three states
-
బీజేపీ సీఎంలను ఎంపిక చేసేది వీరే
న్యూఢిల్లీ: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికకు బీజేపీ హై కమాండ్ కసరత్తు ప్రారంభించింది. సీఎంల ఎంపిక కోసం ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల కొత్త సీఎంల ఎంపిక కోసం పరిశీలకులను ఆయా రాష్ట్రాలకు పంపనుంది. రాజస్థాన్‌కు పరిశీలకులుగా వెళ్లనున్న వారిలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ముండా ఛత్తీస్‌గఢ్‌కు పరిశీలకులుగా వెళ్లనున్నారు. వీరితో కలిపి మూడు రాష్ట్రాలకు మొత్తం 9 మంది పరిశీలకులను బీజేపీ అధినాయకత్వం పంపనుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాల్లో గతంలో సీఎంలుగా పనిచేసిన వారిని కాకుండా కొత్త ముఖాలను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసే ఆలోచనలో పార్టీ హై కమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే అక్కడ సీఎంల ఎంపిక ఇంత ఆలస్యమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి.. సహజీవనం ప్రమాదకరమైన జబ్బు -
Assembly Elections 2023: మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై బీజేపీ కసరత్తు!
న్యూఢిల్లీ: రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ మూడు రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రుల ఎంపికపై దృష్టి పెట్టింది. పార్టీ సీనియర్ నేతలు సోమవారం సమాలోచనల్లో మునిగిపోయారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రుల ఎంపికపై అభిప్రాయాలు పంచుకున్నారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం అతిత్వరలో మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. కొత్త సీఎంలు ద ఇప్పటివరకైతే అధికారికంగా ఎవరూ నోరువిప్పలేదు. బీజేపీ అధిష్టానం గుంభనంగా వ్యవహరిస్తోంది. మూడు రాష్ట్రాల్లోనూ ఆశావహులు చాలామందే ఉన్నారు. సీఎం పదవే లక్ష్యంగా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్రసింగ్ తోమర్‌తోపాటు సీనియర్ నేత విజయ్‌వర్గియా కూడా రేసులో ఉన్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజస్తాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తమ ప్రయత్నాలు ఆపడం లేదు. రాజస్తాన్‌లో మహంత్ బాలక్‌నాథ్ యోగి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో అరుణ్ కుమార్ సావో, ధర్మలాల్ కౌషిక్, మాజీ ఏఐఎస్ అధికారి ఓ.పి.చౌదరి సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. వీరంతా ఓబీసీ వర్గానికి చెందిన నాయకులే. -
కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ మితిమీరిన ఆత్మవిశ్వాసం
-
మళ్లీ మధ్యప్రదేశ్ లో బీజేపీదే గెలుపు
-
మూడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ/బనశంకరి: నిషేధిత ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్రలపై దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు బుధవారం మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. బిహార్‌లోని కతీహర్ జిల్లా, కర్ణాటకలోని దక్షిణ కన్నడ, షిమోగా జిల్లాలు, కేరళలోని కాసర్గోడ్, మలప్పురం, కోజికోడ్, తిరువనంతపురం జిల్లాల్లో మొత్తం 25 చోట్ల ఈ సోదాలు జరిగాయి. అనుమానితుల నివాసాల్లో సోదాలు చేపట్టినట్లు ఎన్ఐఏ అధికారులు తెలియజేశారు. మొబైల్ ఫోన్లు, హార్డ్‌డిస్కులు, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్‌లు, డేటా కార్డులు, ఇతర డిజిటల్ పరికరాలు, పత్రాలు, పీఎఫ్ఐకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ సోదాల్లో రూ.17.50 లక్షల నగదు లభ్యమైందని వివరించారు. భారత్‌లో విధ్వంసకర కార్యకలాపాల కోసం పీఎఫ్ఐకి విదేశాల నుంచి హవాలా డబ్బు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల కర్ణాటకలోని బంట్వాళ, పుత్తూరుల్లో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. కేరళలోని కాసరగోడ్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పీఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఎన్ఐఏ గుర్తించింది. కశ్మీర్‌లోనూ... శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, బుద్గామ్ జిల్లాల్లో మూడు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి చెప్పారు. పాక్ దన్నున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్–బదర్, అల్‌కాయిదా ఉగ్ర సంస్థల అనుబంధ సంస్థల సభ్యులు, సానుభూతిపరుల నివాసాల్లో సోదాలు జరిగాయి. ద రెసిస్టెన్స్ ఫోర్స్, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్–జమ్మూకశ్మీర్, ముజాహిదీన్ గజ్వాత్–ఉల్–హింద్, జమ్మూకశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్, కశ్మీర్ టైగర్స్, పీపుల్స్ యాంటీ–ఫాసిస్ట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థలు ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చాయి. -
ఏవోసీబీలో కూంబింగ్ ముమ్మరం
సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా–ఛత్తీస్‌గఢ్ (ఏవోసీబీ) సరిహద్దుల్లోని ట్రై జంక్షన్ ప్రాంతంలో పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతల కదలికల నేపథ్యంలో మన్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మంగళవారం, విశాఖ మన్యంలో బుధవారం జరిగిన వరుస ఎన్కౌంటర్లతో మన్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎదురుకాల్పుల నుంచి కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్ అలియాస్ మహేందర్‌రెడ్డి, అరుణ తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి అర కి.మీ. దూరంలోని మరో ప్రాంతంలో వారు ఉండటంతో కాల్పుల మోత వినగానే తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది మావోయిస్టుల రక్షణతో వారు ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుల్లోని కట్ ఆఫ్ ఏరియాలోని ట్రై జంక్షన్ వైపు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకే వారి కోసం మూడు వైపుల నుంచి కుంబింగ్‌ను ముమ్మరం చేశారు. ట్రై జంక్షన్‌లోనే అగ్రనేతలు? ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (ఏఓబీజెడ్‌సీ) ఆధ్వర్యంలో మళ్లీ కేడర్‌ను బలోపేతం చేసుకోవాలని మావోయిస్టులు సన్నద్ధమవుతన్నట్లు నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం అందింది. జూన్–జులైలలో అందుకోసం పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారని కూడా పసిగట్టాయి. దీంతో బస్తర్ కేంద్రంగా మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు గత నెలలో సమావేశమైనట్లు సమాచారం. వరుస లొంగుబాట్లు, ఆనారోగ్య సమస్యలతోపాటు కరోనాతో కూడా మావోయిస్టులు గత కొద్దిరోజులుగా బలహీనపడిన నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా గాలింపు చర్యలు చేపట్టాలని వారు నిర్ణయించారు. శిక్షణా తరగతుల నిర్వహణకు ఇతర ప్రాంతాల నుంచి అగ్రనేతలు వచ్చేవరకు వేచి చూడాలని ముందుగానే నిర్ణయించారు. ఇంతలో అగ్రనేతలు చేరుకున్నారన్న సమాచారం రావడంతో గ్రేహౌండ్స్, కోబ్రా, ఎస్పీఎఫ్, ఐటీబీటీ, బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా జూన్ రెండోవారం నుంచి కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో.. ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో సోమ, మంగళవారాల్లో జరిగిన ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం తీగలంమెట్ట వద్ద బుధవారం ఎన్కౌంటర్లో ఇద్దరు డివిజన్ కమిటీ సభ్యులతోపాటు ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనలతో మల్కనగిరి, విశాఖ మన్యంలలో ఎన్కౌంటర్లపై మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించి కూంబింగ్‌ను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్, అరుణలు 40 మంది మావోయిస్టుల రక్షణతో ట్రై జంక్షన్‌కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దాంతోపాటు ఏఓబీజెడ్‌సీ ఇన్చార్జ్ డుడుమలతోపాటు మరికొందరు అగ్రనేతలు ఆ ప్రాంతంలోనే ఉండొచ్చన్నది పోలీసు ఉన్నతాధికారుల అంచనా. అగ్రనేతల్లో ఎవరు ఉండొచ్చన్న దానిపై అప్పుడే ఏమీ చెప్పలేమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కానీ, ఆ ప్రాంతంలో భారీస్థాయిలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని.. ఇన్ఫార్మర్లు చెప్పినదాన్ని బట్టి ఒకరిద్దరు అగ్రనేతలు కూడా ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. దీంతో ఏఓసీబీలో పోలీసు బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. -
22న మూడు రాష్ట్రాల సీఈల భేటీ
సాక్షి, హైదరాబాద్:రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) కాల్వల ఆధునికీకరణ పనుల అంశంలో మళ్లీ కదలిక వచ్చింది. వీటిని పూర్తి చేయాలని గత నెలలో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదించిన నేపథ్యంలో దీనిపై 3 రాష్ట్రాల ఉమ్మడి సమావేశం జరపా లని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల చీఫ్ ఇంజనీర్లతో కలిపి హైదరాబాద్‌లో ఈ నెల 22న సీడబ్ల్యూసీ కార్యాలయంలో ఈ భేటీ జరపనుంది. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుం చి 7టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీల మేర లభ్యమవుతోంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆన కట్ట పొడవును మరో 5అంగుళాలు పెంచాలని నిర్ణయించగా, కర్ణాటక సైతం అంగీకరించింది. ఈ కాల్వల ఆధునికీకరణకు కర్ణాటకకు రాష్ట్రం రూ.92.74కోట్లు డిపాజిట్ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ–1 పనులను 24%, ప్యాకేజీ–2పనులను మరో 54% వరకు పూర్తి చేసింది. ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునికీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో అవి నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రానికి ఏటా 4 టీఎంసీలు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ఉమ్మడి భేటీని ఈ నెల 22న జరిపేందుకు సీడబ్ల్యూసీ నిర్ణయించింది. -
