వివాదంలో మరో ఆప్‌ ఎమ్మెల్యే | AAP MLA summoned by court for giving false information to EC | Sakshi
Sakshi News home page

వివాదంలో మరో ఆప్‌ ఎమ్మెల్యే

Published Thu, Apr 27 2017 4:27 PM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

వివాదంలో మరో ఆప్‌ ఎమ్మెల్యే - Sakshi

వివాదంలో మరో ఆప్‌ ఎమ్మెల్యే

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చారనే కేసులో ఆప్‌ ఎమ్మెల్యే సోమ్‌ దత్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు పంపింది. ఈ కేసులో అక్టోబరు 13వ తేదీలోపు కోర్టు ఎదుట హాజరుకావాల్సిందిగా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ అభిలాష్‌ మల్హోత్రా.. సోమ్‌ దత్‌ను ఆదేశించారు.

2015లో సాదర్‌ బజార్‌ నియోజకవర్గం నుంచి ఆప్‌ తరఫున సోమ్‌ దత్‌ ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు. దత్‌ తల్లిదండ్రులు ఆయనపై ఆధారపడి జీవిస్తున్నారని, అఫిడవిట్‌లో ఈ విషయాన్ని దాచారని, అలాగే ఆస్తుల వివరాలను పూర్తిగా ప్రకటించలేదని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీలో అధికార ఆప్‌ ఎమ్మెల్యేలు 12 మందిపై పలు కేసులు నమోదయ్యాయి. నకిలీ డిగ్రీ పొందారనే ఆరోపణలపై న్యాయ శాఖ మాజీ మంత్రి జితేందర్‌ తోమర్‌ అరెస్ట్‌ కాగా, మరో మాజీ మంత్రి సోమనాథ్‌ భారతి గృహహింస కేసును ఎదుర్కొంటున్నారు. ఇక ఆప్‌ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై హత్య, అత్యాచారం కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement