లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్‌ | Brother Of Rape Accused BJP MLA Kuldeep Singh Sengar Arrested | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్‌

Published Tue, Apr 10 2018 9:31 AM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

Brother Of Rape Accused BJP MLA Kuldeep Singh Sengar Arrested - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ సోదరుడు అతుల్‌ సెంగార్‌..

సాక్షి, లక్నో : యూపీలో కలకలం రేపిన ఉనావో లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ సోదరుడు అతుల్‌ సెంగార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అత్యాచార బాధితురాలి తండ్రి పోలీస్‌ కస్టడీలో మరణించిన నేపథ్యంలో ఈ అరెస్ట్‌ చోటుచేసుకోవడం గమనార్హం. ఎంఎల్‌ఏ కుల్దీప్‌ సింగ్‌ సహా ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ ఆరోపిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ నివాసం ఎదుట ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా సామూహిక అత్యాచారం కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సెంగార్‌ సోదరులిద్దరూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలను బీజేపీ ఎంఎల్‌ఏ కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ తోసిపుచ్చారు. ఈ వ్యవహారం ప్రత్యర్ధుల కుట్రని అభివర్ణించారు. బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించిన వెంటనే సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఈ వ్యవహారంపై ఉన్నతస్ధాయి విచారణకు ఆదేశించారు. బీజేపీ ఎంఎల్‌ఏ సెంగార్‌ను పిలిపించి ఆయనతో సీఎం మాట్లాడతారని భావిస్తున్నరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement