న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గంలో 20 మంది కొత్తవారికి స్థానం లభించనున్నట్లు తెలిసింది. మనోహర్ పారిక్కర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ యాడీ, తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ, ఏపీ నుంచి సుజనా చౌదరి, బెంగాల్ నుంచి బబుల్ సుప్రియో, పంజాబ్ నుంచి విజయ్ సంప్లా, పాట్నా ఎంపి రామ్ కృపాల్ యాదవ్, మోహన్ కుందయ్య పేర్లు ఖరారయ్యాయి.
జేపీ నడ్డా, అజయ్ టమ్టా, జయంత్ సింగ్, బీరేందర్ సింగ్, గిరాజ్ సింగ్, కల్నల్ సోనారామ్ చౌదరి, గజేంద్ర సింగ్ షెకావత్, హన్స్రాజ్ అహియ్, రమేష్ బయాస్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సురేష్ ప్రభుకు కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉంది. ఇద్దరు కేబినెట్ మంత్రులకు డిమోషన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శివసేన ఎంపీలు మంత్రివర్గంలో చేరేది లేనిది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మహారాష్ట్రలో బీజేపి- శివసేన పార్టీల మధ్య సమస్యలు పరిష్కారం కానందున ఆ పార్టీ ఎంపీల ప్రమాణం స్వీకారంపై సందేహం నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవలేకపోయానని శివసేనకు చెందిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత గీతే చెప్పారు.
ఇదిలా ఉండగా, కొత్త మంత్రులు ప్రమాణస్వీకారానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ వారికి తేనీటి విందు ఇస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు.
**
కేంద్ర మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి స్థానం?
Published Sat, Nov 8 2014 11:48 PM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement
Advertisement