సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేపు(గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర కేబినెట్‌తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించే దిశలో కసరత్తు చేస్తోంది.
మరోవైపు, మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్ సాగర్‌రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు.
మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. వరుసగా ఏఐసీసీ నేతలతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్‌తో ప్రమాణం చేసేది ఆరుగురేనని సమాచారం. ఒక డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ ఎవరనేది తేలాక.. మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలిసింది.
తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ?
1. సీఎం - రేవంత్ రెడ్డి
2. డిప్యూటీ సీఎం - భట్టి విక్రమార్క
3. దామోదర రాజనర్సింహ ( మాదిగ)
4.గడ్డం వివేక్ ( మాల)
5. సీతక్క( ఎస్టీ)
6. పొన్నం ప్రభాకర్(గౌడ్)
7. కొండా సురేఖ ( మున్నూరు కాపు)
8. ఉత్తం కుమార్ రెడ్డి
9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
10. కోమటి రెడ్డి వెంకట రెడ్డి
11. మల్ రెడ్డి రంగారెడ్డి
12. తుమ్మల నాగేశ్వర రావు ( ఖమ్మం)
13. దుద్దిల్ల శ్రీధర్ బాబు( బ్రాహ్మణ)
14. షబ్బీర్ ఆలీ
15. జూపల్లి కృష్ణారావు
16. శ్రీహరి ముదిరాజ్
17. వీర్లపల్లి శంకర్ (ఎంబిసి)
స్పీకర్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి / శ్రీధర్ బాబు
చదవండి: మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా..
Comments
Please login to add a commentAdd a comment