Power allocation
-
ఏపీలో ఆల్ టైం హై విద్యుత్ వినియోగం!
-
రాష్ట్రానికి ‘కేంద్ర’ విద్యుత్ 85 శాతమే
- పునర్విభజన చట్టంలోని ‘4 వేల మెగావాట్ల’ హామీకి చిల్లు - రామగుండం విద్యుత్‌పై ఈఆర్సీ బహిరంగ విచారణలో ఎన్టీపీసీ స్పష్టత సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు’ నుంచి రాష్ట్రానికి 85 శాతం(3400మెగావాట్ల) విద్యుత్ కేటాయింపులే ఉన్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) వెల్లడించింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామగుండంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన 15 శాతం విద్యుత్‌ను ఎవరికి కేటాయించాలన్న అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికీ కేటాయించని పక్షంలో అది రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉం దని పేర్కొంది. తొలిదశలో నిర్మిస్తున్న 1600(2‘800) మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఎన్టీపీసీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)పై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) సోమవారం ఇక్కడ బహిరంగ విచారణ నిర్వహించింది. విచారణలో పాల్గొన్న ఎన్టీపీసీ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున పూర్తిగా 4వేల మెగావాట్లను రాష్ట్రానికే కేటాయించాలని ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ కోరగా ఎన్టీపీసీ తరఫున ఏజీఎం సుదర్శన్ పైవిధంగా బదులిచ్చారు. పెరుగుతున్న ఎన్టీపీసీ విద్యుత్ ధరలపై ఈఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విద్యుత్ ధరలను సూచనాప్రాయంగానైనా తెలిపే అవకాశం ఉందా అని ఎన్టీపీసీని ప్రశ్నించింది. ఎన్టీపీసీ విద్యుత్ ధరలను సీఈఆర్సీ నిర్ణయిస్తుందని ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలా ఉండగా డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేయడంలో విఫలమైతే వర్తింపజేసే పెనాల్టీని విద్యుత్‌ను సరఫరా చేయడంలో ఎన్టీపీసీ విఫలమైనా వర్తింపజేయాలని ఈఆర్సీ విజ్ఞప్తి చేసింది. పీపీఏకు సవరణలు తప్పనిసరి.. బహిరంగ విచారణలో చర్చకు వచ్చిన అంశాలపై పీపీఏకు సవరణలు చేయాల్సిందేనని ఈఆర్సీ చైర్మన్ స్పష్టం చేశారు. మార్పులను సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని, నాలుగు వారాల్లో ఆ మేర సవరణలు పూర్తి చేయాలన్నారు. బై-అవుట్ నిబంధన పెట్టాలి ‘ఒప్పంద కాలం 25 ఏళ్లలో పెట్టుబడి వ్యయం కంటే కొన్ని రేట్లు అధిక రాబడిని ఎన్టీపీసీ సంపాదించనుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును తెలంగాణ డిస్కంలు బై-అవుట్ చేసుకునేలా పీపీఏలో నిబంధన పెట్టాల’ని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్ రావు సూచించారు. -
రాష్ట్రానికి ‘ఝజ్జర్’ కాంతులు
వచ్చే నెల నుంచి 222 మెగావాట్లు ఊహించని విధంగా కేంద్రం విద్యుత్ కేటాయింపులు అక్టోబర్ నుంచి 374 మెగావాట్లకు పెంపు సెప్టెంబర్ వరకు ఏపీకీ 304 మెగావాట్లు ఢిల్లీ వదులుకున్న వాటాను పంచిన కేంద్ర సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అనూహ్యంగా కేంద్రం నుంచి 222 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు లభించాయి. వేసవి అవసరాలను తీర్చేందుకు అదనపు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా ఈ కరెంటు అందుబాటులోకి రావడం అధికారవర్గాలను ఆశ్చర్యపరిచింది. హరియాణాలోని ఝజ్జర్ జిల్లాలో ఉన్న ‘ఇందిరాగాంధీ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు’(ఐజీఎస్టీపీఎస్) నుంచి ఉత్పత్తవుతున్న 693 మెగావాట్లను గతంలో కేంద్రం ఢిల్లీకి కేటాయించగా.. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరెంటును కేంద్రానికి తిరిగిచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పునఃకేటాయింపుల్లో భాగంగా.. ఈ విద్యుత్ నుంచి 304 మెగావాట్లను ఆంధ్రప్రదేశ్‌కు, 222 మెగావాట్లను తెలంగాణకు, 167 మెగావాట్లను కేరళకు కేటాయించింది. మూడు రాష్ట్రాలకు వచ్చే నెల(ఏప్రిల్) 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ విద్యుత్ పంపిణీ జరగనుంది. తర్వాత అక్టోబర్ నుంచి తెలంగాణకు ఝజ్జర్ నుంచి వచ్చే కోటా 374 మెగావాట్లకు పెరగనుంది. ఈ మేరకు 2015 అక్టోబర్ 1 - 2016 మార్చి 31 మధ్య కాలంలో ఝజ్జర్ విద్యుత్ పంపిణీలో భాగంగా మరో కోటాను కేంద్రం నిర్ణయించింది. మొత్తం 693 మెగావాట్లలో తెలంగాణకు 374 మెగావాట్లు, కేరళకు 319 మెగావాట్లు కేటాయించింది. ఈ మేరకు జరిపిన పునః కేటాయింపులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ)కు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.గుహ ఈ నెల 19న లేఖ రాశారు. -
ఏపీ, తెలంగాణలకు కేంద్రం విద్యుత్ కేటాయింపు
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాలకు అదనంగా విద్యుత్ కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు ఇచ్చేసిన 693 మెగావాట్ల విద్యుత్‌ను ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కేటాయించారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు వరకు తెలంగాణకు 222 మెగావాట్ల విద్యుత్ కేటాయించారు. ఏప్రిల్ 1 నుంచి ఏపీకి 304, కేరళకు 167 మోగావాట్లు విద్యుత్ కేటాయించారు. అక్టోబరు 1 నుంచి మార్చి చివరి వరకు తెలంగాణకు 374 మోగావాట్లు, కేరళకు 319 మోగావాట్ల విద్యుత్ కేటాయించారు. -
ఏపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది
విద్యుత్ అంశంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు విద్యుత్‌తోపాటు హైకోర్టు విభజన, ఐటీ హబ్‌పై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు సాక్షి, న్యూఢిల్లీ: పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం తమకు రావాల్సిన విద్యుత్ కేటాయింపుల విషయంలో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కేంద్రం దృష్టికి తెచ్చింది. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలపై పరిష్కారానికి నియమించిన నీరజా మాథుర్ కమిటీకి సైతం త్వరగా నివేదికను సమర్పించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రు, టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో పాటు కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి, నీరజా మాథుర్ కమిటీతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి అంశాల వారీగా వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో పంటలు ఎండిపోతున్నా విభజన చట్టంలో పేర్కొన్న వాటా ప్రకారం విద్యుత్ పంపిణీ చేయకుండా.. ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్కే సిన్హాకు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. పీపీఏలను రద్దు చేయడంతోపాటు కృష్ణపట్నం ప్లాంట్ నుంచి తెలంగాణకు విద్యుత్ రాకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని, తెలంగాణ రైతులకు కేసీఆర్‌పై వ్యతిరే కత తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చామని వారు పేర్కొన్నారు. తర్వాత నీరజా మాథుర్‌ను కలసి త్వరగా నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఈ నివేదిక వస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి అంశంలో ఏదోఒకటి అడ్డు చెబుతూ మాథుర్ కమిటీ నివేదిక రాకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రామచంద్రు ఆరోపించారు. నివేదిక ఇవ్వడానికి డిసెంబర్ 30 వరకు సమయం ఉందని, త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని నీరజామాథుర్ చెప్పినట్టు వెల్లడించారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అంశాన్ని త్వరగా తేల్చాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడకు విజ్ఞప్తి చేసినట్టు ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడతానని.. పది రోజుల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఇక హైదరాబాద్ పరిసరాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలను కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దృష్టికి తెచ్చామని తెలిపారు.