సాక్షి, న్యూఢిల్లీ: అనర్హతకు గురైన ఆప్ ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఇక ఇక ఆప్ ఎమ్మెల్యేల అనర్హత కేసును హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కాగా పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 20 మంది ఢిల్లీ ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవడంతో ఈ సీట్లకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు ఎన్నికల సంఘం(ఈసీ) సిఫార్సును రాష్ట్రపతి ఆదివారం ఆమోదించగా, ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆప్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలు ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట కలిగించాయనే చెప్పవచ్చు. ఇక మొత్తం 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ బలం 66 నుంచి 44కు పడిపోయినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని సర్కారుకు ఢోకా లేదు.
Comments
Please login to add a commentAdd a comment