new ministers
-
అమెరికా వ్యవసాయ మంత్రిగా బ్రూక్ రోలిన్స్
వాషింగ్టన్: చిరకాల మిత్రురాలు బ్రూక్ రోలిన్స్‌ను వ్యవసాయ మంత్రిగా డోనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. రిపబ్లికన్ల థింక్ టాంక్ అమెరికా ఫస్ట్పాలసీ ఇనిస్టిట్యూట్ అధిపతిగా ఉన్న బ్రూక్ నియామకంతో కేబినెట్ జాబితా దాదాపు పూర్తయ్యింది. దేశానికి నిజమైన వెన్నెముక అయిన అమెరికా రైతులను రక్షించేందుకు బ్రూక్ నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపారు. అమెరికా ఫస్ట్ అధ్యక్షురాలిగా ఉన్న బ్రూక్స్ ట్రంప్ మిత్రురాలు. ట్రంప్ తొలి పర్యాయంలో వైట్‌హౌస్ సహాయకురాలిగా పనిచేశారు. ఆఫీస్ ఆఫ్ అమెరికన్ ఇన్నోవేషన్ డైరెక్టర్‌గా, డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేశారు. వ్యవసాయ అనుబంధ కుటుంబం నుంచి వచ్చిన రోలిన్స్.. దేశవ్యాప్త వ్యవసాయ క్లబ్ అయిన 4హెచ్‌తో పాటు ఫ్యూచర్ ఫార్మర్స్ ఆఫ్ అమెరికాతోనూ మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్ డిగ్రీ అందుకున్న ఆమె తరువాత న్యాయవాదిగానూ పనిచేశారు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని పునఃసమీక్షించడంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. రోలిన్స్ ఎంపికతో ట్రంప్ కేబినెట్ జాబితా ఎంపిక దాదాపు పూర్తయ్యింది. ప్రతి అభ్యరి్థని సెనేట్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. 15 మంది సలహాదారుల బృందం అమెరికన్ ప్రభుత్వంలో ఒక బ్యూరోక్రటిక్ విభాగానికి నాయకత్వం వహిస్తుంది.ట్రంప్ టీమ్‌లోకి మరో భారతీయుడు ట్రంప్ అధికార బృందంలో మరో భారతీయుడు చేశారు. కోల్‌కతాలో పుట్టిన జై భట్టాచార్యను అమెరికా హెల్త్ ఏజెన్సీ డైరెక్టర్‌గా ట్రంప్ ఎంపిక చేశారు. స్టాన్‌ఫర్డ్‌లో చదివిన భట్టాచార్య వైద్యుడు, ఆర్థికవేత్త. ఎన్‌ఐహెచ్‌ను మార్చే ఆలోచనలను కాబోయే ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనయర్తో ఆయన ఇటీవల పంచుకున్నారు. అనంతరం ఆయనను ట్రంప్ తన టీమ్‌లోకి ఎంపిక చేశారు. -
దసరాకు ‘కేబినెట్’ ధమాకా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. దసరా పండుగ సమయంలో కొత్త మంత్రులను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. కేబినెట్ విస్తరణకు అడ్డంకులు తొలగినట్టేనని, ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే నెల 5వ తేదీ తర్వాత ఎప్పుడైనా కొత్త మంత్రులు కొలువుదీరనున్నారని నేతలు చెబుతున్నారు. ఎవరెవరికి చాన్స్ ఇవ్వాలన్న దానిపై మరోమారు చర్చలు జరిపి ఖరారు చేయనున్నట్టు వివరిస్తున్నారు.బెర్తుల కోసం పోటాపోటీనిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో గరిష్టంగా సీఎం సహా 18 మందికి మంత్రివర్గంలో చోటు ఉంటుంది. ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రులు ఉన్నారు. దీనితో మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే వెసులుబాటు ఉంది. వీటి కోసం తీవ్ర పోటీ నెలకొంది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. తమకంటే తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచే కాకుండా.. మిగతా జిల్లాల నుంచి కూడా డజను మందికి పైగా ఎమ్మెల్యేలు తమకు కేబినెట్ బెర్త్‌పై ఆశతో ఉన్నారు.ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి పరిశీలిస్తే.. మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), జి.వివేక్, జి.వినోద్, కె.ప్రేమ్‌సాగర్‌రావు (ఆదిలాబాద్), పి.సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్), దానం నాగేందర్, అమీన్ అలీఖాన్ (హైదరాబాద్) మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలు నాయక్ (నల్లగొండ), వాకిటి శ్రీహరి (మహబూబ్‌నగర్), టి.జీవన్‌రెడ్డి (కరీంనగర్) కూడా కేబినెట్ బెర్త్ కోసం ఒత్తిడి చేస్తున్నారు. వీరికితోడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం తదితరులు కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికన చాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.సామాజిక సమీకరణాలే ప్రాతిపదికగా..కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపింది. పీసీసీ అధ్యక్ష పదవికి, కేబినెట్ విస్తరణకు మధ్య సామాజిక వర్గాల వారీగా లెక్కలు కుదరకపోవడంతో నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేతను నియమించడంతో మిగతా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం మంత్రిమండలిలో ఏడుగురు ఓసీ వర్గానికి చెందినవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్టీ నేత ఉన్నారు. కులాల వారీగా చూస్తే నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం రెడ్లకే చెందిన మరో నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనున్నట్టు అంచనా. మాదిగ, ఎస్టీ (లంబాడా), బీసీ సామాజిక వర్గాలకు కూడా ఒక్కో బెర్త్ కేటాయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మిగతా రెండు పదవులు ఎవరికన్నది పార్టీ వెసులుబాటు ప్రకారం కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఇతర పదవుల భర్తీ కూడా..వివిధ వర్గాలకు మంత్రివర్గంలో స్థానంతోపాటు అసెంబ్లీలో చీఫ్ విప్, విప్ పదవులు కూడా ఇచ్చే చాన్స్ ఉంది. వీటితోపాటు కీలకమైన ఆర్టీసీ, మైనింగ్, ఎంఐడీసీ, మూసీ డెవలప్మెంట్ వంటి కీలక కార్పొరేషన్లకు ఎమ్మెల్యేలను చైర్మన్లుగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై సామాజిక వర్గాల కోణంలో నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. ఆయనతోపాటు సీఎం రేవంత్, సీనియర్ మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు ఢిల్లీ వెళ్లి.. అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. మొత్తమ్మీద దసరా పండుగకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ.. రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
ఏపీ మంత్రుల శాఖలపై ఇదేం సస్పెన్స్?
అమరావతి, సాక్షి: మంత్రులుగా ప్రమాణం చేసి 48 గంటలు ముగిసింది. అయినా కూడా ఇంకా శాఖలు కేటాయించలేదు. అసలు ఎవరికి ఏ శాఖ దక్కుతుందో అని మూడు పార్టీల శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ ఏపీ కేబినెట్ కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తులు పూర్తి చేశారా? లేదంటే తర్జన భర్జనలు పడుతున్నారా?.. ఇంకా ఏమైనా చర్చలు జరగాల్సి ఉందా?. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రంలోపు ఒక స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక మంత్రుల శాఖల జాబితా వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ, అది జరగలేదు. మరోవైపు కీలక శాఖలు మా నేతలకంటే మా నేతలకే దక్కుతాయంటూ ధీమాగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధానంగా పవన్‌తో పాటు నారా లోకేష్‌కు, అలాగే టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి ఏ శాఖ దక్కుతుంది అనేదానిపై ఉత్కంఠ నడుస్తోంది.ఏపీలో మొత్తం 25 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే.. టీడీపీ నుంచి 20, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు.. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. హోం, ఆర్థిక లాంటి కీలక శాఖలను చంద్రబాబు టీడీపీ దగ్గరే ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాన మిత్రపక్షంగా జనసేనకు డిప్యూటీ సీఎంతో పాటు ఏవైనా మూడు ముఖ్య శాఖల్ని కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున ఏకైక మంత్రి సత్యకుమార్‌కు దేవాలయ, ధర్మాదాయ ఇవ్వొచ్చనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.మంత్రలు శాఖల కేటాయింపు సస్పెన్స్‌కు నేడు తెర పడే అవకాశాలున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం తర్వాత సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. మంత్రుల జాబితాపై మరోసారి పునఃసమీక్ష జరిపి ఈ సాయంత్రం లేదంటే అర్ధరాత్రి పూర్తి జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
AP Cabinet: ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికో?
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్ర కూటమి నేడు అధికారం చేపట్టబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ.. 24 మంత్రులతో కూడిన జాబితా విడుదల విడుదలయ్యింది. వీళ్లందరితో కలిసే ముఖ్యమంత్రిగా ఇవాళ విజయవాడలో ప్రమాణం చేయబోతున్నారు ఆయన. అయితే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 25 స్థానాలు ఉన్నాయి. తనతో సహా 25(24 మంది మంత్రులు)తో కూడిన జాబితానే చంద్రబాబు రిలీజ్ చేశారు. అంటే.. ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేదంటే టీడీపీకా? అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్‌పోలియో కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఈ అంశంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.సంబంధిత వార్త: చంద్రబాబు కేబినెట్.. సామాజిక వర్గాల వారీగా చూస్తే..మంగళవారంనాడు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాక.. అర్ధరాత్రి దాటాక కొత్త మంత్రుల జాబితా విడుదల చేశారు. తొలుత జనసేనకు 4, బీజేపీ 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ, కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. ముందు నుంచి వినవస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు మంత్రులు కాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్‌కు బెర్త్ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలి అనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. -
Modi 3.0: మంత్రులు–శాఖలు
సీనియర్లకు మళ్లీ అవే శాఖలు... కేబినెట్ కూర్పుపై మోదీ ముద్ర -
Modi 3.0: కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే
న్యూఢిల్లీ: అనుభవానికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో యువతకు సముచిత ప్రాధాన్యమిస్తూ నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కసరత్తులో ఆసాంతం మోదీ–షా ముద్రే ప్రతిఫలించింది. పదేళ్లుగా మోదీ తొలి, మలి మంత్రివర్గాల్లో కీలకంగా వ్యవహరించిన బీజేపీ మంత్రులకు ఈసారీ ప్రాధాన్యం కొనసాగింది. హోం శాఖ బాధ్యతలు మరోసారి అమిత్ షానే చేపట్టగా రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ, నిర్మలా సీతారామన్ ఆర్థిక, జైశంకర్ విదేశాంగ శాఖల్లో కొనసాగనున్నారు. మోదీతో పాటు మొత్తం 72 మందితో ఆదివారం ఎన్డీఏ మంత్రివర్గం కొలువుదీరడం తెలిసిందే. మోదీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి సోమవారం శాఖలు కేటాయించారు. గత రెండుసార్లకు భిన్నంగా ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ మనుగడలో ఎన్డీఏ పక్షాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీ(యూ) తదితర భాగస్వాములకు శాఖల కేటాయింపులో సముచిత ప్రాధాన్యమే దక్కినా కీలక శాఖలన్నింటినీ బీజేపీయే అట్టిపెట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు స్పష్టంగా కని్పంచింది. కీలక శాఖలు కావాలని జేడీ(యూ), టీడీపీ ముందుగానే కోరినా కుదరదని బీజేపీ పెద్దలు స్పష్టం చేయడం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మక ప్రాధాన్యమున్న అత్యధిక పోర్టుఫోలియోలు బీజేపీ మంత్రులకే దక్కాయి. దేశవ్యాప్తంగా రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి, విస్తరణ, ఆధునీకరణలో తనదైన మార్కు చూపిన నితిన్ గడ్కీరీకి మరోసారి రోడ్లు–హైవే శాఖ దక్కింది. మోదీకి ప్రీతిపాత్రుడైన అశ్వినీ వైష్ణవ్‌కు కీలకమైన రైల్వే, ఐటీ–ఎలక్ట్రానిక్స్ శాఖలను కొనసాగించడమే గాక సమాచార–ప్రసార శాఖ బాధ్యతలు కూడా కట్టబెట్టడం విశేషం. గత ప్రభుత్వంలో ఆ బాధ్యతలు చూసిన అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం తెలిసిందే. ఆయనకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని వార్తలొస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్య, పీయూష్ గోయల్‌కు వాణిజ్య, పరిశ్రమల శాఖలను కొనసాగించారు. హర్దీప్సింగ్ పురికి పెట్రోలియం శాఖను కొనసాగిస్తూ హౌజింగ్–పట్టణ వ్యవహారాలను తప్పించారు. తొలుత న్యాయ, తర్వాత అర్త్ సైన్సెస్ బాధ్యతలు చూసిన కిరెణ్ రిజిజుకు ప్రధానమైన పార్లమెంటరీ వ్యవహారాలు అప్పగించారు. ‘మామ’కు వ్యవసాయం రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి చక్రం తిప్పి కొత్తగా మోదీ కేబినెట్లో చేరిన బీజేపీ దిగ్గజాలకు ప్రధాన శాఖలే కేటాయించారు. వారిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌కు కీలకమైన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. ఐదేళ్ల తర్వాత కేబినెట్లో అడుగు పెట్టిన బీజేపీ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డాకు మరోసారి మోదీ తొలి మంత్రివర్గంలో నిర్వర్తించిన ఆరోగ్య శాఖతో పాటు ఎరువులు–రసాయనాల శాఖ కూడా దక్కింది. ఇప్పటిదాకా ఆ రెండు శాఖలనూ మాండవీయ చూశారు. హరియాణా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు విద్యుత్‌తో పాటు పట్టణ వ్యవహారాలను అప్పగించారు. న్యాయ శాఖకు అర్జున్‌రాం మేఘ్వాల్, షిప్పింగ్‌కు సర్బానంద సోనోవాల్, పర్యావరణానికి భూపేందర్ యాదవ్, సామాజిక న్యాయానికి వీరేంద్ర కుమార్ కొనసాగారు. గిరిజన శాఖ బాధ్యతలు జ్యుయల్ ఓరంకు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి... మోదీ 3.0 మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కడం తెలిసిందే. వారిలో కిషన్‌కు బొగ్గు, గనులు, ఏపీ నుంచి టీడీపీకి చెందిన రామ్మోహన్‌కు విమానయానం రూపంలో కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి. గతంలో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టీడీపీ నేత అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా చేశారు. తెలంగాణ నుంచి బండి సంజయ్‌కుమార్, ఏపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవులు దక్కడం తెలిసిందే. బండికి హోం శాఖ కేటాయించారు. వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల రూపంలో రెండేసి శాఖల బాధ్యతలు అప్పగించారు. భాగస్వాములకు ఇలా... ఎన్డీఏ భాగస్వాముల్లో జేడీ(యూ) నేత లలన్‌సింగ్‌కు పంచాయతీరాజ్, మత్స్య–పశుసంవర్ధకం–పాడి శాఖలు దక్కాయి. వ్యవసాయ శాఖపై ఆశలు పెట్టుకున్న జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల బాధ్యతలు అప్పగించారు. హెచ్ఏఎం(ఎస్) చీఫ్ జితన్‌రాం మాంఝీకి ఎంఎస్ఎంఈ; ఎల్జేపీ (ఆర్వీ) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖలు దక్కాయి. భాగస్వామ్య పక్షాలకు ఐదు కేబినెట్, రెండు స్వతంత్ర, నాలుగు సహాయ పదవులివ్వడం తెలిసిందే. ఇక స్వతంత్ర హోదా మంత్రుల్లో శివసేన నుంచి జి.పి.జాదవ్‌కు ఆయు‹Ù, ఆరెల్డీ నేత జయంత్ చౌదరికి నైపుణ్యాభివృద్ధి శాఖలిచ్చారు. -
Mizoram Chief Minister Lalduhoma: ఎమ్మెల్యేలకు కొత్త కార్లు కొనబోము
ఐజ్వాల్: మిజోరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నూతన ముఖ్యమంత్రి లాల్దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కొత్త కార్లు కొనుగోలు చేయబోమని కరాఖండీగా చెప్పేశారు. కొత్త ప్రభుత్వం కొలువుతీరిన ప్రతిసారీ కొత్త కార్ల కొనుగోలుతో ప్రజాధనం వృథా అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల దిగిపోయిన మంత్రులు, ఓడిన ఎమ్మెల్యేలు వాడిన ప్రభుత్వ వాహనాలనే కొత్త మంత్రులు, శాసనసభ్యులు వాడుకోవాలని సూచించారు. -
తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేపు(గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర కేబినెట్‌తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించే దిశలో కసరత్తు చేస్తోంది. మరోవైపు, మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్ సాగర్‌రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. వరుసగా ఏఐసీసీ నేతలతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్‌తో ప్రమాణం చేసేది ఆరుగురేనని సమాచారం. ఒక డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ ఎవరనేది తేలాక.. మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలిసింది. తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ? 1. సీఎం - రేవంత్ రెడ్డి 2. డిప్యూటీ సీఎం - భట్టి విక్రమార్క 3. దామోదర రాజనర్సింహ ( మాదిగ) 4.గడ్డం వివేక్ ( మాల) 5. సీతక్క( ఎస్టీ) 6. పొన్నం ప్రభాకర్(గౌడ్) 7. కొండా సురేఖ ( మున్నూరు కాపు) 8. ఉత్తం కుమార్ రెడ్డి 9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 10. కోమటి రెడ్డి వెంకట రెడ్డి 11. మల్ రెడ్డి రంగారెడ్డి 12. తుమ్మల నాగేశ్వర రావు ( ఖమ్మం) 13. దుద్దిల్ల శ్రీధర్ బాబు( బ్రాహ్మణ) 14. షబ్బీర్ ఆలీ 15. జూపల్లి కృష్ణారావు 16. శ్రీహరి ముదిరాజ్ 17. వీర్లపల్లి శంకర్ (ఎంబిసి) స్పీకర్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి / శ్రీధర్ బాబు చదవండి: మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా.. -
గోవా మంత్రి రాజీనామా.. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకు అవకాశం
గోవా ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి నీలేష్ కాబ్రాల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలెక్సో సిక్వేరా రాష్ట్ర మంత్రివర్గంలోకి చేరేందుకు మార్గం సుగమం చేస్తూ ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం నుంచి వైదొలుగుతూ తన రాజీనామాను సమర్పించారు. అలెక్సో సిక్వేరా ఆదివారం సాయంత్రం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సిక్వేరా మరో ఏడుగురితో కలిసి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాగా అంతకుముందు రోజు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అవకాశం గురించి అడిగినప్పుడు ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే నీలేష్ కాబ్రాల్ రాజీనామా చేయడంతో అలెక్సో సిక్వేరా ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది. రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో అలెక్సో సిక్వేరా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఏడాది సెప్టెంబరులో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వీరిలో కనీసం ముగ్గురికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ఊహాగానాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అలెక్సో సిక్వేరాను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి మైఖేల్ లోబో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్న వారిలో ఉన్నారు. -
ఏపీలో సామాజిక విప్లవానికి సీఎం జగన్ నాంది
-
AP: ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రులు ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని నూతన మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. కేబినెట్లో మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. సీఎం జగన్ అప్పజెప్పిన పనిని బాధ్యతగా చేస్తానని తెలిపారు. చదవండి: ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే.. అదృష్టంగా భావిస్తున్నాం: రాజేంద్రనాథ్ సీఎం వైఎస్ జగన్ కేబినెట్లో పనిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని మంతి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. మూడేళ్లు సమర్ధవంతంగా పాలన కొనసాగిందన్నారు. అన్ని వర్గాలకు సముచితస్థానం కల్పిస్తూనే కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షం కావాలనే బురద జల్లేందుకు యత్నిస్తోందన్నారు. మంచి పేరు తెచ్చుకుంటా: అంబటి రాంబాబు మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. సీఎం వైఎస్.జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుంటానని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. వైఎస్. జగన్ టీమ్ లీడర్.. తామంతా మెంబర్స్. మంచి చేసినా చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు ఏనాడు మంత్రులకు విలువ ఇవ్వలేదన్నారు. టీడీపీ చేయలేని అద్భుత కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారు. చిత్తశుద్ధిగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటానని అంబటి రాంబాబు అన్నారు. ఎప్పటికీ మర్చిపోను: ఆర్కే రోజా సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోనని ఆర్కే రోజా అన్నారు. జగనన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశమిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేబినెట్లో మహిళ మంత్రిగా ఉండటం తన అదృష్టం అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పని చేస్తానన్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పని చేస్తానన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.. సీఎం జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీదిరి అప్పలరాజు అనే నేను..
-
తానేటి వనిత అనే నేను..
-
రాజన్న దొర అనే నేను..
-
పినిపె విశ్వరూప్ అనే నేను..
-
విడదల రజిని అనే నేను..
-
ఆర్కే రోజా అనే నేను..
-
పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే నేను..
-
మేరుగ నాగార్జున అనే నేను..
-
కె నారాయణ స్వామి అనే నేను..
-
ఉషశ్రీ చరణ్ అనే నేను..
-
కొట్టు సత్యనారాయణ అనే నేను..
-
కారుమూరి వెంకట నాగేశ్వరరావు అనే నేను..
-
అడగకుండానే సీఎం జగన్ వరం ఇచ్చారు: జోగిరమేష్
-
కొత్త మంత్రివర్గంపై వెల్లంపల్లి స్పందన
-
సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెడతా
-
నాకు ఏ శాఖ ఇచ్చినా ఒకే..
-
ఆ కుటుంబానికి తరతరాలు రుణపడి ఉంటా: మేరుగు నాగార్జున
-
ప్రమాణ స్వీకారానికి సిద్దమౌతున్న మంత్రులు
-
AP New Cabinet: జగన్ మార్క్.. సామాజిక న్యాయం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కేబినెట్ పునర్వవస్థీకరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అగ్రాసనం వేశారు. కేబినెట్ కూర్పులో పార్టీ అజెండా ప్రకారం ఎస్సీ, బీసీ వర్గాలకు మూడొంతులు ప్రాతినిధ్యం కల్పిస్తూనే సామాజిక సమతూకాన్ని కూడా పాటించారు. తొలి కేబినెట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించగా జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడుతున్న కేబినెట్లో ప్రాతినిధ్యం నాలుగుకు పెరిగింది. పార్టీపై నిబద్ధత, పనితీరు, సీనియారీటీ, నాయకత్వ పటిమ, సమర్థతలే కొలమానంగా మంత్రుల ఎంపిక జరిగింది. రెండేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల టీమ్‌గా సీఎం కేబినెట్లోకి ఏరికోరి మంత్రులను తీసుకున్నారు. జిల్లాల విభజన తరువాత ఏర్పడ్డ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం లభించడంపై జిల్లాల్లో పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగితేలుతున్నాయి. తొలి కేబినెట్లో మంత్రులుగా ఉన్న పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనితలకు మరోసారి చోటు కల్పించారు. కాకినాడ జిల్లా నుంచి ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తొలిసారి కేబినెట్లో అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం కలి్పంచగా ఎస్సీల నుంచి ఇద్దరికి, బీసీల నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. నాలుగోసారి మంత్రిగా విశ్వరూప్ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగ శిష్యుడైన విశ్వరూప్ నాలుగోసారి మంత్రి అవుతున్నారు. 2009లో వైఎస్ కేబినెట్లో తొలిసారి మంత్రిగా నియమితులైన విశ్వరూప్ వైఎస్ మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో కూడా కొనసాగారు. మంత్రిగా పదవీ కాలం ఆరు నెలలుండగానే మహానేతతో ఉన్న అనుబంధంతో పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి కోనసీమలో ఎస్సీ సామాజికవర్గంతో పాటు ఇతర సామాజికవర్గాల్లో మంచి పట్టు సాధించి సమర్థత కలిగిన నేతగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తొలి కేబినెట్లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కేబినెట్లోకి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. విశ్వరూప్‌ను కేబినెట్లో కొనసాగించడం ద్వారా కోనసీమ జిల్లాలో బలమైన సామాజికవర్గాల పరంగా మంచి ముద్ర వేస్తారని నేతలు విశ్లేషిస్తున్నారు. విశ్వరూప్ వివాదరహితుడిగా ఉండడం రెండోసారి మంత్రి పదవి దక్కడానికి ఒక కారణమైంది. మరోసారి కేబినెట్లోకి వేణు బీసీ సంక్షేమశాఖా మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రెండోసారి కేబినెట్లోకి తీసుకున్నారు. వేణు ఎంపిక ద్వారా బలహీనవర్గాలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి సీఎం సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడిగా ఆయన ఉండేవారు. కోనసీమలో రాజోలు ప్రాంతానికి చెందిన వేణు సమర్థతను గుర్తించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడిగా చేశారు. అనంతరం ఓదార్పు యాత్రలో జగన్మోహన్రెడ్డి వెంట నడిచిన వేణు నాటి నుంచి పార్టీ పట్ల విధేయతతో పనిచేశారు. శెట్టిబలిజల్లో బలమైన నేతగా ఉన్న వేణును రామచంద్రపురం నుంచి పోటీచేయించి ఎమ్మెల్యేను చేసి తొలి కేబినెట్లో మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు రెండోసారి కేబినెట్లో కూడా ప్రాతిని«ధ్యం కలి్పంచడం ద్వారా ఆ సామాజికవర్గానికి సముచిత స్థానం దక్కింది. వేణు వాగ్ధాటితో పార్టీ వాణిని బలంగా వినిపించడం, బీసీ సంక్షేమశాఖను సమర్థంగా నిర్వహించడం కూడా కలిసి వచ్చింది. శ్రమించిన వనితకు మరో చాన్స్ కొవ్వూరు నియోజకవర్గం ఏర్పాటు తరువాత తొలి మహిళా ఎమ్మెల్యే, మంత్రిగా తానేటి వనితకు రెండోసారి సీఎం జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో అవకాశం కలి్పంచారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరిన వనిత అప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించారు. సాధారణ గృహిణిగా ఉన్న వనిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీ ప్రగతిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019లో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యే అయిన వనిత తొలి కేబినెట్లో స్త్రీశిశుసంక్షేమశాఖ మంత్రిగా సమర్థవంతమైన సేవలందించారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా మహిళలకు ఆది నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొవ్వూరు నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఉన్న వనితకు మంత్రి పదవి కట్టబెట్టారు. సమర్థత, పార్టీలో సామాజిక సమతూకాలను బేరీజు వేసుకుని వనితకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించడంపై హర్షం వ్యక్తమవుతోంది. నిబద్ధతకు గుర్తింపు మూడు దశాబ్దాలపాటు తునిలో రాజకీయాలను శాసించిన యనమల వంటి రాజకీయ వటవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసిన తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాను ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్లో తొలిసారి తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో ఒక సైనికుడిలా పనిచేస్తూ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పోరాట పటిమతో పార్టీని విజయ పథం వైపు నడింపించడం తాజా మంత్రి వర్గంలో తీసుకోవడానికి దోహదం చేసింది. వాస్తవానికి తొలి కేబినెట్లోనే చాన్స్ దక్కుతుందని పార్టీ శ్రేణులు ఆశించాయి. చివరకు వివిధ సమీకరణల్లో ప్రభుత్వ విప్ లభించింది. అప్పుడే మలివిడత కేబినెట్లో బెర్త్ ఖాయమైంది. అందుకు అనుగుణంగానే కాకినాడ జిల్లా నుంచి రాజాను మంత్రి పదవి వరించింది. తుని నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు యనమల సోదరుడిపై గెలుపొందడమే కాకుండా నియోజకవర్గ టీడీపీ నేతలకు సింహస్వప్నంగా నిలిచారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి అక్రమ కేసులతో వేధింపులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీని వీడి పారీ్టలోకి రావాలని పలు ప్రలోభాలకు గురిచేసినా లెక్క చేయకుండా పార్టీ పైన, అధినేత జగన్‌పైన ఎంతో విశ్వాసంతో పార్టీ వెన్నంటి నిబద్ధతతో నిలవడం కలిసి వచ్చింది. కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలుంటే ఆరు నియోజకవర్గాల నుంచి కాపు సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మలి కేబినెట్లో రాజాకు అవకాశం కల్పించి ఆ సామాజిక వర్గానికి పెద్ద పీటేశారు. తునిలో ఆ సామాజికవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం ఇదే ప్రథమం. మంత్రి పదవి కూడా జగన్మోహన్రెడ్డి కేబినెట్లో దక్కడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆ సామాజికవర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కోనసీమకు జోడు పదవులు... జిల్లాల విభజన తరువాత కోనసీమకు జోడు పదవులు దక్కాయి. జిల్లాల పునర్విభజన తరువాత దాదాపు ఒకో జిల్లాకు ఒకో మంత్రి పదవి దక్కిన క్రమంలో కోనసీమ జిల్లాకు ఒకేసారి రెండు బెర్త్‌లు దక్కాయి. ఆ రెండు కూడా ఎస్సీ, బీసీలకే కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానం తేటతెల్లం అవుతోంది. కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు›కావడంతో ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టయ్యింది. అమలాపురం నుంచి విశ్వరూప్, రామచంద్రపురం నుంచి వేణులను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా సీనియర్లను కొనసాగించినట్టయింది. వైఎస్సార్ సీపీకి తొలి నుంచి వెన్నంటి నిలుస్తోన్న ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు ఈ కేబినెట్లో సముచిత స్థానం కల్పించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బీసీలు, కాపులు, మాల, మాదిగలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడంపై పార్టీ శ్రేణుల్లోనే కాకుండా మూడు జిల్లాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
కొత్త మంత్రులకు సీఎంఓ నుంచి ఫోన్
-
AP: కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు!
సాక్షి, అమరావతి: దాదాపు మూడేళ్ల తరవాత పునర్వ్యవస్థీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు రాబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్న కేబినెట్ నుంచి 10 మంది వరకూ... ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక కూర్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్ర కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 44 శాతం ఉండగా... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే మెజారిటీ సంఖ్యలో 56 శాతంగా ఉన్నారు. అయితే తాజా పునర్వ్యవస్థీకరణలో బలహీనవర్గాల శాతం మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చంద్రబాబు నాయుడి కేబినెట్లో 25 మంది మంత్రులకు గాను మెజారిటీ.. అంటే 13 మంది అగ్రవర్ణాల వారుండగా, బలహీనవర్గాలు 12 మందే ఉండి 48 శాతానికే పరిమితమయ్యారు. దానికి భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పీట వేసి వారిని రాజ్యాధికారంలో మరింత కీలక భాగస్వాములను చెయ్యాలనే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే 56 శాతం కేబినెట్ బెర్తులు వారికే కేటాయించారు. ఇపుడు ఆ సంఖ్యను మరింత పెంచబోతున్నారు. గవర్నరుకు రాజీనామాలు మంత్రివర్గంలో మొత్తం 25 మంది సభ్యులుండగా ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి మరణించడం తెలిసిందే. మిగిలిన 24 మంది మంత్రులూ పార్టీ బాధ్యతలు తీసుకోవటానికి స్వచ్ఛందంగా రాజీనామా చేయటంతో... వారి రాజీనామాలను ఆమోదించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపారు. వీటిని గవర్నర్ ఆమోదించాక రాజ్‌భవన్ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తుంది. అనంతరం కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్.. గవర్నర్‌కు పంపనున్నారు. మంత్రివర్గం కూర్పుపై సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కసరత్తు ఆదివారం మధ్యాహ్నానికి కొలిక్కి వస్తుందని, ఆ వెంటనే కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపుతారని వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటిదాకా ఉన్నవారు 10 మంది కొనసాగుతారని, కొత్తగా 15 మంది చేరుతారని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. వారందరికీ ఆదివారం మధ్యాహ్నం గవర్నర్‌కు జాబితా పంపించిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమాచారమిస్తారని, సోమవారంనాడు అందుబాటులో ఉండాల్సిందిగా చెబుతారని తెలియవచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాక్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తారు. కాగా 2019 జూన్ 8న కూడా మంత్రులు ఇదే ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లను వివిధ శాఖలకు విధులను అప్పగిస్తూ జీఏడీ (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కూడా సాధారణ పరిపాలన (ప్రోటోకాల్) విభాగం ఇప్పటికే సిద్ధం చేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కొత్త, పాత మంత్రులు, అతిధులకు మధ్యాహ్నాం 1 గంటకు సచివాలయంలో తేనేటీ విందు (హైటీ) ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాస్ ఉంటేనే అనుమతి నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వారు ప్రభుత్వం జారీ చేసిన అధికారిక పాస్‌లను వెంట తెచ్చుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే సభా స్థలంలోకి అనుమతిస్తామన్నారు. సోమవారం ఉదయం 10 గంటలలోపు రావాలన్నారు. కేవలం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే లోటస్ జంక్షన్ నుంచి కరకట్ట మీదుగా ప్రయాణించేందుకు నిర్ధేశించారని తెలిపారు. గుంటూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అభిమానులు, వాహనదారులు ఎన్ఆర్ఐ ఆసుపత్రి జంక్షన్, మంగళగిరి, డాన్‌బాస్కో స్కూల్, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా సభా స్థలికి చేరుకోవాలన్నారు. విజయవాడ, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారు ఉండవల్లి సెంటర్, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా రావాలని చెప్పారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం దృష్ట్యా తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు అందరూ సహకరించాలని కోరుతూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 11వతేదీన జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. చదవండి: AP: కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఐజీలు సి.త్రివిక్రమ వర్మ, రాజశేఖర్, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులుతో పాటు వీడియో సమావేశం ద్వారా గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాజీనామా చేసిన మంత్రులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
కొత్త మంత్రి వర్గంపై కన్నబాబు కామెంట్స్
-
కొత్త మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయి
-
కొలువుదీరిన రాజస్తాన్ కొత్త కేబినెట్
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సజావుగా సాగింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గానికి రూపకల్పన జరిగింది. మొత్తంగా 15 మంది కొత్త మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 11 మంది కేబినెట్ హోదా కలిగిన వారు కాగా, నలుగురు సహాయమంత్రులు ఉన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. కొత్త మంత్రివర్గంలో సచిన్ వర్గానికి చెందిన అయిదుగురికి చోటు లభించింది. గత ఏడాది ముఖ్యమంత్రి గహ్లోత్‌పై సచిన్ పైలెట్ తిరుగుబాట బావుటా ఎగురవేసిన సమయంలో ఆయన వెంట ఉంటూ వేటుని ఎదుర్కొన్న విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాలను తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు. పైలెట్ వర్గ ఎమ్మెల్యేలైన హేమరామ్ చౌధరి, బ్రిజేంద్రసింగ్ ఒలా, మురారిలాల్ మీనాలకు సహాయ మంత్రులు పదవులు దక్కాయి.కొత్త కేబినెట్‌పై సచిన్ సంతృప్తి వ్యక్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శుభసందేశాన్ని అందిస్తుందన్నారు.రాజస్థాన్ కాంగ్రెస్ ఐక్యంగా ముందుకు వెళుతుందని, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పారు. ప్రమాణ స్వీకారనంతరం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో చోటు కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సచిన్? ఉప ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్ష పదవుల్ని పోగొట్టుకున్న అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ పాత్ర కాంగ్రెస్‌లో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆసక్తి రేపుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సచిన్ పైలెట్ సమావేశమైనప్పుడు పార్టీలో తన స్థానంపై చర్చించారని, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని సోనియా హామీ ఇచ్చినట్టుగా పైలెట్ శిబిరం ప్రచారం చేస్తోంది. అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏదైనా రాష్ట్రానికి ఇన్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో రాష్ట్రానికి ఇన్చార్జ్గా వెళ్లినప్పటికీ రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సచిన్ కీలకంగా వ్యవహరించనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్ రాష్టానికే ఇన్చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రియాంకగాంధీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉండాలని సచిన్‌కి ఇప్పటికే అధిష్టానం సంకేతాలు పంపినట్టుగా సమాచారం. ఇక ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్ర్రాల్లోనూ సచిన్ స్టార్ క్యాంపైనర్‌గా కూడా వ్యవహరిస్తారు. -
Team Modi: బాధ్యతల్లో కొత్త మంత్రులు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో కొత్తగా చేరిన అశ్వినీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్, మన్సుఖ్ మాండవియా తదితరులు తమకు కేటాయించిన శాఖల మంత్రులుగా గురువారం బాధ్యతలు చేపట్టారు. మాజీ ఐఏఎస్ అధికారి అశ్వినీ వైష్ణవ్‌కు అత్యంత కీలకమైన రైల్వే శాఖతోపాటు కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించారని అన్నారు. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. రైల్వే, టెక్స్టైల్స్ శాఖల సహాయ మంత్రిగా దర్శనా విక్రమ్ జర్దోష్ చార్జ్ తీసుకున్నారు. అనురాగ్ ఠాకూర్ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ తనకు పెద్ద బాధ్యత కట్టబెట్టారని, చిత్తశుద్ధితో పనిచేస్తానని ఠాకూర్ అన్నారు. ఇక గుజరాత్‌కు చెందిన మన్సుఖ్ మాండవియా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ఉక్కు శాఖ మంత్రిగా రామచంద్రప్రసాద్ సింగ్, న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రిగా వీరేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇదే శాఖలో సహాయ మంత్రులుగా ప్రతిమా భౌమిక్, ఎ.నారాయణస్వామి బాధ్యతలు తీసుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా జితేంద్రసింగ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి, ఎంఎస్ఎంఈ మంత్రిగా నారాయణ్ రాణే, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రిగా పురుషోత్తం రూపాల బాధ్యతలు స్వీకరించారు. విద్యా శాఖ సహాయ మంత్రిగా సుభాష్ సర్కార్, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ముంజపారా మహేంద్రభాయ్ బాధ్యతలు చేపట్టారు. విద్యుత్ శాఖ మంత్రిగా రాజ్‌కుమార్ సింగ్, టెక్స్టైల్ శాఖ మంత్రిగా పీయూష్ గోయల్, పునరుత్పాదక ఇంధన వనరులు, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా భగవంత్ ఖుబా, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా భగవత్ కిషన్‌రావు కరాడ్, రక్షణ శాఖ సహాయ మంత్రిగా అజయ్ భట్ బాధ్యతలు స్వీకరించారు. -
MK Stalin Cabinet: తమిళనాడు కొత్త మంత్రులు వీరే!
చెన్నై: తమిళనాడు శాసనసభా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి సర్కారు శుక్రవారం కొలువుతీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రేపు ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు 34 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. రాజ్‌భవన్‌కు అందిన అధికారిక సమాచారం ప్రకారం మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి. 1. ఎంకే స్టాలిన్: ముఖ్యమంత్రి 2. దురైమురుగన్: జల వనరులు 3. కేఎన్ నెహ్రూ: పురపాలక కార్యకలాపాలు 4. ఐ. పెరియసామి: సహకార శాఖ 5. ఎన్. పొన్ముడి: ఉన్నత విద్య 6. ఈవీ వేలు: పబ్లిక్ వర్క్స్ 7. ఎంఆర్కే పన్నీరు సెల్వం: వ్యవసాయం, రైతు సంక్షేమం 8. కేకేఎస్‌ఆర్ రామచంద్రన్: రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ 9. తంగం థెన్నరసు: పరిశ్రమల శాఖ 10. ఎస్ రఘుపతి: న్యాయ శాఖ 11. ఎస్. ముత్తుసామి: గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి 12. కేఆర్ పెరియకరుప్పన్: గ్రామీణాభివృద్ధి శాఖ 13. టీఎం అంబారసన్: గ్రామీణ పరిశ్రమలు 14. ఎంపీ సామినాథన్: సమాచార, ప్రచార శాఖ 15. పి. గీతాజీవన్: సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత 16. అనిత ఆర్ రాధాకృష్ణన్: మృత్స్యకార, జంతు పరిరక్షణ 17. ఎస్ఆర్ రాజకన్నప్పన్: రవాణా శాఖ 18. కే రామచంద్రన్: అటవీ శాఖ 19. ఆర్ చక్రపాణి: ఆహార, పౌర సరఫరా 20: వీ. సెంథిల్ బాలాజీ: విద్యుత్, ప్రొబిషన్, ఎక్సైజ్ 21. ఆర్ గాంధీ: చేనేత, టెక్స్టైల్స్ శాఖ 22. ఎంఏ సుబ్రమణియన్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం 23. పి. మూర్తి: వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ 24. ఎస్ఎస్ శివశంకర్: బీసీ సంక్షేమం 25. పీకే శేఖర్‌బాబు: దేవాదాయ శాఖ 26. పళనివేల్ త్యాగరాజన్: ఆర్థిక, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ 27. ఎస్ఎమ్ నాజర్: పాలు, డెయిరీ డెవలప్మెంట్ 28. జిగ్నీ కేఎస్ మస్తాన్: మైనారిటీ, ఎన్నారై సంక్షేమం 29. అన్బిల్ మహేశ్ పొయ్యమొళి: పాఠశాల విద్య 30. శివ వీ మెయ్యనాథన్: పర్యావరణ శాఖ 31. సీవీ గణేశన్: కార్మిక సంక్షేమం, నైపుణ్య శిక్షణ 32. టి మనో తంగరాజా: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 33. ఎం మతివెంతన్: పర్యాటక శాఖ 34. ఎన్కే సెల్వరాజ్: ఆది ద్రవిడ సంక్షేమం -
న్యూజిలాండ్ మంత్రికి కేటీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్ : న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41)కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రధాని జెసిండా మంత్రివర్గంలో చేరనున్న ప్రియాంకకు అభినందనలు అంటూ ఆయన సోమవారం ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ దేశంలో ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయురాలు అంటూ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జెసిండాను కూడా ఆయన అభినందించారు. (జెసిండా మరో సంచలనం) Many congratulations to our friend @priyancanzlp on being appointed as Minister in the New Zealand Govt👍 Priyanca Radhakrishnan is the first Indian to be elevated to this position in NZ; My compliments to Prime Minister @jacindaardern on her fabulous leadership & poll victory👏 pic.twitter.com/3Xmqt97zui — KTR (@KTRTRS) November 2, 2020 -
జెసిండా మరో సంచలనం
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మరో సంచలననిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన పార్లమెంటులలో ఒకటిగా తీర్చి దిద్దుతున్నారు. మాజీ ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ను ఉప ప్రధానమంత్రిగా ప్రకటించారు. అంతేకాదు విదేశాంగ మంత్రిగా నానియా మహూతాను నియమించారు. 20మంది సభ్యుల మంత్రివర్గంలో ఐదుగురు కొత్త మంత్రులను తీసుకున్నారు. కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్డౌన్ వల్ల ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం చేస్తున్న సమయంలో హెలికాప్టర్ మనీ (ప్రజలకు నేరుగా ఉచితంగా డబ్బును పంపిణీ) అంటూ తీవ్రచర్చకు తెరతీసిన గ్రాంట్ రాబర్ట్సన్ మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు విదేశాంగ మంత్రిగా నానియా మహూతా గడ్డం మీద సాంప్రదాయ మావోరి మోకో కాయే పచ్చబొట్టుతో నాలుగేళ్ల క్రితం (1996లో) దేశంలోని మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలిగా ఖ్యాతి గడించిన మహూతా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. విదేశాంగమంత్రి పదవి చేపట్టనున్న తొలి స్వలింగ సంపర్కురాలు మెహుతా. మునుపటి విదేశాంగ మంత్రి విన్‌స్టన పీటర్స్ కూడా మావోరికి చెందిన వారే కావడం విశేషం. భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ మరోవైపు భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41) జెసిండా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించ నున్నారు. గృహ హింస బాధిత మహిళలు, వలస కార్మికుల తరపున పోరాడుతున్న ప్రియాంకా 2017లో తొలిసారి లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికల్లో రెండోసారి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన జెసిండా తాజాగా తన క్యాబినెట్‌ను విభిన్నంగా తీర్చిద్దిదారు. ప్రతిభ, యోగ్యత కలిగినవారికే తన మంత్రివర్గంలో చోటిచ్చామని ఇందుకు చాలా గర్వంగా ఉందని ఆమె ప్రకటించారు. రాబోయే మూడేళ్ళు తాము సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ప్రధాని జెసిండా వెల్లింగ్టన్లో విలేకరులతో అన్నారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని, ఈ ప్రభావం తమపై కూడా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయనున్నామనే విశ్వాసాన్ని ఆమె వెల్లడించారు. -
హరీశ్‌కు ఆర్థికం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు నియమితులయ్యారు.కేటీఆర్‌కు మళ్లీ పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖలు దక్కాయి. సబితా ఇంద్రారెడ్డికి విద్యా శాఖ, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమం, ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాలు, సత్యవతి రాథోడ్‌కు ఎస్టీ, స్త్రీ, శిశు సంక్షేమం, పువ్వాడ అజయ్‌కుమార్‌కు రవాణా శాఖలను కేటాయించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆదివారం కొత్తగా చేరిన ఈ ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సలహా మేరకు శాఖలను కేటాయిస్తూ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో కొందరు ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. హరీశ్, కేటీఆర్‌లకు కేటాయించిన శాఖలను ఇప్పటివరకు సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. జగదీశ్‌రెడ్డి విద్యా శాఖను కోల్పోగా, ఆయనకు మళ్లీ ఇంధన శాఖను కేటాయించారు. గత మంత్రివర్గంలో సైతం ఆయన ఇంధన శాఖను కలిగి ఉన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించిన ఎస్టీ సంక్షేమ శాఖను సత్యవతి రాథోడ్‌కు, బీసీ సంక్షేమం గంగుల కమలాకర్‌కు కేటాయించారు. దీంతో కొప్పుల వద్ద ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, వికలాంగ, వయోజనుల సంక్షేమ శాఖలు మిగిలాయి. వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్వహించిన రవాణా శాఖను పువ్వాడ అజయ్‌కుమార్‌కు కేటాయించారు. చామకూర మల్లారెడ్డి నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖను సత్యవతి రాథోడ్‌కు అప్పగించారు. కీలకమైన రెవెన్యూ, నీటిపారుదల, గనుల శాఖలను సీఎం కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన, అమలుపై స్వీయ పర్యవేక్షణ కోసం సీఎం స్వయంగా ఈ శాఖలను నిర్వహించనున్నారు. గత మంత్రివర్గంలో పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖల మంత్రిగా తనదైన ముద్ర వేసిన కేటీఆర్‌కు మళ్లీ అవే శాఖలను కేటాయించారు. -
గోవా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా కేబినెట్లో ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి చెందిన ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థి ఒకరికి ఉద్వాసన పలికారు. వీరి స్థానంలో ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి పదవులు దక్కాయి. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మృదులా సిన్హా.. చంద్రకాంత్ కవ్లేకర్, జెన్నిఫర్ మొన్సర్రెట్, ఫిలిప్ నెరి రొడ్రిగ్స్‌తోపాటు బీజేపీకి చెందిన మైఖేల్ లోబోతో ప్రమాణం చేయించారు. 2017 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి లేని సమయంలో మనోహర్ పారికర్ ప్రభుత్వం ఏర్పాటులో జీఎఫ్‌పీ కీలకంగా నిలిచింది. బీజేపీపై జీఎఫ్‌పీ విమర్శలు కేబినెట్ నుంచి తమను తప్పించడం ద్వారా బీజేపీ మోసానికి పాల్పడిందని జీఎఫ్‌పీ అధ్యక్షుడు, మంత్రివర్గం నుంచి వైదొలగిన డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్ ఆరోపించారు. ఆయన శనివారం దివగంత సీఎం మనోహర్ పారికర్ మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘పారికర్ రెండుసార్లు చనిపోయారు. భౌతికంగా మార్చి 17వ తేదీన ఒకసారి, రాజకీయ సిద్ధాంతాలను చంపడం ద్వారా నేడు మరోసారి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జీఎఫ్‌పీ విమర్శలను సీఎం తోసిపుచ్చారు. -
కొత్త మంత్రులు.. వీరే!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా చేపట్టబోతున్న కేంద్ర మంత్రిమండలి పునర్య్వవస్థీకరణలో తొమ్మిదిమంది కొత్తవారికి చోటు లభించింది. వీరితో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. 9మంది కొత్త మంత్రుల గురించి క్తుప్తంగా వివరాలివి.. అనంత్‌కుమార్ హెగ్డే కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఐదోసారి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణారోగ్యం, స్వయం సహాయక సంఘాలు తదితర రంగాల్లో సేవలందించే ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. శివ ప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన ఆ రాష్ట్రంలో గతంలో 8 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, విద్య, జైళ్ల శాఖల్లో సంస్కరణలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యునిగా ఉన్నారు. సత్యపాల్ సింగ్ మాజీ ఐపీఎస్ అధికారి అయిన సింగ్ ప్రస్తుతం యూపీలోని బాగ్పత్ నుంచి ఎంపీగా ఉన్నారు. హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా, లాభదాయక పదవుల సంయుక్త కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏపీ, మధ్యప్రదేశ్‌లలో నక్సలైట్ల నియంత్రణకు కృషిచేసినందుకు 1990లో ప్రత్యేక సేవా పతకాన్ని అందుకున్నారు. 1990ల్లో ముంబైలో వ్యవస్థీకృత నేర వ్యవస్థ నడ్డి విరిచినందుకు ప్రశంసలందుకున్నారు. ముంబై, పుణె నగరాల పోలీస్ కమిషనర్‌గానూ పనిచేశారు. అశ్వినీ కుమార్ చౌబే బిహార్‌లోని బక్సర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర జౌళి మండలిలో సభ్యుడైన చౌబే గతంలో బిహార్ శాసనసభకు వరసగా ఐదు సార్లు ఎన్నికయ్యారు. 1974–75లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో వచ్చిన బిహార్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లపాటు పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యం తదితర మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. రాజ్‌కుమార్ సింగ్ మాజీ ఐఏఎస్ అధికారి అయిన రాజ్‌కుమార్ ప్రస్తుతం బిహార్‌లోని ఆరా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సిబ్బంది, పింఛన్లు, ప్రజా ఫిర్యాదులపై ఏర్పాటైన వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా ఉన్నారు. గతంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు. వీరేంద్ర కుమార్ మధ్యప్రదేశ్‌లోని టికంగఢ్ ఎంపీ అయిన వీరేంద్ర ప్రస్తుతం కార్మిక సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడు. ఇప్పటికి ఆరు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ, బాల కార్మికులపై పీహెచ్డీ చేసిన ఆయన గతంలోనూ పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. హర్దీప్ సింగ్ పూరి పంజాబ్‌కు చెందిన మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అయిన హర్దీప్ సింగ్‌కు విదేశాంగ వ్యవహారాలపై మంచి పట్టుంది. ప్రస్తుతం ఆయన అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన ఆర్ఐఎస్ అనే మేధో సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో న్యూయార్క్‌లోని అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. గజేంద్ర సింగ్ షెకావత్ ప్రస్తుతం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా, ఫెలోషిప్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు చేరువగా ఉంటారు. బాస్కెట్‌బాల్‌లో జాతీయ స్థాయి పోటీల్లో ఆడారు. ప్రస్తుతం భారత బాస్కెట్‌బాల్ ఆటగాళ్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆల్ఫోన్స్ కణ్ణాంథనం కేరళకు చెందిన ఆల్ఫోన్స్ మాజీ ఐఏఎస్ అధికారి. ఢిల్లీ అభివృద్ధి సంస్థ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో 15 వేల అక్రమ నిర్మాణాలను కూల్చేసి పేరు తెచ్చుకున్నారు. తద్వారా 1994లో టైమ్స్ మేగజీన్ ప్రచురించిన 100 ప్రపంచ యువ నాయకుల జాబితాలో చోటు సంపాదించారు. -
కొత్త మంత్రులకు టాయిలెట్ కష్టాలు
-
ఏపీ కేబినెట్లోకి కొత్త మంత్రులు
-
కొత్త మంత్రులు ఏమన్నారంటే..
సాక్షి హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ర్ట తొలి కేబినెట్లో చోటు సాధించడం తమ అదృష్టమని కొత్త మంత్రులు పేర్కొన్నారు. మంగళవారం ప్రమాణస్వీకారం అనంతరం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కేబినెట్లో స్థానం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలపడంతోపాటు, మంత్రులుగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషిచేస్తామని చెప్పారు. కొత్త మంత్రుల అభిప్రాయాలు వారి మాటల్లోనే... రాష్ట్ర అభివృద్ధికి పోరాడతా: ఇంద్రకరణ్ తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్లో స్థానం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. తెలంగాణ కోసం ఎంతో పోరాడా... స్వరాష్ర్టం అభివృద్ధికి మరింత పోరాడతాను. తెలంగాణ అభివృద్ధిలో సహకరించాలనే సీఎం ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరా. జిల్లా అభివృద్ధి కోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి పనిచేస్తాను. శభాష్ అనిపించుకుంటా: తుమ్మల తెలంగాణ పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడమే నా ప్రధాన లక్ష్యం. ఎప్పుడో వందల ఏళ్ల క్రితమే తెలంగాణలో చెరువుల నిర్మాణం ద్వారా 260 టీఎంసీల నీటి నిల్వ జరిగింది. ఇప్పుడు ఆ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. రహదారులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి శభాష్ అనిపించుకుంటా. నా అదృష్టం: లక్ష్మారెడ్డి పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ అదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం. నవ తెలంగాణ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. 50 ఏళ్లలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేయలేకపోయిన అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపిస్తాం. ఉద్యమనేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం ఆనందకరం. అలాంటి నేత నేతృత్వంలో పనిచేయడం నా అదృష్టం. పెండింగ్ ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేస్తాం. -
ముందు తేనీటి విందు ఆ తర్వాతే ప్రమాణం
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తన కేబినెట్‌ను ఆదివారం మధ్యాహ్నం విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణకు ముందు కొత్తగా ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రులకు ప్రధాని మోడీ తేనీటి విందు ఇవ్వనున్నారు. ఈ విందులో కొత్తగా మంత్రి పదవి చేపట్టేవారితోపాటు పాత మంత్రులు కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే కొత్తగా మంత్రి పదవి చేపట్టే ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన ఎంపీలకు పీఎంవో ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దాంతో పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గం. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. -
కేంద్ర మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి స్థానం?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గంలో 20 మంది కొత్తవారికి స్థానం లభించనున్నట్లు తెలిసింది. మనోహర్ పారిక్కర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ యాడీ, తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ, ఏపీ నుంచి సుజనా చౌదరి, బెంగాల్ నుంచి బబుల్ సుప్రియో, పంజాబ్ నుంచి విజయ్ సంప్లా, పాట్నా ఎంపి రామ్ కృపాల్ యాదవ్, మోహన్ కుందయ్య పేర్లు ఖరారయ్యాయి. జేపీ నడ్డా, అజయ్ టమ్టా, జయంత్ సింగ్, బీరేందర్ సింగ్, గిరాజ్ సింగ్, కల్నల్ సోనారామ్ చౌదరి, గజేంద్ర సింగ్ షెకావత్, హన్స్‌రాజ్ అహియ్, రమేష్ బయాస్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సురేష్ ప్రభుకు కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉంది. ఇద్దరు కేబినెట్ మంత్రులకు డిమోషన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన ఎంపీలు మంత్రివర్గంలో చేరేది లేనిది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మహారాష్ట్రలో బీజేపి- శివసేన పార్టీల మధ్య సమస్యలు పరిష్కారం కానందున ఆ పార్టీ ఎంపీల ప్రమాణం స్వీకారంపై సందేహం నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవలేకపోయానని శివసేనకు చెందిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత గీతే చెప్పారు. ఇదిలా ఉండగా, కొత్త మంత్రులు ప్రమాణస్వీకారానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ వారికి తేనీటి విందు ఇస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ** -
కొత్త మంత్రులు ఏం చెప్పారు?
ఢిల్లీ: కేంద్రంలో కొత్త మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై స్పందించారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించడానికి సిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తామని కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ చెప్పారు. ధరల పెరుగుదలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఎగుమతులు పెంచడానికి కృషి చేస్తానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. మీడియాను నియంత్రించే ఆలోచనలు ఏవీ లేవని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. మీడియాకు తన బాధ్యత ఏంటో తెలుసన్నారు. తనకు తానుగా మీడియా నియంత్రించుకోగలదన్న భావన వ్యక్తం చేశారు. సురక్షిత ప్రయాణం, భద్రత, వేగం ఇవే తమ ప్రాధాన్యతలని రైల్వే మంత్రి సదానందగౌడ చెప్పారు. సీబీఐ విశ్వసనీయత పెంచడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని పీఎంఓ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. జమ్మూకాశ్మీర్‌కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేక హోదా అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. మేనిఫెస్టోలో తామిచ్చిన హామీలు నెరవేరుస్తామని పార్లమెంటరీ వ్యవహారాల, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.