కేజ్రీవాల్‌కు మళ్లీ సమన్లు | Delhi Court Issues Notice To Kejriwal On ED Complaint Of Not Complying With Summons | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు మళ్లీ సమన్లు

Published Fri, Mar 8 2024 6:21 AM | Last Updated on Fri, Mar 8 2024 6:21 AM

Delhi Court Issues Notice To Kejriwal On ED Complaint Of Not Complying With Summons - Sakshi

న్యూఢిల్లీ: మద్యం విధానం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన నోటీసులను పట్టించుకోని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది.

విచారణకు రావాలంటూ జనవరి 12, 31వ తేదీలతోపాటు ఫిబ్రవరి 14వ తేదీన పంపిన 4 నుంచి 8 వరకు సమన్లపై కేజ్రీవాల్‌ స్పందించలేదంటూ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. విచారణ చేపట్టిన జడ్జి దివ్యా మల్హోత్రా ఈ నెల 16వ తేదీన తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement