గుంటూరు: మోసాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో రైల్వేగార్డు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రైల్వేలో ఉద్యోగాలు ఇస్తామంటు నిరుద్యోగులకు టోకరా వేస్తున్న మహబూబ్ బాషా ఇంట్లో శుక్రవారం ఉదయం సీబీఐ ఆకస్మికంగా దాడులు చేసింది. బాషా ఇంట్లో 100కు పైగా అప్లికేషన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ సమాచారంతోనే గత కొన్ని రోజులుగా బాషా కదలికలపై సీబీఐ నిఘాపెట్టింది. నేడు రైల్వే ఉద్యోగి ఇంట్లో తనిఖీలు నిర్వహించి విలువైన పత్రాలు, మరికొన్ని డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.