
ఐజ్వాల్: మిజోరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నూతన ముఖ్యమంత్రి లాల్‌దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కొత్త కార్లు కొనుగోలు చేయబోమని కరాఖండీగా చెప్పేశారు.
కొత్త ప్రభుత్వం కొలువుతీరిన ప్రతిసారీ కొత్త కార్ల కొనుగోలుతో ప్రజాధనం వృథా అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల దిగిపోయిన మంత్రులు, ఓడిన ఎమ్మెల్యేలు వాడిన ప్రభుత్వ వాహనాలనే కొత్త మంత్రులు, శాసనసభ్యులు వాడుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment