ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన‍్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెంచారు. ఇప్పటికే గుజరాత్‌లో పర్యటించిన కేజ్రీవాల్.. అక్కడ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన నిర‍్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్‌లో తన అన్ని రాజకీయ సంస్థలను రద్దు చేసింది. ఇందులో అన్ని సంస్థలు, విభాగాలు, మీడియా బృందం ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహకానికి సంబంధించి పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా కొత్త సంస్థను ఏర్పాటు చేయనుంది.
ఇక, గుజరాత్‌లో గెలుపే లక్ష్యంగా.. ఆప్ కొత్త ప్రణాళికలను రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ఆప్ భావిస్తున్నట్టు సమాచారం. గుజరాత్‌లోని 33 జిల్లాల అధ్యక్షులతో సహా దాదాపు 50 స్థానాల్లో కొత్త నియామకాలను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. వీటిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జి తదితర పదవులు ఉండనున్నాయి.
ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్
Comments
Please login to add a commentAdd a comment