
తప్పు చేశాను క్షమించండి..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారు. ఆప్ ర్యాలీలో గజేంద్ర సింగ్ ఆత్మహత్య సందర్శంగా వెల్లువెత్తిన విమర్శలతో ఇరకాటంలో పడిన కేజ్రీవాల్ తప్పు దిద్దుకునే పనిలో పడ్డారు. ఘటన జరిగిన రెండు రోజులు తర్వాత ఆయన స్పందించారు..నేను తప్పుచేశాను క్షమించండి.,,, ఆ దుర్ఘటన తర్వాత నేను ప్రసంగించకుండా ఉండాల్సింది. ఎవర్నయినా బాధపెట్టి వుండే నా మన్నించండన్నారు.
కాగా భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం ఆప్ తలపెట్టిన ర్యాలీ రాజస్థాన్ చెందిన 41 సంవత్సరాల గజేంద్రసింగ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతణ్ని ఆసుపత్రి తరలించిన తరువాత దాదాపు పదినిమిషాలపాటు ప్రసంగించిన కేజ్రీవాల్ గజేంద్రను కాపాడ్డంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షాలు, ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. గజేంద్రను రక్షించడంలో ఆప్ నేతలు, కార్యకర్తలు నిర్లక్ష్యాన్నిప్రదర్శించారని, వైదికపై ఉండి చోద్యం చూశారని మండిపడ్డారు. దీనిపై గురువారం పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం క్షమాపణలు తెలిపినట్టు సమాచారం.
,