న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై తన ఇంట్లో జరిగిన దాడి పట్ల పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనలో రెండు వెర్షన్‌లు ఉన్నాయని ఏది నిజమో తేలాలంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం కావాలన్నారు. ఈ విషయమై బుధవారం(మే22) కేజ్రీవాల్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
కాగా, మే13న ఎంపీ స్వాతిమలివాల్ సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని మలివాల్ తొలుత ఆరోపించారు.
వివాదం పెద్దదైన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంలో ఆప్ నేతలు, స్వాతిమలివాల్ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment