న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన ఆమ్‌ఆద్మీపార్టీపై(ఆప్) బ్లేమ్‌గేమ్ ప్రారంభించింది. ఢిల్లీలో పోటీ చేసిన సీట్లలో కాంగ్రెస్ ఓడిపోవడానికి లిక్కర్ స్కామే కారణమని కాంగ్రెస్ నేత అభిషేక్‌దత్ అన్నారు. తాము గనుక ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవన్నారు.
#WATCH | Delhi: Congress leader Abhishek Dutt says, "When we exposed excise scam, we demanded the then government to conduct a proper investigation. ED and CBI didn't take any action, even after 18 months of filing the case. But, just 1 month before the Lok Sabha polls, they… pic.twitter.com/9TYjbifIce
— ANI (@ANI) June 29, 2024
ఢిల్లీలో నీటి సంక్షోభం వస్తే మంత్రి అతిషి చర్యలు తీసుకోవాల్సిందిపోయి నిరాహారదీక్ష పేరుతో డ్రామా చేసిందని విమర్శించారు. భారీ వర్షం పడి ఢిల్లీ స్తంభించి పోవడానికి ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మరో కాంగ్రెస్ నేత దేవేందర్‌యాదవ్ విమర్శించారు.
కాంగ్రెస్ నేతల విమర్శలకు ఆప్ స్పందించింది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిపక్షపార్టీలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని, వాటి మధ్య చీలికలు మంచివి కావని ఆప్ నేత సౌరభ్‌భరద్వాజ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment