
మధ్యప్రదేశ్ : జైలులోని ఓ యువతిపై పోలీసులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్ ఇన్‌చార్జ్‌తో సహా ఐదుగురు పోలీసులు 10 రోజుల పాటు సదరు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఓ హత్య కేసులో 20 ఏళ్ల యువతి రేవా జిల్లాలోని మాంగ్‌వాన్ పోలీసుల కస్టడీలో ఉంది. అక్టోబర్ పదో తేదీన జైలును తనిఖీ చేసేందుకు అడిషనల్ జిల్లా జడ్జితో పాటు కొందరు లాయర్ల వెళ్లగా ఈ విషయం బయటపడింది. తనపై మే 9వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు ఐదుగురు పోలీసులు లాకప్‌లోనే అత్యాచారం చేసినట్టు వివరించింది. ఈ విషయాన్ని మూడు నెలల క్రితమే జైలు వార్డెన్‌కు చెప్పానని, అయినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొంది. కాగా సదరు యువతిని అరెస్టు చేసిందే మే 21వ తేదీన అని, అడిషనల్ జిల్లా జడ్జి జ్యుడీషియల్ ఎంక్వైరీ ఆదేశాల నేపథ్యంలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment