న్యూఢిల్లీ: ఆప్ సారథి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీలో తొలి రాత్రి భారంగా గడిచింది. లాకప్ రూములో ఉంచి మంచం లేకుండా పరుపు, దుప్పటి మాత్రం ఇచ్చారు. ఏసీ సదుపాయం కల్పించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో గురువారం సాయంత్రం నుంచి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో గంటల తరబడి ప్రశ్నించిన ఈడీ అధికారులు, రాత్రి 11 గంటల ప్రాంతంలో అరెస్టు చేయడం తెలిసిందే.
రాత్రి భోజనం అనంతరం ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కేజ్రీని లాకప్ గదికి తరలించారు. అక్కడ ప్రత్యేక సదుపాయాలేవీ కలి్పంచలేదు. కేజ్రీవాల్ పెద్దగా నిద్ర పోకుండా భారంగానే గడిపినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం చాయ్, అల్పాహారం అందించారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ ఇన్సులిన్ తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. కాసేపటికి కాఫీ ఇచ్చారు. తర్వాత కోర్టులో హాజరు పరిచారు.
నిర్బంధంలో సీఎం కుటుంబం: ఆప్ మంత్రుల ధ్వజం
కేజ్రీవాల్ కుటుంబాన్ని కలిసేందుకు ఆయన నివాసంలోనికి పోలీసులు అనుమతించడం లేదంటూ ఆప్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ‘‘సీఎం కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రిని, అరెస్ట్‌తో కుంగిపోయిన కుటుంబాన్ని ఓదార్చనివ్వరా? ఇందుకు ఏ చట్టం అనుమతినిచ్చింది? హౌజ్ అరెస్ట్‌ను ఆపేయండి’’ అంటూ నినదించారు.
అధికారం కోసమే అరెస్టు: కేజ్రీవాల్ భార్య
తన భర్తను అక్రమంగా అరెస్టు చేసి ఢిల్లీ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని కేజ్రీవాల్ భార్య సునీత మండిపడ్డారు. ఢిల్లీలో అధికారం దక్కించుకోవాలన్న ఆరాటంతోనే అరెస్టు చేశారంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రశ్నించేవారిని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment