నన్ను టార్గెట్ చేశారు: బీజేపీ మహిళా నేత
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు చేశారని బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మి ఆరోపించారు. ఇటీవల సైబర్ సెల్ అధికారులను కలసి ఫిర్యాదు చేసిన షాజియా.. ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.
త్వరలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ మద్దతుదారులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆరోపించారు. 'నాపై అభ్యంతకర పోస్టింగ్‌లు ఎవరు చేశారన్నది తెలుసుకోవాలనుంది. నాకు సానుభూతి అవసరం లేదు. నిందితులపై చర్యలు తీసుకోవాలి' అని షాజియా చెప్పారు.