న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాలకు అదనంగా విద్యుత్ కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు ఇచ్చేసిన 693 మెగావాట్ల విద్యుత్ను ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కేటాయించారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు వరకు తెలంగాణకు 222 మెగావాట్ల విద్యుత్ కేటాయించారు.
ఏప్రిల్ 1 నుంచి ఏపీకి 304, కేరళకు 167 మోగావాట్లు విద్యుత్ కేటాయించారు. అక్టోబరు 1 నుంచి మార్చి చివరి వరకు తెలంగాణకు 374 మోగావాట్లు, కేరళకు 319 మోగావాట్ల విద్యుత్ కేటాయించారు.