్సిందే. 2012 నుంచి 2017 మధ్య సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అఖిలేష్ యాదవ్, మాజీ మంత్రి గాయత్రీ ప్రసాద్ ప్రజాపతి గనుల శాఖను నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అప్పటి ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై కూడా సీబీఐ దాడులు జరిగాయి. 2016లో అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పునస్కరించుకొని ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కలసికట్టుగా పోటీ చేస్తామంటూ ఎస్పీ, బీఎస్పీ నాయకులు అఖిలేష్ యాదవ్, మాయావతిలు సంయుక్త ప్రకటన చేసిన రోజే ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లయితే సీబీఐ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ అధిష్టానం హెచ్చరించడం వల్లనే ఆ పార్టీతో మాయావతి పొత్తు పెట్టుకోలేదనే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. 1963లో సీబీఐని ఏర్పాటు చేసిన నాటి నుంచి అది పాలకపక్ష పార్టీ తొత్తుగానే దుర్వినియోగం అవుతోంది. సీబీఐ దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో 1997లో దాన్ని కేంద్రం ఇంటెలిజెన్స్ కమిషన్ పరిధిలోకి తీసుకొస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అందుకనే సీబీఐ ‘యజమాని మాటలు పలికే పంజరంలో రామచిలక’ అని 2013లో సుప్రీం కోర్టే స్వయంగా వ్యాఖ్యానించింది. 2018లో సీబీఐలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలే పాలకపక్ష రాజకీయ జోక్యానికి అద్దం పడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడైన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన కార్యాలయంపై స్వయంగా అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఆధ్వర్యాన దాడులు జరిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి అర్ధరాత్రి రంజిత్ సిన్హా కార్యాలయాన్ని సీల్ చేయించి ఆయన్ని బలవంతపు సెలవుపై పంపించింది. ఈ పరిణామాలన్నీ కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మనే విషయాన్నే రుజువు చేస్తున్నాయి. -
అవినీతి ప్లానర్
విశాఖ నగరాభివృద్ధి సంస్థలో మరో అవినీతి చేప బయటపడింది. పదోన్నతిపై విధుల్లోకి చేరి 25 రోజులు గడవకముందే అడిషనల్ చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. విశాఖతోపాటు తెలుగు రాష్ట్రాల్లో 12 చోట్ల సోదాలు నిర్వహించారు. 24 ఏళ్ల క్రితం డ్రాఫ్ట్స్మెన్గా విధుల్లో చేరినప్పుడు అతని జీతం రూ.1300 కాగా... ప్రస్తుతం ఏసీబీ దాడుల్లో అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ రూ.40 కోట్లకుపైనే.. ఈ లెక్కన ఆయన అవినీతి ప్రస్థానం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. విశాఖ క్రైం: అతను ఓ డ్రాఫ్ట్స్మెన్గా 24 ఏళ్ల కిందట విధుల్లో చేరాడు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ధనార్జనే ధ్యేయంగా సాగించిన ప్రస్థానంలో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించాడు. విషయం తెలుసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు సోమవారం విశాఖతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో 12 చోట్ల సోదాలు చేయడంతో కోట్లాది రూపాయల ఆస్తులు వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) అడిషనల్ చీఫ్ అర్బన్ ప్లానర్ పసుపర్తి ప్రదీప్‌కుమార్, అతని బంధువులు, స్నేహితుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు సోమవారం ఏకకాలంలో 12చోట్ల దాడులు చేశారు. విశాఖలో ఉదయం 5 గంటల నుంచే ఈ సోదాలు ప్రారంభించారు. సంపత్ వినాయగర్ గుడి సమీపంలో ఆయన నివసిస్తున్న నటరాజ్ టవర్స్‌లోని ఫ్లాట్ నెంబర్ 301, స్నేహితులు నివసిస్తున్న సీతమ్మధార బాలాజీ శాస్త్రి లే అవుట్, శివాజీపాలెం, కిర్లంపూడి లే అవుట్‌లోని ఇళ్లు, వుడా కార్యాలయంలోని ప్రదీప్ చాంబర్లో అధికారులు సోదాలు చేశారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో మూడు చోట్ల, ఒంగోలులో ఒక చోట, విజయవాడలో ఒక చోట, హైదరాబాద్‌లో రెండుచోట్ల కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాలలో 40 కోట్ల రూపాయల విలువ గల స్థలాలు, ఫ్లాట్లు, బంగారం, వెండి ఆభరణాలు గుర్తించారు. తవ్వుతున్న కొద్దీ కోట్ల విలువ గల ఆస్తులు బయటపడుతున్నాయి. ఇదీ పసుపర్తి ప్రస్థానం కర్నూలు జిల్లాకు చెందిన పసుపర్తి ప్రదీప్‌కుమార్ 1984వ సంవత్సరంలో అ నంతపురం జిల్లా గుంతకల్లులో డ్రాప్ట్స్మెన్గా రూ.1300ల జీతానికి విధుల్లో చేరాడు. అనంతరం పలుచోట్ల పనిచేస్తూ 1999లో ప్లానింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ఆ తర్వాత 2010లో అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా, 2013లో డిప్యూటీ సిటీ ప్లానర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో 2008 నుంచి 2010 వరకు పెందుర్తి జోన్ –6లో అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా పనిచేశారు. తాజాగా 25 రోజుల కిందట విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) అడిషనల్ చీఫ్ అర్బన్ ప్లానర్‌గా పదోన్నతిపై వచ్చారు. అంతకుముందు విజయవాడలో టౌన్ ప్లానింగ్ విభాగం జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసేవారు. కుమారుల విద్యకు భారీగా ఖర్చు కుమారుల విద్య కోసం ప్రదీప్‌కుమార్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తింఆచరు. పెద్ద కుమారుడు హేమంత్‌సాయి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. స్కాట్లాండ్లో ఎంఎస్ చేసి నగరంలోని మధురవాడ వద్ద హెచ్.ఎస్.కనస్ట్రక్షన్ పేరిట వ్యాపారం చేస్తున్నాడు. చిన్న కుమారుడు జయంత్ సాయి మణిపాల్‌లో ఇంజినీరింగ్ విద్యసభ్యసిస్తున్నాడు. ఏడాదికి రూ.3లక్షలు వెచ్చించి ఇంజినీరింగ్ చదివిస్తుండడంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సింగపూర్ పర్యటనలో భార్య లత వుడా అడిషినల్ చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్ భార్య లత ఈ నెల 27న సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఆమె పేరిట మూడు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆమె వచ్చిన తర్వాత లాకర్లు తెరిచే అవకాశం ఉంది. అదేవిధంగా పనిమనిషి ఖాతాలపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్లు తెలిసింది. భారీగా ఆభరణాలు, వస్తువులు ⇔ 2.7 కిలోల బంగారు ఆభరణాల గుర్తింపు. ⇔ 12.5కిలోలు వెండి, రూ.4లక్షల నగదు. ⇔ బ్యాంకు ఖాతాలో రూ.3లక్షల బ్యాలెన్స్. ⇔ ప్రదీప్‌కుమార్‌తోపాటు అతని భార్య పేరు మీద రూ.18 లక్షలు విలువ చేసే ఫిక్సిడ్ డిపాజిట్ బాండ్లు. ⇔ రూ.10లక్షలు విలువ చేసే బీమా డాక్యుమెంట్లు. ⇔ రూ.2.50లక్షల విలువ చేసే డైమండ్ నక్లెస్, రూ.21లక్షలు విలువ చేసే ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు. ⇔ ఈ దాడుల్లో భారీ విలువ చేసే విదేశీ వాచీలు కూడా లభ్యమయ్యాయి. ఇదీ అక్రమాస్తుల చిట్టా ⇔ 2005లో మధురవాడలో 500 గజాలు స్థలం ప్రదీప్‌కుమార్ కొనుగోలు చేశారు. ⇔ 2006లో మధురవాడలో 599 చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేశారు. ⇔ 2017లో మధురవాడలో 200 గజాలు బాబాయి నారాయణరాజు పేరు మీద కొనుగోలు చేశారు. ⇔ రాజమండిలో ప్రదీప్‌కుమార్ తండ్రి స్వర్గీయ ⇔ వెంకటరాజు పేరు మీద 250 గజాల స్థలం. ⇔ 2006లో మధురవాడలో భార్య లత పేరు మీద 311 గజాలు స్థలం. ⇔ 2007లో భార్య లత పేరు మీద 311 స్కేర్యార్డ్స్ ఇంటి స్థలం. ⇔ 2016లో విజయవాడలోని దేవినగర్‌లో 166 చదరపు అడుగుల స్థలం. ⇔ కృష్ణా జిల్లాలో భార్య లత పేరు మీద 7 సెంట్లుభూమి. ⇔ విశాఖ కిర్లంపూడి లే అవుట్లో భార్య లత పేరు మీద శ్రీపాద నిలయం(16వందల చదరపు అడుగులు). ⇔ కడప జిల్లా మైదుకూరులో భార్య లత పేరు మీద 4 ఏకరాల 8సెంట్లు స్థంలం. ⇔ శివాజీపాలెంలో నివసిస్తున్న సింహాద్రి పేరు మీద రూ. 8.50 లక్షల విలువ చేసే కారు. ⇔ ప్రదీప్‌కుమార్ పేరు మీద బుల్లెట్, భార్య లత పేరు మీద స్కూటీ. ⇔ మొత్తం 5 ఇళ్ల ప్లాట్స్, 4 ఫ్లాట్స్, 9.20 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు అధికారులు గుర్తించారు. ⇔ బీచ్‌రోడ్డులోని కోహినూర్ బ్యాంక్‌లో రెండు లాకర్లు, కిర్లంపూడి లే అవుట్ ప్రాంతంలోని సిండికేట్ బ్యాంక్‌లో రెండు లాకర్లు ఉన్నాయని, వాటిని తెరవాల్సి ఉందని ఏసీబీ డీఎస్పీ ఎస్వీవీ ప్రసాద్ తెలిపారు. ప్రదీప్కుమార్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు కె.వెంకటేశ్వర్లు, రమేష్, లక్ష్మ జీ, మహేష్, అప్పారావు, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు. వుడాలో అవినీతి ఊడలు : రూ.500 కోట్ల కుంభకోణం నుంచి ఇప్పటి వరకూ అవినీతి కంపు విశాఖ సిటీ: విశాఖ నగరాభివృద్ధికి పెద్దన్నలా వ్యవహరించాల్సిన వుడా.. అవినీతికి అమ్మమ్మలా మారిపోతోంది. క్షేత్రస్థాయిలో చేయి తడపకుంటే పని చేయని ఉద్యోగులు... ప్లాన్ కోసం కాళ్లరిగేలా తిప్పించుకునే నైజం.. డిప్యుటేషన్లపై వచ్చిన అధికారులకు సహకరించని వైనంతో వుడా ప్రతిష్ట రోజు రోజుకీ దిగజారిపోతోంది. మొన్న వెలుగులోకి వచ్చిన రూ.500 కోట్ల కుంభకోణం నుంచి తాజాగా అడిషనల్ సీయూపీపై ఏసీబీ అధికారుల దాడుల వరకూ అవినీతిని విస్తరించుకుపోతున్నారు. అభివృద్ధితోపాటే అవినీతి జోరు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, సామాన్యులకు అందుబాటులో ఇళ్ల స్థలాలు, ఇళ్లు అందించే లక్ష్యంతో 1962లో విశాఖలో టౌన్ ప్లానింగ్ ట్రస్ట్(టీపీటీ) ఏర్పాటైంది. ఇది క్రమంగా 1978 జూన్ 17న విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా)గా రూపాంతరం చెందింది. వుడాలో 2008 నుంచి అక్రమాలు జోరందుకున్నాయి. ల్యాండ్ పూలింగ్‌లో అవకతవకలు, వుడా స్థలాలను తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపులు, నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ స్పేస్‌లలో నిర్మాణాలకు అనుమతులు.. ఇలా అనేక వరుస కుంభకోణాలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇందులో ఐఏఎస్ అధికారులల పాత్ర ఉన్నప్పటికీ కేవలం కింది స్థాయి అధికారులపైనే చర్యలు తీసుకొని చేతులు దులిపేసుకుంటున్నారు. ⇔ భూ సమీకరణ, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుల్లో జరిగిన రూ.500 కోట్ల కుంభకోణం 2009లో పెద్ద దుమారాన్నే లేపింది. ⇔ పరదేశిపాలెం, కొమ్మాది, రుషికొండ, మధురవాడ ప్రాంతంలో ఓజోన్ వ్యాలీ లే అవుట్ అభివృద్ధి విషయంలో జరిగిన అవినీతి అక్రమాల్లో అప్పటి వుడా అధికారుల పాత్ర ఉన్నట్లు స్పష్టమైంది. ⇔ అసైన్డ్ భూములను గుర్తించి ల్యాండ్ పూలింగ్‌లో సేకరించేందుకు పథకం పన్నారు. ప్రధానంగా అప్పటి ఎస్టేట్ అధికారి జగదీష్ కీలక భూమిక పోషించినట్లు అప్పట్లోనే సంచలనమైంది. ⇔ ఆ తర్వాత విశాఖలోని ఎంవీపీ కాలనీ సెక్టార్ – 2లో గల 4,114 చదరపు అడుగుల కమ్యూనిటీ సెంటర్ స్థలం కేటాయింపుల్లో స్వలాభం కోసం వుడాకు రూ.5.23కోట్లు నష్టం వాటిల్లేలా చేసిన వ్యవహారం కూడా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసుని దర్యాప్తు చేసిన సీఐడీ అప్పటి వీసీ విష్ణు, ఈవో జగదీష్‌తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసింది. ఇలా అవినీతికి పట్టుగొమ్మగా మారిపోయిన వుడా అధికారుల మాటలను దిగువ స్థాయి సిబ్బంది పెడ చెవిన పెట్టడం ప్రారంభమైంది. -
కోనేరు ప్రసాద్ కుమారుడి ఇంట్లో సీబీఐ సోదాలు
హైదరాబాద్: ఫిలింనగర్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్ నివాసంపై సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందాలు ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలో ప్రదీప్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీబీఐ వలలో రైల్వే ఉద్యోగి..
గుంటూరు: మోసాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో రైల్వేగార్డు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రైల్వేలో ఉద్యోగాలు ఇస్తామంటు నిరుద్యోగులకు టోకరా వేస్తున్న మహబూబ్ బాషా ఇంట్లో శుక్రవారం ఉదయం సీబీఐ ఆకస్మికంగా దాడులు చేసింది. బాషా ఇంట్లో 100కు పైగా అప్లికేషన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ సమాచారంతోనే గత కొన్ని రోజులుగా బాషా కదలికలపై సీబీఐ నిఘాపెట్టింది. నేడు రైల్వే ఉద్యోగి ఇంట్లో తనిఖీలు నిర్వహించి విలువైన పత్రాలు, మరికొన్ని డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రముఖులపై సీబీఐ దాడులు చేస్తే..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ కార్యాలయంలో మంగళవారం సీబీఐ జరిపిన దాడులపై కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శల యుద్ధం జరుగుతుండగా, ట్విట్టర్ యూజర్లకు మాత్రం ఇది పెద్ద హాస్య సన్నివేశంగా మారింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా రాజేంద్ర కుమార్ కార్యాలయమంతా గాలించి, శోధించి సీబీఐ అధికారులు చివరకు పైరసీ డీవీడీ సినిమాలు స్వాధీనం చేసుకున్నారంటూ తొలుత స్పందించిన ట్విట్టర్లు మరో అడుగు ముందుకేసి ప్రముఖులపై దాడులు చేస్తే ఎవరి వద్ద ఏమి దొరుకుతాయనే విషయంలో వ్యంగ్యోక్తులతో హాస్యం పండిస్తున్నారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్‌పై దాడులు చేస్తే మూడేళ్లకు సంబంధించిన విదేశీ యాత్రల టిక్కెట్లు, అక్కడ నిర్వహించే కార్యక్రమాల ఈవెంట్ మేనేజ్మెంట్ ప్లాన్లు దొరకుతాయి....ఫొటోషాప్ పైరేటెడ్ వర్షన్ దొరుకుతుంది....తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటిపై సీబీఐ దాడిచేస్తే, వెళ్లేటప్పుడు అమ్మ బొమ్మ స్టిక్కర్లు అతికించి పంపుతుంది....కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇంటిపై దాడిచేస్తే బోలడన్ని డిగ్రీలు.....వీకే సింగ్ ఇంటిపై దాడిచేస్తే బోలడన్ని బర్త్ సర్టిఫికెట్లు దొరకుతాయి....బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడిచేస్తే డ్రైవర్‌లెస్ కారు దొరకుతుంది....ఆమిర్ ఖాన్ ఇంటిపై దాడిచేస్తే అసహనంపై స్క్రిప్టులు, ఇంటి వెనకాల టాంకు నిండా మొసలి కన్నీళ్లు దొరకుతాయి....ఆజం ఖాన్ ఇంటిపై దాడిచేస్తే గడ్డి మేస్తున్న బర్రెలు దొరుకుతాయి’ అంటూ ట్వీట్లపై ట్వీట్లు విసురుతున్నారు. -
'బెదిరింపులకు మేం భయపడం'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ సోదాలు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు భగ్గుమన్నారు. సీఎం కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆప్నేతలు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై ఎవరేమన్నారంటే.. కేంద్రం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ బెదిరింపులకు మేం భయపడం. - ఆప్ నేత సంజయ్ సింగ్ మోదీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోంది. - ఆప్ నేత కుమార్ విశ్వాస్ సీఎం కార్యాలయంలో సోదాలు చేయలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ ఆఫీసులోనే దాడులు చేసాం. - సీబీఐ నా కార్యాలయంలోనే సోదాలు చేశారు. మోదీ డైరక్షన్లో దాడులు చేశారు. - కేజ్రీవాల్ పీఎంను విమర్శించడం కేజ్రీవాల్‌కు ఫ్యాషన్ అయిపోయింది. - వెంకయ్య నాయుడు