![Another Encounter In Chhattisgarh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Encounter.jpg.webp?itok=750kj_Xg)
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అడవుల్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన జవాన్లను హెలికాప్టర్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజాపూర్ జిల్లా కేంద్రంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
కాగా, మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నెలరోజుల్లో 100 మందికిపైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, నారాయణ్‌పూర్, బస్తర్ సహా పలు మావోయిస్టులు హవా ఉన్న జిల్లాల్లో భద్రతా బలగాలు, పోలీసుల ఆపరేషన్లు వేగవంతం చేశాయి. భద్రతా బలగాలు.. నక్సల్స్ ఎదురుపడగానే కాల్పులు జరుపుతున్నాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈ ఎన్‌కౌంటర్‌లలో భారీగా నక్సల్స్ మృతి చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు, నక్సల్స్‌కు జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మందికిపైగా మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో మరో మావోయిస్టు అగ్రనేత కూడా చనిపోయిన సంగతి తెలిసిందే.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/17_26.png)
Comments
Please login to add a commentAdd a comment