మాతృభాష రాకుంటే ఆటో పర్మిట్లు కూడా రావు!
మాతృభాషలో అనర్గళంగా మాట్లాడటం వచ్చా? రాకుంటే వెంటనే '30 రోజుల్లో మాతృభాష' పుస్తకాన్ని కొనుక్కొని నేర్చేసుకోండి. అది కూడా నవంబర్ 1 లోగా. ఎందుకంటే ఆ తర్వాతి నుంచి మాతృభాష రాకుంటే ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడం కల్ల. అదృష్టవశాత్తు ఈ నిబంధన విధించింది తెలుగు రాష్ట్రాలు కాదు.. పక్కనున్న మహారాష్ట్రలో!
నవంబర్ 1 నుంచి మరాఠీ మాట్లాడగలిగిన ఆటో డ్రైవర్లకు మాత్రమే పర్మిట్లు ఇస్తామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రౌతే మంగళవారం ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వలస వచ్చినవారిపై మరాఠా అతివాదులు కొందరు దాడులు చేసిన నేపథ్యంలో తాజాగా విధించనున్న మరాఠీ భాషా నియమం ఎన్ని సమస్యలకు దారితీస్తుందో చూడాలి.