మద్యం కేసులో ఆప్ ఎమ్మెల్యేపై విచారణ | Police to summon AAP MLA Naresh Balyan over seizure of liquor from his godown | Sakshi
Sakshi News home page

మద్యం కేసులో ఆప్ ఎమ్మెల్యేపై విచారణ

Published Thu, Feb 12 2015 11:06 PM | Last Updated on Fri, Aug 17 2018 7:42 PM

మద్యం సీసాల్ల స్వాధీనం కేసులో ఆప్ ఎమ్మెల్యే నరేశ్ బలియాన్‌ను గురువారం పోలీసులు విచారించారు. ఎన్నికల ప్రచారం సమయంలో విహార్

 న్యూఢిల్లీ: మద్యం సీసాల్ల స్వాధీనం కేసులో ఆప్ ఎమ్మెల్యే నరేశ్ బలియాన్‌ను గురువారం పోలీసులు విచారించారు. ఎన్నికల ప్రచారం సమయంలో విహార్ నగర్‌లోని అతని ఇంటిలో 8,000 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే. వాటిపై ‘ఫర్ సేల్ ఇన్ హరియాణా’ అని ఉంది. దీంతో విచారణకు హాజరుకావాలని నరేశ్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు జరుగుతున్నందున అవి ముగిశాక విచారణకు హాజరవుతానని నరేశ్ బదులివ్వడంతో గురువారం విచారించారు. చాణక్యపురిలోని క్రైం బ్రాంచ్‌కి న్యాయవాదితో సహా హాజరైన అతన్ని పోలీసులు దాదాపు రెండు గంటల పాటు విచారించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement