ముందు తేనీటి విందు ఆ తర్వాతే ప్రమాణం | Before Swearing-In, Tea With PM Modi for New Ministers | Sakshi
Sakshi News home page

ముందు తేనీటి విందు ఆ తర్వాతే ప్రమాణం

Published Sun, Nov 9 2014 10:45 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Before Swearing-In, Tea With PM Modi for New Ministers

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తన కేబినెట్ను ఆదివారం మధ్యాహ్నం విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణకు ముందు కొత్తగా ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రులకు ప్రధాని మోడీ తేనీటి విందు ఇవ్వనున్నారు. ఈ విందులో కొత్తగా మంత్రి పదవి చేపట్టేవారితోపాటు పాత మంత్రులు కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే కొత్తగా మంత్రి పదవి చేపట్టే ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన ఎంపీలకు పీఎంవో ఫోన్ ద్వారా సమాచారం అందించింది.

దాంతో పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గం. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement