Lockup
-
రాత్రంతా లాకప్‌లో..
న్యూఢిల్లీ: ఆప్ సారథి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీలో తొలి రాత్రి భారంగా గడిచింది. లాకప్ రూములో ఉంచి మంచం లేకుండా పరుపు, దుప్పటి మాత్రం ఇచ్చారు. ఏసీ సదుపాయం కల్పించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో గురువారం సాయంత్రం నుంచి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో గంటల తరబడి ప్రశ్నించిన ఈడీ అధికారులు, రాత్రి 11 గంటల ప్రాంతంలో అరెస్టు చేయడం తెలిసిందే. రాత్రి భోజనం అనంతరం ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కేజ్రీని లాకప్ గదికి తరలించారు. అక్కడ ప్రత్యేక సదుపాయాలేవీ కలి్పంచలేదు. కేజ్రీవాల్ పెద్దగా నిద్ర పోకుండా భారంగానే గడిపినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం చాయ్, అల్పాహారం అందించారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ ఇన్సులిన్ తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. కాసేపటికి కాఫీ ఇచ్చారు. తర్వాత కోర్టులో హాజరు పరిచారు. నిర్బంధంలో సీఎం కుటుంబం: ఆప్ మంత్రుల ధ్వజం కేజ్రీవాల్ కుటుంబాన్ని కలిసేందుకు ఆయన నివాసంలోనికి పోలీసులు అనుమతించడం లేదంటూ ఆప్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ‘‘సీఎం కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రిని, అరెస్ట్‌తో కుంగిపోయిన కుటుంబాన్ని ఓదార్చనివ్వరా? ఇందుకు ఏ చట్టం అనుమతినిచ్చింది? హౌజ్ అరెస్ట్‌ను ఆపేయండి’’ అంటూ నినదించారు. అధికారం కోసమే అరెస్టు: కేజ్రీవాల్ భార్య తన భర్తను అక్రమంగా అరెస్టు చేసి ఢిల్లీ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని కేజ్రీవాల్ భార్య సునీత మండిపడ్డారు. ఢిల్లీలో అధికారం దక్కించుకోవాలన్న ఆరాటంతోనే అరెస్టు చేశారంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రశ్నించేవారిని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. -
ఎస్ఐ, ఏఎస్ఐలను లాకప్‌లో బంధించిన ఎస్పీ.. వీడియో వైరల్
పాట్నా: సబ్ ఆర్డినేట్ల పనితీరుతో బిహార్ నవాడా జిల్లా ఎస్పీ గౌరవ్ మంగళకు చిర్రెత్తిపోయింది. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన ముగ్గురు ఏఎస్ఐ, ఇద్దరు ఎస్ఐలను లాకప్‌లో వేశారు. రెండు గంటలపాటు వారిని లోపలే ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. बिहार पुलिस का हाल नवादा में SP ने लापरवाही बरतने के कारण 2 दारोगा और 3 ASI को 2 घंटे तक थाने के लॉकअप में बंद कर दिया. पुलिस एसोसिएशन ने SP पर कार्रवाई की माँग की. pic.twitter.com/FpF4ye9KOb — UnSeen India (@USIndia_) September 10, 2022 అయితే ఈ విషయంపై ఎస్పీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఫేక్ న్యూస్ అని బదులిచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎన్నిసార్లు అడిగినా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు బిహార్ పోలీసు సమాఖ్య ఈ ఘటనపై శనివారం న్యాయ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎస్పీని అడిగేందుకు ప్రయత్నిస్తే ఆయన స్పందించట్లేదని పోలీసు సమాఖ్య అధ్యక్షుడు మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలు బిహార్ పోలీసులను అప్రతిష్టపాలు చేస్తాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ తన అధికారంతో కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: భారత్ జోడో యాత్ర: రాహుల్ ఓకే అంటే పెళ్లికి రెడీ! -
మహిళా జర్నలిస్ట్‌పై కంగనా అసహనం.. ఎందుకంటే ?
Kangana Ranaut Lashes Out A Journalist And Said Sit Down: బాలీవుడ్ బ్యూటీ, డేరింగ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అభిప్రాయాలు, కామెంట్లతో వైరల్‌గా మారుతుంది. ఏ విషయాన్నైనా, ఎవరితోనైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా ఈ స్టార్ హీరోయిన్ ఓ మహిళా విలేకరిపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా హీరోయిన్గా, కాంట్రవర్సీ క్వీన్‌గా అలరించిన కంగనా తాజాగా హోస్ట్‌గా వ్యవహరించనుందన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించనున్న రియాల్టీ షో 'లాక్ అప్'కు వ్యాఖ్యతగా సందడి చేయనుంది కంగనా. ఈ షో మరికొన్ని రోజుల్లో ఆల్ట్ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీల వేదికగా ప్రసారం కానుంది. అయితే ఈ షో ఫార్మాట్‌ను తెలియజేస్తూ గురువారం (జనవరి 3) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంగనా జర్నలిస్ట్‌ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఒక లేడీ జర్నలిస్ట్ 'మేడమ్, ఈ మధ్య కాలంలో మహిళలు ధరించే దుస్తులను బట్టి వారి ప్రవర్తనపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె కూడా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి కామెంట్స్‌తో టార్గెట్ చేయబడ్డారు. దీనిపై మీ స్పందన ఏంటీ ?' అని అడిగారు. దీంతో 'చూడండి, ఎవరైతే తమను రక్షించుకోలేరో వారిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆమె తనను తాను రక్షించుకోగలదు. ఆమెకు (దీపికా పదుకొణె) ఆ సామర్థ్యం ఉంది. అయితే ఆమె సినిమాను నేను ఇక్కడ ప్రమోట్ చేయను. కాబట్టి, మీరు కూర్చొండి.' అంటూ అసహనంగా సమాధానం ఇచ్చింది కంగనా రనౌత్. -
పవన్ కళ్యాణ్ జల్సా సినిమా సీన్‌ను గుర్తు చేసిన ఢిల్లీ గ్యాంగ్స్టర్స్
ఢిల్లీ: గ్యాంగ్స్టర్స్ లాక్ అప్‌లో ఉండి జల్సా సినిమాలోని సీన్లను రిపీట్ చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక వివరాల్లోకి వెళితే..దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాను చూసి ఉంటారుగా.. ఆ సినిమాలోని విలన్ ముకేష్ రిషి జైలు నుంచే సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ సన్నివేశం ప్రారంభంలో అది జైలు అని మనకు ఏ మాత్రం అనిపించదు. విచారణ నిమిత్తం కోర్టు నుంచి జైలుకు వెళ్లే దారిలో మర్డర్లు కూడా చేసి వస్తాడు ఆ సినిమాలోని విలన్. సినిమాలో చూడటానికి ఆ సన్నివేశం ఎంత బాగున్నా కూడా నిజ జీవితంలో ఇలా జరుగుతాయా అని మనం అనుకుంటూవుంటాం. అయితే తాజాగా అలాంటి సంఘటనలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాకపోతే ఆ సినిమాలో జైలు నుంచి చేస్తే ఈ వీడియోలో మాత్రం లాకప్ నుంచి. నలుగురు వ్యక్తులు లాకప్‌లో హ్యాపీగా కుర్చొని మద్యం తాగుతూ అందులో కలుపుకోవడానికి కూల్ డ్రింగ్స్, తినడానికి స్నాక్స్‌తో పాటు చేతిలో సిగరెట్టుతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇదిలా ఉంటే లాకప్‌లోని మరొక గ్యాంగ్‌స్టర్ సరదాగా ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోని ఆ జైలులో ఉన్న ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవన పోస్ట్ చేయడం ఇందులోని ట్విస్ట్ అని చెప్పాలి. అంతే కాదు ఆ వీడియోలో ఉన్నది నీరజ్ బవన సోదరులైన రాహుల్ కాలా, నవీన్ బాలి కావడం ఇందులోని మరో ట్విస్ట్. View this post on Instagram A post shared by Neeraj_bawana_ (@neeraj_bawanaa_official_) అయితే అప్పటికే రాహుల్ కాలా, నవీన్ బాలి జైలులో ఉండగా ఈ నెల ఐదవ తారీకున పోలీసులు వారిని మళ్లీ అరెస్టు చేశారు. కస్టడిలో ఉంచి విచారణ చేసిన పోలీసులు ఆగస్టు 10న వీరిని తిరిగి జైలుకు పంపించారు. ఇదిలా ఉంటే వీళ్లను మళ్లీ అరెస్టు చేసింది కూడా జైలు నుంచి బయటి వారిని బెదిరింపులకు గురి చేసినందుకు కావడం గమనార్హం. ఇంకా ఈ వీడియోలో వీరున్న సెల్‌కి ఎదుట సెల్లో కొందరు ఖైదీలు కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఇదంతా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా తమకు ఏమీ తెలియనట్టుగా లాకప్‌లో మద్యం అందించబడదని జరిగిన సంఘటణపై విచారణ చేస్తామని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉండగా ఈ వీడియో మాత్రం ఇంటర్ నెట్లో వైరలై చక్కర్లు కొడుతోంది. -
సీసీటీవీలు, ఆడియో రికార్డింగ్ ఉండాల్సిందే : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: జైళ్లు, పోలీస్ స్టేషన్లు, లాకప్‌లు, ఇతర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. అరెస్టు చేసి, విచారణ జరిపే అధికారం ఉన్న సీబీఐ, ఈడీ,నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) తో సహా ఇతర దర్యాప్తు సంస్థల విచారణ గదుల్లో వీటిని విధిగా అమర్చాలని సుప్రీం స్పష్టం చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లో అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, మెయిన్ గేట్, లాకప్స్, కారిడార్లు, లాబీ, రిసెప్షన్ వద్ద వీటిని కచ్చితంగా ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ) ఈ మేరకు చర్యలు తీసుకునేలా చూడాలని జస్టిస్ ఆర్ఎఫ్ నరిమన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 3, 2018నాటి ఉత్తర్వులకు అనుగుణంగా మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టేందుకు అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీం తేల్చి చెప్పింది. నవంబర్ 24 వరకు 14 రాష్ట్రాలు నివేదికలను దాఖలు చేశాయని, వాటిలో ఎక్కువ భాగం ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, తదితర వివరాలను వెల్లడించడంలో విఫలమయ్యాయని తన 12 పేజీల ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది. సీసీటీవీ వ్యవస్థలు తప్పనిసరిగా నైట్ విజన్ కలిగి ఉండాని ఈ పుటేజ్ లేదా డేటాను కనీసం ఒక సంవత్సరం పాటు స్టోరేజ్ చేయాలని అత్యున్నత ధర్మాసనం తెలిపింది. కేంద్రం, ఆయాలు రాష్ట్రాలు, యూటీలు దీనికి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయాలని పేర్కొంది. -
జైలులో యువతిపై గ్యాంగ్ రేప్?
మధ్యప్రదేశ్ : జైలులోని ఓ యువతిపై పోలీసులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్ ఇన్‌చార్జ్‌తో సహా ఐదుగురు పోలీసులు 10 రోజుల పాటు సదరు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఓ హత్య కేసులో 20 ఏళ్ల యువతి రేవా జిల్లాలోని మాంగ్వాన్ పోలీసుల కస్టడీలో ఉంది. అక్టోబర్ పదో తేదీన జైలును తనిఖీ చేసేందుకు అడిషనల్ జిల్లా జడ్జితో పాటు కొందరు లాయర్ల వెళ్లగా ఈ విషయం బయటపడింది. తనపై మే 9వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు ఐదుగురు పోలీసులు లాకప్‌లోనే అత్యాచారం చేసినట్టు వివరించింది. ఈ విషయాన్ని మూడు నెలల క్రితమే జైలు వార్డెన్‌కు చెప్పానని, అయినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొంది. కాగా సదరు యువతిని అరెస్టు చేసిందే మే 21వ తేదీన అని, అడిషనల్ జిల్లా జడ్జి జ్యుడీషియల్ ఎంక్వైరీ ఆదేశాల నేపథ్యంలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. -
అమ్మో లాకప్
సాక్షి, విజయవాడ బ్యూరో: లాకప్‌కెళ్తే ప్రాణాలతో తిరిగిరావడం కష్టమేనా. అక్కడికెళ్తే యమపురిలో అడుగుపెట్టినట్టేనా? విజయవాడ పోలీస్ స్టేషన్లలో నిందితులపై హింస బాగా పెరిగింది. ఈ ఏడాదిలోనే దుర్గాప్రసాద్ పోలీసుల చేతిలో చనిపోయిన రెండో వ్యక్తి. గతంలో వ¯Œæటౌన్ పీఎస్‌లోని సీసీఎస్ భవనంలోని పై అంతస్తు నుంచి రాజమండ్రికి చెందిన ఓ వ్యాపారి పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక దూకి ప్రాణాలు తీసుకున్నాడు. విజయవాడ జక్కంపూడి కాలనీలో నివాసం ఉంటున్న మారిశెట్టి దుర్గాప్రసాద్ (23) పోలీసు చిత్రహింసల వల్లే చనిపోయాడని అతనికుటుంబ సభ్యులు, ఓపీడీఆర్ నిజనిర్ధరణ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. జూలై 20వ తేదీ రాత్రి ఇంటికి రాలేదు. ఆయన మిత్రులు నాగరాజు, హరిబాబు కూడా ఇంటికి చేరలేదు. తల్లి, భార్యలకు పోలీసులపైనే అనుమానం వచ్చింది. ఎందుకంటే గతంలోనూ ఇలాగే దుర్గాప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకెళ్ళి వారం రోజుల తరువాత పంపించేవారు. పోలీసుల దెబ్బల నుంచి తేరుకునేందుకు కనీసం నెలరోజులు పట్టేది. తల్లి, భార్య తమ పరిధిలోని స్టేషన్లకు వెళ్ళారు. నీ భర్తను తాము తీసుకు రాలేదంటూ పోలీసులు చెప్పారు. జూలై 30న పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. నీ భర్తకు బాగోలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పారు. అక్కడికి వెళ్ళగానే దుర్గాప్రసాద్ శవాన్ని భార్య, తల్లికి అప్పగించారు పోలీసులు. ఏం జరిగింది.... జూలై 20 సాయంత్రం దుర్గాప్రసాద్, అతని స్నేహితులు నాగరాజు, హరిబాబులు బుడమేరు కట్టపై నడుచుకుంటూ వస్తున్నారు. ఇరువురు కానిస్టేబుళ్ళు పని ఉంది అంటూ ముగ్గురినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్ళారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్ కాంపౌండ్‌లోని సీసీఎస్ స్టేషన్లో వీరిని ఉంచారు. 20 నుంచి 28 వరకు సీసీఎస్ స్టేషన్లోనే ఉంచి దుర్గాప్రసాద్‌పై నిత్యం థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఆ తరువాత సీసీఎస్ పోలీసులు నాగరాజు, హరిబాబులను వేరే కేసుల్లో నిందితులుగా పేర్కొని రిమాండ్‌కు పంపించారు. తీవ్రమైన దెబ్బల వల్ల దుర్గాప్రసాద్ పేగులు, గుండె డ్యామేజీ కావడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో పోలీసులు వన్‌టౌన్‌లోని ఒక ప్రైవేట్ వైద్య శాలకు (నిత్యం పోలీసులు నిందితులకు వైద్యం చేయించే ప్రైవేట్ ఆస్పత్రి) జూలై 30 తరలించారు. అప్పటికే చావుకు దగ్గరైన దుర్గాప్రసాద్‌కు వైద్యం చేయడం సాధ్యం కాదంటూ వైద్యుడు తేల్చి చెప్పారు. æహడావుడిగా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతిచెందాడు. దుర్గాప్రసాద్ రాత్రి తొమ్మిది గంటలకు చనిపోగా 11 గంటలకు బంధువులు ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. కొందరు పోలీసు పెద్దలు వారిని నయానో భయానో నచ్చజెప్పి శవాన్ని ఇంటికి తీసుకుపోయేలా చేశారు. 31వ తేదీన శవాన్ని ఖననం చేసే సమయంలోనూ పోలీసులు మోహరించారు. బంధువులతో సెటిల్మెంట్... చనిపోయిన వ్యక్తి తిరిగి రాడని, అల్లరి చేస్తే పోలీసుల నుంచి మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని బందువులకు పోలీసులు సర్దిచెప్పారు. మృతుని భార్యకు రూ. 2.50 లక్షలు, తల్లికి రూ. లక్ష ఇచ్చే విధంగా ఒప్పందం చేసి గుట్టుచప్పుడు కాకుండా కేసును మూసివేశారు ఖాకీలు. అనుమానాస్పద మరణంలో కచ్చితంగా నిర్వహించాల్సిన పోస్టుమార్టం కూడా జరపలేదు. పీఎం చేస్తే నిజాలు బయటపడతాయనే భయమే కారణం. గతంలో గన్నవరం యువకుడు కూడా ఏడాది కిందట పెనమలూరు పోలీసులు దొంగతనం కేసులో గన్నవరానికి చెందిన పుల్లా రమేష్ అనే యువకుణ్ని తీవ్రంగా హింసించడంతో అతడు చనిపోయాడు. తాము పట్టుకోబోతే కొంగల మందు మింగాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగానే మరణించాడని అప్పటి సీఐ సీహెచ్ జగన్మోçß毌æరావు చెప్పారు. దర్యాప్తు తీరుల్లో ఎన్నో ఆధునిక విధానాలు వస్తున్నా వాటిని పాటించకుండా, తమకు తెలిసిన చిత్రహింసలనే నిందితులపై ప్రయోగిస్తున్నారు సిటీ పోలీసులు. ఫలితంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మాకు సంబంధం లేదు సీసీఎస్ ఏడీసీపీ వెల్లడి దుర్గాప్రసాద్ మరణంతో పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని విజయవాడ క్రైమ్స్ (సీసీఎస్) అదనపు డిసిపి రామకోటేశ్వరరావు చెప్పారు. దుర్గాప్రసాద్ లాకప్‌డెత్ విషయమై సాక్షి డిసిపిని వివరణ కోరగా అతని మరణంతో పోలీసులకు ప్రమేయం లేదని చెప్పడం గమనార్హం. అతన్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్ళలేదని, అతను ఎలా మరణించిందీ తమకు తెలియదని ఆయన చెప్పారు. -
'అనంత'లో లాకప్ డెత్ !
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి పోలీసుల అదుపులో చనిపోయాడు. చెన్నేకొత్తపల్లె మండలం ముష్టికోవెల పంచాయతీ గువ్వలగొందిపల్లెకు చెందిన బత్తెన శ్రీరాములు(54) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముష్టికోవెల సమీపంలో జూలై 24వ తేదీన గుప్త నిధుల తవ్వకాలు జరిగాయి. ఆ కేసు విచారణలో భాగంగా పోలీసులు మాలక్కగారి సంజీవప్ప, తలారి సంజీవప్ప, రొద్దం ముత్యాలు, బత్తెన శ్రీరాములను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు ఆ క్రమంలో శ్రీరాములు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. దీంతో అతని మృతదేహాన్ని పోలీసులు ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. అతనితో పాటు పోలీసుల అదుపులో ఉన్న మరో ముగ్గురు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వారికి రహస్యంగా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. శ్రీరాములు మరణించాడని వార్త తెలిసిన అతడి కుటుంబ సభ్యులు ధర్మవరం ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసుల వల్లే శ్రీరాములు మరణించాడని వారు ఆందోళనకు దిగారు. ధర్మవరంలో ఉద్రిక్తత చెన్నేకొత్తపల్లి మండల పోలీసుల అదుపులో శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. శ్రీరాములు మృతదేహాన్ని పోలీసులు ధర్మవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన శ్రీరాములు బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి, ఆందోళనకు దిగారు. దీనిపై విచారణ చేసేందుకు అక్కడి చేరుకున్న డీఎస్పీ వేణుగోపాల్‌తో వాగ్వాదానికి దిగారు.