'ఆ ఎమ్మెల్యే.. ఓ డ్రగ్ ఎడిక్ట్' | Alka Lamba a drug addict, alleges BJP MLA | Sakshi
Sakshi News home page

'ఆ ఎమ్మెల్యే.. ఓ డ్రగ్ ఎడిక్ట్'

Published Mon, Aug 10 2015 4:51 PM | Last Updated on Fri, May 25 2018 2:43 PM

'ఆ ఎమ్మెల్యే.. ఓ డ్రగ్ ఎడిక్ట్' - Sakshi

'ఆ ఎమ్మెల్యే.. ఓ డ్రగ్ ఎడిక్ట్'

తనపై దాడి జరిగిందని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబా.. నిజానికి ఓ డ్రగ్ ఎడిక్ట్ అని బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ ఆరోపించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్లే ఆమెపై దాడి జరిగి ఉంటుందని ఆయన అన్నారు. అయితే.. ఈ ఘటన తర్వాత చాందినీ చౌక్ ఎమ్మెల్యే అయిన లాంబాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ అనుచరులైన కొందరు గూండాలు చాందినీ చౌక్ ప్రాంతంలో దుకాణాలను తగలబెట్టారని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేస్తే లాఠీలు పట్టుకునే బీజేపీ కార్యకర్తలు గట్టిగా ఎదుర్కొంటారని హెచ్చరించారు.

తెల్లవారుజామున, రాత్రి ప్రాంతాల్లో అల్కా లాంబా ఇక్కడ కనిపించినట్లు స్థానికులు చెప్పారని, డ్రగ్స్ను అరికట్టాలని పోరాడేవాళ్లు అర్ధరాత్రి 1 నుంచి 4 గంటల సమయంలో అక్కడకు రారని శర్మ అన్నారు. దీన్ని బట్టి చూస్తే, ఆమే డ్రగ్స్కు బానిస అన్న విషయం తెలుస్తోందన్నారు. తనకు మహిళలంటే చాలా గౌరవమని, అయితే.. ఫూలన్ దేవి లాంటి వాళ్లను మహిళా శక్తికి నిదర్శనంగా చూపాలనుకుంటే మాత్రం కుదరదని చెప్పారు. డ్రగ్స్ మత్తులోనే ఆమె హింసాత్మకంగా ప్రవర్తించారని శర్మ విలేకరులతో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement