మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే! | BJP elects biren singh as new chief minister candidate of manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే!

Published Mon, Mar 13 2017 6:17 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే! - Sakshi

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే!

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోడానికి సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం తమ నాయకుడిగా నాంగ్ తొంబమ్ బీరేన్ సింగ్‌ను ఎన్నుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గాను గవర్నర్‌ను కలిసి తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల వివరాలన్నీ ఇస్తామని ఆయన చెప్పారు.

మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది సభ్యులుండగా ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 31 మంది మద్దతు అవసరం అవుతుంది. తమకు 32 మంది మద్దతు ఉందని బీజేపీ చెబుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ నజ్మా హెప్తుల్లా కూడా బీజేపీ వాదనతో ఏకీభవించారు. పెరేడ్‌కు మొత్తం 32 మంది రావడంతో వాళ్లకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించి ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌ను రాజీనామా చేయాలని చెప్పారు. తొలుత కాదన్నా.. 24 గంటల్లోగా రాజీనామా చేసేందుకు ఇబోబి సింగ్ అంగీకరించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement