న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆమె శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో కీలక నేతల సమక్షంలో ఆమె ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో హిందీ టీచర్‌గా పని చేసిన అంజు.. పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు.
అనంతరం 2012 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దక్షిణ్‌పురి వార్డ్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఆమె.. తాజాగా ఆ పార్టీకి షాకిచ్చి ఆప్‌లో చేరారు. కాగా, 2012 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తన సోదరి(అంజూ) తరఫున ప్రచారం చేశారు.
Delhi: Anju Sehwag, sister of former cricketer Virender Sehwag, joins Aam Aadmi Party (AAP) pic.twitter.com/pyypeNGrwe
— ANI (@ANI) December 31, 2021
Comments
Please login to add a commentAdd a comment