అమృత్‌సర్: ఎన్నికల్లో తాను కేవలం అభ్యర్థి మాత్రమేనని, తన కోసం ఎన్నికల్లో పోరాడుతున్నది అమృత్‌సర్ ప్రజలేనని చెప్పారు మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 52 ఏళ్ల కున్వర్.. గతేడాది ముందస్తు పదవీ విరమణ చేసి జూన్ 2021లో అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ‘ఆప్’లో చేరారు. వ్యవస్థను ప్రక్షాళన చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన ప్రకటించుకున్నారు.
ఫిబ్రవరి 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ దత్తి, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి మాజీ మంత్రి అనిల్ జోషి, ఇతరులతో కున్వర్ పోరుకు సిద్ధమయ్యారు. పంజాబ్‌లోని మజా ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన కీలక నేతగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన దీమాగా చెబుతున్నారు. తమ పార్టీని గెలిపిస్తే స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని హామీయిచ్చారు. అవినీతి, మాదకద్రవ్యాల మహమ్మారి నిర్మూలన, మహిళల భద్రత, ఆరోగ్యం, విద్య, శాంతిభద్రతలను మెరుగుపరుస్తామన్నారు.
ఉద్యోగ జీవితంలో ఎక్కువ కాలం అమృత్‌సర్‌లో పనిచేయడంతో కున్వర్‌కు కలిసొచ్చే అంశం. 2000 సంవత్సరం ప్రారంభంలో అమృత్‌సర్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. 2007, 2009 మధ్య కాలంలో ఇక్కడ సీనియర్ ఎస్పీగా పనిచేశారు. (క్లిక్: వామ్మో.. 94 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ.. ఎవరో తెలుసా?)
అమృత్‌సర్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారని అడగ్గా... ‘రాజకీయాల్లోకి రావాలనే నా నిర్ణయాన్ని అమృత్‌సర్ ప్రజలు మార్గనిర్దేశం చేసారు. నేను ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకున్నారు. వారు నన్ను ఈ మిషన్‌కు సిద్ధం చేశారు. మొత్తం అమృత్‌సర్ నా కోసం ఎన్నికల్లో పోరాడుతోంది. నిజాయితీపరులు, నిజాయితీ గల వ్యక్తులు ముందుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కున్వర్ జవాబిచ్చారు. పంజాబ్ నుంచి 'మాఫియా రాజ్'ను ఆప్ నిర్మూలిస్తుందని.. డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడానికి తమ పార్టీ ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యత కల్పించామన్నారు. (చదవండి: భగవంత్ మాన్.. ఆప్ బూస్టర్ షాట్)
Comments
Please login to add a commentAdd a comment