మనమే గెలిపించాం
-
ఒపీనియన్ పోల్స్ : మూడు రాష్ట్రాల్లో బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మూడు కీలక రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలతో సత్తా చాటనుందని తాజా ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీకి కీలక రాష్ట్రాల్లో ఓటమి తప్పదని స్పష్టమైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీర్ఘకాలంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీని రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందని ఈ సర్వే అంచనా. వేసింది. రాజస్ధాన్‌లో ఓటర్లు సీఎం పదవికి కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సచిన్ పైలట్ వైపు అత్యధికంగా మొగ్గు చూపారు. కాగా 15 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టే స్ధితిలో ఉందని ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. రాజస్ధాన్‌లో సీఎం వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత తీవ్రస్ధాయిలో నెలకొనడంతో అక్కడ కాంగ్రెస్ సులభంగా విజయం సాధించనుందని సర్వే అంచనా వేసింది. ఇక మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ఇరు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతంలో కొద్దిపాటి తేడా ఉన్నా కాంగ్రెస్‌కు స్వల్ప మొగ్గు ఉండటంతో అధికార పగ్గాలు ఆ పార్టీకి దక్కే అవకాశం ఉందన్నది సర్వే అంచనా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌కు 142 స్ధానాలు దక్కుతాయని, బీజేపీ కేవలం 56 స్ధానాలకు పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. యువనేత సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న ఓటర్లు 36 శాతం కాగా, ప్రస్తుత సీఎం వసుంధరా రాజేకు 27 శాతం ఓటర్లు సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌ను సీఎంగా 24 శాతం మంది కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో.. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు122 స్ధానాలు దక్కుతాయని ఒపీనియన్ పోల్స్ అంచనా వేశాయి. 90 మంది సభ్యులు కలిగిన చత్తీస్‌గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మేజిక్కు ఫిగర్‌ను దాటి 47 స్ధానాలు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా 108, 40 స్ధానాలకు పరిమితమవుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్‌లనే తదుపరి సీఎంలుగా ఎక్కువ మంది ఓటర్లు కోరుకోవడం గమనార్హః. కాంగ్రెస్, బీజేపీలకు మధ్యప్రదేశ్‌లో వరుసగా 42.2 శాతం 41.5 శాతం ఓట్లు దక్కువచ్చని, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 38.9 శాతం, బీజేపీకి 38.2 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. రాజస్ధాన్‌లో మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం ఉంటుందని సర్వే అంచనా వేసింది. రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌కు 49.9 శాతం, బీజేపీకి 34.3 శాతం ఓట్లు పోలవుతాయని పేర్కొంది. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 మధ్య ఎన్నికలు జరుగుతాయని ఈసీ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా నలుగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును ఏప్రిల్ 29 వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతే కాకుండా జలవివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించొద్దని కోర్టు ఈ సందర్భంగా మూడు రాష్ట్రాలకూ హితవు పలికింది. ఎక్కువ వాయిదాలు కోరకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అయితే గెజిట్ లో తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే. -
ఏపీ, తెలంగాణలకు కేంద్రం విద్యుత్ కేటాయింపు
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాలకు అదనంగా విద్యుత్ కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు ఇచ్చేసిన 693 మెగావాట్ల విద్యుత్‌ను ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కేటాయించారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు వరకు తెలంగాణకు 222 మెగావాట్ల విద్యుత్ కేటాయించారు. ఏప్రిల్ 1 నుంచి ఏపీకి 304, కేరళకు 167 మోగావాట్లు విద్యుత్ కేటాయించారు. అక్టోబరు 1 నుంచి మార్చి చివరి వరకు తెలంగాణకు 374 మోగావాట్లు, కేరళకు 319 మోగావాట్ల విద్యుత్ కేటాయించారు. -
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!
సాధారణంగా ఎవరికైనా ఒక దెబ్బకు రెండు పిట్టలు పడ్డాయంటారు. కానీ కమలనాథులకు మాత్రం ఒకే దెబ్బకు ఏకంగా మూడు పిట్టలు పడ్డాయి. హర్యానాలో స్పష్టమైన మెజారిటీ సాధించి, తొలిసారి ఎమ్మెల్యే అయిన మనోహర్ లాల్ ఖట్టర్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన బీజేపీ జాతీయ నేతలు.. మహారాష్ట్రలో ముందు మొండికేసిన శివసేనను కూడా చివరకు లొంగదీసుకున్నారు. వాళ్లంతట వాళ్లే కాళ్ల బేరానికి వచ్చేలా చేసుకుని అక్కడ దేవేంద్ర ఫడ్నవిస్ లేదా మరో నేత చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు అంతా రంగం సిద్ధం చేశారు. ఈ రెండూ ముందునుంచి అనుకున్నవే. కానీ ఇప్పటికిప్పుడే వచ్చిన మరో ఛాన్సు.. ఢిల్లీ సర్కారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో చాలా కాలం నుంచి రాష్ట్రపతి పాలనే కొనసాగుతోంది. అక్కడ ఎవరిని అధికారంలో కూర్చోబెట్టాలా అనే విషయమై అనేకసార్లు తర్జనభర్జన జరిగింది. చివరకు హస్తినపీఠాన్ని కూడా కమలనాథులకే కట్టబెట్టాలని నిర్ణయించారు. బీజేపీ నాయకులను ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మొన్నామధ్య ఓ లేఖ రాశారు. దీనికి ప్రణబ్ నుంచి కూడా సానుకూలంగా సమాధానం వచ్చింది. ఇక ఒకటి రెండు లాంఛనాలను మాత్రం పూర్తిచేసుకుని.. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని పిలవడమే తరువాయి. ఇలా ఒక్క దెబ్బకు మూడు పిట్టలు పడగొట్టి, కమలనాథులు వరుస విజయాలను సాధించగలిగారు. -
బాబ్లీ ప్రాజెక్టు పై సుప్రీంలో విచారణ
-
మూడు రాష్ట్రాల్లో 15 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లోని 15 శాసనసభ స్థానాలకు ఆగస్టు 21న ఉపఎన్నికలు జరగనున్నాయి. బీహార్‌లోని 10, కర్ణాటకలోని 3, పంజాబ్‌లోని 2 సీట్లకు వీటి నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ శనివారం తెలిపింది. ఈ సీట్లకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేల్లో కొందరు లోక్‌సభకు ఎన్నిక కావడం, మరికొందరు రాజీనామా చేయడంతో ఎన్నికలు అవసరమయ్యాయి. బీహార్‌లోని నర్కాతియాగంజ్, రాజ్‌నగర్, జలే, చప్రా, హాజీపూర్, మొహీనుద్దీన్ నగర్, పర్బత్తా, భాగల్పూర్, బంకా, మొహానియా లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలోని షికారిపుర, బళ్లారి రూరల్, చిక్కోడిలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. షికారిపుర ఎమ్మెల్యే యడ్యూరప్ప, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే శ్రీరాములు, చిక్కోడి ఎమ్మెల్యే ప్రకాశ్ హుక్కేరి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడంతో అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేశారు. షికారిపుర నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర, బళ్లారి రూరల్ నియోజకవర్గం నుంచి శ్రీరాములు సోదరి శాంత పోటీకి దిగే అవకాశాలున్నాయి.