ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. నిర్ణయాలివే | Telangana Cabinet Meeting Updates CM Revanth Comments | Sakshi
Sakshi News home page

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. నిర్ణయాలివే

Published Thu, Aug 1 2024 3:48 PM | Last Updated on Thu, Aug 1 2024 7:16 PM

Telangana Cabinet Meeting Updates CM Revanth Comments

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌ 1లో జరిగిన ఈ కేబినెట్‌ భేటీ  దాదాపు గంటన్నరపాటు సాగింది.

కేబినెట్ నిర్ణయాలు..

  • యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

  • ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగు‌రోడ్డు వరకూ విస్తరించే  ముసాయిదా బిల్లుకు ఆమోదం..

  • కొత్త రేషను‌కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం..

  • హైదరాబాద్ అభివృద్ధికి విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణాలను సమకూర్చుకునే అంశానికి  కేబినెట్ నిర్ణయం

  • క్రికెటర్ సిరాజ్, నిఖత్ జరిన్‌కు  ఆర్థిక సాయం, గ్రూప్ 1 డీఎస్పీ పోస్టు కేటాయింపు..

  • ధరణి పోర్టల్‌ను భూమాతగా మారుస్తూ కేబినెట్‌ నిర్ణయం

  • రేపు జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ప్రభుత్వం

  • నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరవడానికి కేబినెట్‌ ఆమోదం

  • ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ పేర్లను గవర్నర్‌కు మరోసారి రకమండ్‌ చేశాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • ఇటీవల విది నిర్వాహాణలో చనిపోయిన ఉన్నతస్థాయి ఉధ్యోగుల పిల్లలకు ఉద్యోగాలు.
  • గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం 437 కోట్లు కేటాయింపు.
  • గోదావరి నీటిని  మల్లన్న సాగర్‌కు  అక్కడి నుంచి శామిర్ పేట్ చెరువు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు  తరలించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement