'ఏ తప్పూ చేయలేదు.. సీసీటీవీ చూసుకోండి' | aap protesters at bjp leader op sharma residency | Sakshi
Sakshi News home page

'ఏ తప్పూ చేయలేదు.. సీసీటీవీ చూసుకోండి'

Published Wed, Nov 25 2015 1:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'ఏ తప్పూ చేయలేదు.. సీసీటీవీ చూసుకోండి' - Sakshi

'ఏ తప్పూ చేయలేదు.. సీసీటీవీ చూసుకోండి'

న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో మరోసారి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వివాదం చోటుచేసుకుంది. తమ పార్టీ నేత ఆల్కా లాంబ విషయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని, అనకూడని మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత ఓపీ శర్మ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓపీ శర్మ మీడియాతో మాట్లాడుతూ తన తప్పు ఉంటే ఆప్ ఎలాంటి ఫిర్యాదునైనా పోలీసులకు చేసుకోవచ్చని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో తనను ఆల్కా లాంబ అవమానించిందని, తిట్టిందని, అవన్నీ కూడా సీసీటీవీలో రికార్డయి ఉందని, వాటని పరిశీలిస్తే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఆప్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పారు. తాను ఒక్క మాట కూడా ఆల్కాను అనలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement