
ఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని కేంద్రం శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. కేరళ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, చత్తీస్‌ఘడ్, మణిపూర్‌లో కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆరు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని కేంద్రం వివరించింది.
కాగా గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 46,617 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,58,251కి చేరింది. గురువారం కోవిడ్‌తో 853 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 4,00,312కు పెరిగింది. ఒక్కరోజులో 59,384 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 2,95,48,302 దాటింది. ప్రస్తుతం 5,09,637 లక్షల యాక్టీవ్ కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment