న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజుల గడువు ఉందనగా ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) బీజేపీపై మరో సంచలన ఆరోపణ చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే పక్కన హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి నీటి సరఫరాను నిలిపివేసిందన్నారు.
‘లోక్‌సభ ఎన్నికలు ప్రకటించగానే మా పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఆయన ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌పై రాగానే వెంటనే స్వాతిమలివాల్‌పై దాడి అనే కుట్రకు తెర తీశారు. ఇది కూడా వర్కవుట్ కాకపోవడంతో విదేశీ నిధులు వచ్చాయన్న పాత ఆరోపణలను మళ్లీ తవ్వారు.
ఇప్పుడు తాజాగా హర్యానాలో ఉన్న ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ఢిల్లీకి యమునా నది నీళ్లు ఆపివేశారు’అని ఆతిషి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో మే25న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment