ఆప్లో చీలికలు ఊహాగానమే.. | All stories about crisis in AAP imaginary: Yadav | Sakshi
Sakshi News home page

ఆప్లో చీలికలు ఊహాగానమే..

Published Mon, Mar 2 2015 11:32 AM | Last Updated on Wed, Apr 4 2018 7:03 PM

ఆప్లో చీలికలు ఊహాగానమే.. - Sakshi

ఆప్లో చీలికలు ఊహాగానమే..

ఢిల్లీలో భారీ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీలో అసంతృప్తి ముసలం అలుముకుందని వచ్చిన వార్తలను ఆ పార్టీ సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ ఖండించారు. చీలికలనేవీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని చెప్పారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతలు అప్పగించినందున వాటిపైనే దృష్టి పెడతాం తప్ప చిన్నచిన్న విషయాల జోలికి వెళ్లబోమని అన్నారు.

 

గతంలో కూడా తన గురించి మరో నేత ప్రశాంత్ భూషణ్ గురించి ఎన్నో అపవాదులు బయటకు వచ్చాయని, వాటిపై కొంత విచారిస్తూనే ఫన్నీగా తీసుకున్నామని చెప్పారు. అలాంటివన్నీ ఆధారం లేని ఆరోపణలని చెప్పారు. దేశం మొత్తం కూడా తామేం చేస్తామని ఎదురుచూస్తోందని, వారిని తాము నిరాశపరచకూడదని అనుకుంటున్నామని సోమవారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆప్లో ఒక వ్యక్తి కేంద్రంగా కార్యకలాపాలు నడుస్తున్నాయని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement