
సాక్షి, వైఎస్సార్ : బీజేపీ నేత బండి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌టియుసి నేత మహబూబ్ బాషాపై దౌర్జన్యం చేస్తూ దాడికి పాల్పడ్డారు. వివరాలు.. రవీంద్రనగర్‌లో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న వలంటీర్లను బీజేపీ నేతలు బెదిరిస్తుండగా మహబూబ్ బాషా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని, అయినా తమ కాలనీలో మీకు తిరిగే అర్హత లేదంటూ బండి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. దీంతో దాడిలో తీవ్రంగా గాయపడిన మహబూబ్ బాషాను అక్కడి స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా మహబూబ్ బాషాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ నేత చల్లా రాజశేఖర్ తెలిపారు. బాషాపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన బీజేపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment