న్యూఢిల్లీ: రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ మూడు రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రుల ఎంపికపై దృష్టి పెట్టింది. పార్టీ సీనియర్ నేతలు సోమవారం సమాలోచనల్లో మునిగిపోయారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రుల ఎంపికపై అభిప్రాయాలు పంచుకున్నారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇందుకోసం అతిత్వరలో మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. కొత్త సీఎంలు ద ఇప్పటివరకైతే అధికారికంగా ఎవరూ నోరువిప్పలేదు. బీజేపీ అధిష్టానం గుంభనంగా వ్యవహరిస్తోంది. మూడు రాష్ట్రాల్లోనూ ఆశావహులు చాలామందే ఉన్నారు. సీఎం పదవే లక్ష్యంగా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు.
ఇక్కడ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్రసింగ్ తోమర్‌తోపాటు సీనియర్ నేత విజయ్‌వర్గియా కూడా రేసులో ఉన్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజస్తాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తమ ప్రయత్నాలు ఆపడం లేదు. రాజస్తాన్‌లో మహంత్ బాలక్‌నాథ్ యోగి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో అరుణ్ కుమార్ సావో, ధర్మలాల్ కౌషిక్, మాజీ ఏఐఎస్ అధికారి ఓ.పి.చౌదరి సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. వీరంతా ఓబీసీ వర్గానికి చెందిన నాయకులే.
Comments
Please login to add a commentAdd a comment