ఇంఫాల్ : కరోనా ఫ్రీ స్టేట్‌గా ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు వారాల తర్వాత మణిపూర్‌లో తాజాగా కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 33 ఏళ్ల వ్యక్తి బుధవారం ముంబై నుంచి అద్దె వాహనంలో మణిపూర్‌కు చేరుకున్నాడు. కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలడంతో జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జెఎన్‌ఐఎంఎస్) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి చికిత్స కోసం ముంబై వెళ్లడంతో అక్కడే కరోనా సోకిందేమో అని అనుమానిస్తున్నారు. అతని తల్లికి కూడా కరోనా సోకినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. (లాక్‌డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం )
ఏప్రిల్ 19న రాష్ర్టంలో వైరస్ భారిన పడ్డ ఇద్దరు కోలుకున్నారని, దీంతో ఇప్పడు కరోనా ఫ్రీ రాష్ర్టంగా మణిపూర్ ఉందని ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ప్రకటించారు. దాదాపు మూడు వారాల తర్వాత మళ్లీ కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడం రాష్ర్టంలో ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతుంది.గడిచిన 24 గంటల్లోనే 3,967 కొత్త కరోనా కేసులు నమోదుకాగా, 100 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో 82 వేలకు చేరువులో కేసుల సంఖ్య ఉంది. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 2,649 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 51,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (మా రాష్ట్రంలో కరోనా లేదు: సీఎం )
Comments
Please login to add a commentAdd a comment