మణిపూర్‌లో అలర్ట్‌.. ప్రభుత్వానికి మైటీల 24 గంటల డెడ్‌లైన్‌ | Meitei Group Issues 24-Hour Ultimatum For State Govt | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో అలర్ట్‌.. ప్రభుత్వానికి మైటీల 24 గంటల డెడ్‌లైన్‌

Published Sun, Nov 17 2024 11:37 AM | Last Updated on Sun, Nov 17 2024 11:46 AM

Meitei Group Issues 24-Hour Ultimatum For State Govt

ఇంపాల్‌: మణిపూర్‌లో మళ్లీ హింస చేలరేగింది. కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు మైథీ వర్గానికి చెందిన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో పీక్‌ స్టేజ్‌కు మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హత్య చేసిన వారిని 24 గంట్లలో అరెస్ట్‌ చేసి శిక్షించాలని మైథీ వర్గం డిమాండ్‌ చేస్తున్నారు.

తాజాగా కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు జిరిబం జిల్లాలో ఆరుగురిని హత్య చేసి ఓ నది వద్ద పడేశారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 10 నెలల చిన్నారి కూడా ఉండటం.. ఈ ఘటన అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో, ఇంపాల్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇంఫాల్ వెస్ట్‌లో సగోల్ బంద్‌లో ఉంటోన్న సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నిరసనకారులు నినాదాలు చేశారు. రోడ్లపై ఫర్నీచర్లను తగులబెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, పలు జిల్లాలో నిరసనలు పెరగడంతో అధికారులు రెండు రోజులు పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో పాటు కర్ఫ్యూ విధించారు.

ఈ సందర్భంగా మైథీ పౌర హక్కుల సంఘం మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ ప్రతినిధి ఖురైజామ్ అథౌబా మాట్లాడుతూ.. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి రాష్ట్రాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలందరూ కలిసి కూర్చుని కొన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి. మణిపూర్ ప్రజలు సంతృప్తి చెందేంత వరకు వారు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే, ప్రజల అసంతృప్తిని చవిచూడాల్సి వస్తుంది. అన్ని సాయుధ సమూహాలపై కొన్ని నిర్ణయాత్మక చర్యలు, సైనిక అణిచివేత చర్యలు తీసుకోవాలని మేము భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిలిటెంట్లపై వెంటనే సైనిక చర్య తీసుకోవాలని, AFSPAని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల్లోగా మా డిమాండ్లను నెరవేర్చకుంటే తీవ్ర ప్రజాపోరాటం తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మోహరించిన AFSPA బలగాలను కేంద్రం వెనక్కు తీసుకెళ్లాలని మణిపూర్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement